అక్షాంశ రేఖాంశాలు: 24°56′N 73°49′E / 24.93°N 73.82°E / 24.93; 73.82

నాథద్వారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nathdwara
View of Nathdwara city, Rajsamand district, Rajasthan, India
View of Nathdwara city, Rajsamand district, Rajasthan, India
Nickname: 
Shreenathji ki nagri
Nathdwara is located in Rajasthan
Nathdwara
Nathdwara
Location in Rajasthan, India
Nathdwara is located in India
Nathdwara
Nathdwara
Nathdwara (India)
Coordinates: 24°56′N 73°49′E / 24.93°N 73.82°E / 24.93; 73.82
Country India
StateRajasthan
DistrictRajsamand
Elevation
585 మీ (1,919 అ.)
జనాభా
 (2011)[1]
 • Total42,016
Time zoneUTC+5:30 (IST)
PIN
313301
ISO 3166 codeRJ-IN
Vehicle registrationRJ-30

నాధ్ ద్వారా, పడమటి భారతదేశంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఊరు. ఇది అరావళి కొండలలో బనాస్ నది తీరంలో రాజసమంద్ జిల్లాలో ఉంది. ఉదయపూరుకు ఈశాన్యంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీనాధ్‌జీ విగ్రహ ప్రతిష్ఠితమైన కృష్ణాలయము కారణంగా ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయములోని అవతార పురుషుడైన కృష్ణుడు 7 సంవత్సరాల బాలుడి విగ్రహంగా దర్శనమిస్తాడు. మథురలో పూజింపబడుతున్న ఈ విగ్రహం 1672లో మథుర సమీపంలో యమునాతటంలో ఉన్న గోవర్ధనగిరి నుండి తరలించబడి 6 మాసాల కాలం ఆగ్రాలో ఉంది. మొగలు సామ్రాజ్యాధినేత హిందూధర్మ వ్యతిరేకతా విధానాల నుండి రక్షించడానికి తరలించబడింది. నాధ్‌ద్వారా అంటే శ్రీనాధ్‌జీ ద్వారం అని అర్ధం. వల్లాభచార్యుల చేత స్థాపించబడిన పుష్టి మార్గం లేక వల్లభ సంప్రదాయ లేక శుద్ధ ద్వైత సంప్రదాయానికి ఈ వైష్ణవాలయం అయిన నాధ్‌ద్వారా ఒక ప్రతీక. వల్లభాచార్యులు రాజస్థాన్ ప్రజల చేత విఠల్‌జీతో సమానంగా గౌరవాదరణలను అందుకున్నారు. నాధ్‌ద్వారా శ్రీనాధ్‌జీ ప్రతిష్ఠ తరువాత ఇక్కడి దైవమైన శ్రీనాధ్‌జీ పేరుతో కూడా పిలువబడుతుంది.

శ్రీనాధ్‌జీ ఆలయం

[మార్చు]

మతవిశ్వాసాలను అనుసరించి నాధ్‌ద్వరా శ్రీనాధ్‌జీ ఆలయం నిర్మాణం శ్రీనాధ్‌జీ నిర్ణయించిన ప్రదేశంలో జరిగిందని భావించబడుతుంది. శ్రీనాధ్‌జీ విగ్రహాన్ని మొగలు సామ్రాజ్య మతవ్యతిరేకత నుండి రక్షించి సురక్షిత ప్రదేశానికి చేర్చడానికి ఎద్దులబండిలో తీసుకు వస్తున్న తరుణంలో ఒక ఎద్దు కిందకు వాలింది. అలా వాలడం గమనించి వెంట వస్తున్నపూజారులు అది భగవానుడి ఆదేశంగా భావించి అక్కడే ఆలయ నిర్మాణం చేయమని సూచించారు. ఈ ఆలయనిర్మిత ప్రదేశం అప్పుడు మేవార్ రాజైన రాజ్ సింగ్ పాలనలో ఉండేది. ఈ ఆలయము శ్రీనాధ్‌జీ హవేలి అని పిలువబడుతుంది.

ఆలయ రూపురేఖలు

[మార్చు]

ఈ ఆలయము బృందావనములోని నందమహారాజ ఆలయా శైలిలో నిర్మించబడింది. అందువలన ఇది నందాభవన్ లేక నందాలయం అని కూడా పిలువబడుతుంది. ఆలయగోపురం మీద ఉన్న కలశంలో సుదర్శనచక్రంతో ఏడు జెండాలు కూడా ఎగురుతుంటాయి. ఈ ఏడు జెండాలు శ్రీకృష్ణుని ఏడుగురు సఖులకు గుర్తుగా ఉంది. ఈ ఆలయం ప్రబలంగా శ్రీనాధ్‌జీకి హవేలి (శ్రీనాధుని భవనము) ఎందుకంటే సాధారణ ఇల్లులాగా ఈ ఆలయములో ప్రయాణించడానికి అనువుగా ఒక రథము ఉంటుంది. (ఒక సందర్భంలో శ్రీనాధ్‌జీ సింఘర్‌కు తీసుకు వచ్చిన రథము వంటిది), పాలకొరకు ఒక సామాను గది (దూద్ ఘర్), తాంబూలము కొరకు ఒక సామానుగది (పాన్ ఘర్), తీపిపదార్ధాలకొరకు, పంచదార కొరకు ఒక సామానుగది (మిష్రిఘర్ లేక పెదఘర్), పూలకొరకు ఒక సామానుగది (ఫూల్ ఘర్), ఒక వంటగది (ఇక్కడ వంట చేయబడుతుంది ) దీనిని రసోయీ ఘర్ అంటారు, ఒక ఆభరణ శాల (ఘనాఘర్), ఒక ఖజానా (ఖర్చా భండార్), అశ్వశాల, ఒక హాలు (బైఠక్), ఒక స్వర్ణ, రజత తిరగలి (చక్కి), ఈ ఆలయానికి ప్రాకారంలో మదన్ మోహన్, నవనీత్‌జీ ఉపాలయాలు ఉన్నాయి.

శ్రీనాధ్‌జీ విగ్రహం

[మార్చు]

ఆలయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలతో గోవర్ధన గిరిని ఎత్తుతూ కుడి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆలయంలో ఉన్నది నల్లని చలువరాతితో చెక్కబడిన శిల్పము. ఈ శిల్పములో శ్రీకృష్ణుడితో రెండు ఆవులు, ఒక సింహము, రెండు నెమళ్ళు, ఒక పాము, ఒక చిలుక ఉంటాయి.

ఆలయం లోని ఉత్సవాలు , సంప్రదాయాలు

[మార్చు]

ఈ ఆలయానికి జన్మాష్టమి సందర్భంగా భక్తులు ప్రవాహముగా వస్తారు. అలాగే దీపావళి, హోలి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ దైవం జీవించి ఉన్నట్లు భావించి ఆరాధించబడుతుంది. ఆలయం లోని మూల విరాట్టుకు రోజూ వారిగా స్నానం, వస్త్రధారణ, భోజనం (ప్రసాదం) లతో సాధారణ జీవితంలో ఉన్నట్లు విశ్రాంతి వేళలు ఉంటాయి. ఈ దైవాన్ని బాలకృష్ణుడిగా భావించి పిల్లల కొరకు తీసుకునే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ఈ ఆలయ పూజారుల వల్లాభాచార్య వంశీకులుగా భావించబడుతున్నారు. వల్లభాచార్యుడు గోవర్ధనగిరిలో ఈ విగ్రహాన్ని కునుగొని ఇక్కడకు తెచ్చి ప్రతిష్ఠించాడని ప్రతీతి.

ఆలయంలో ప్రధాన ఆకర్షణలు హారతి, అలంకారము, వస్త్రధారణ. స్వామికి వేళకు తగిన వస్త్రధారణ జరుగుతుంది. నేతపంచె, జరీ కండువా, రత్నఖచిత ఆభరణాలు వాడతారు. స్వామికి అరాధనతో చద్దులు, గోవులను కాయడానికి ఉపయోగించే కర్ర, పూలు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా భక్తి గీతాలను ఆలాపిస్తూ సమర్పిస్తారు. స్వామిని చూడడానికి జాఖి అని పిలువబడే ఒక పరదాను తెరచి చూపిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.

వెలుపలి లింకులు

[మార్చు]