పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు
ప్రమీలాదేవి
అ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
అగజాత | పార్వతీ దేవికి గల పేరు |
అఘుడు | రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు. |
అగస్త్య మహర్షి | అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు? అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు. అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర |
అగ్ని | వేదములలో పేర్కొన్న ఒక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి. |
అనసూయ | అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య, మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది. |
అనిలుడు | అనిలుడు హిందూ పురాణాలలోని వ్యక్తి.
|
అనుభూతిస్వరూపాచార్యుడు | అనుభూతిస్వరూపాచార్యుడు - సారస్వత వ్యాకరణము రచించినయత డని వాడుక.
|
అనువిందుడు | అనువిందుడు పురాణాలలోని ఒక వ్యక్తి.
|
అచల | కుమారస్వామి మాతౄగణములోని ఒక స్త్రీమూర్తి. |
అత్రి | బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు. |
అర్జునుడు | స్వచ్ఛమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతికి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . పాండురాజు తనయుడు. |
అభిమన్యుడు | అర్జునుడు, సుభద్ర ల కుమారుడు . కురుక్షేత్ర సంగ్రామములో పద్మవ్యూహం లోపలకు వెళ్ళి బయటకు రావడం తెలియక మరణించాడు . అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు యధిష్టురుని తరువాత హస్తినాపురానికి రాజు అయ్యాడు. పరీక్షిత్తు వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. |
అనాదృష్యుడు | గాంధారీ, ధృతరాష్ట్రుల కుమారుడు . నూరుగురు కౌరవులలో ఒకడు . |
అశ్వత్థామ | గుర్రము వలె సామర్ధ్యము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఇతడు చిరంజీవి . ద్రోణుని కుమారుడు . పాండవ ద్వేషి . |
అంబిక | 1. హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. 2. మహాభారతములో సత్యవతి - శంతన మహారారు కుమారుడైన చిత్రాంగుని భార్య పేరు అంబిక . భర్త చనిపోయిన తరువాత ఈమెకు వ్యాసుని వలన గుడ్డివాడైన ధృతరాస్ట్రుడు జన్మిస్తాడు . |
అంబాలిక | విచిత్రవీర్యుని ఇద్దరి భార్యలలో రెండెవది . విచిత్ర వీర్యుడు 8 సంవత్సరాలు కాపురము చేసి క్షయ వ్యాధిలో చనిపోయిన తరువాత అత్తగారైన సత్యవతి ప్రోద్బలముతో వ్యాసుని వలన పాండురాజును కన్నది . |
అమ్మ | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
అనిరుద్దుడు | శ్రీకృష్ణుని మనుమడు . ప్రద్యుమ్నుని కుమారుడు . బాణాసురుడి కుమార్తె ' ఉష ' కు భర్త . |
అక్రూరుడు | శ్రీకృష్ణుని మేనమామ. అక్రూరుడు తండ్రి శ్వఫల్కుడు, కాశీరాజు కుమార్తెకు, శ్వఫల్కుడికి జన్మించిన వాడే అక్రూరుడు, సత్ప్రవర్తన, బ్రహ్మచర్య దీక్ష కలిగిన అక్రూరుడే శమంతక మణిని గ్రహించటానికి అర్హుడని కృష్ణుడు ఆమణిని అక్రూరుడికి ఇచ్చాడు. అలా ఆనాటినుండి అక్రూరుడు మనస్సులో ఎలాంటి భయాలు లేకుండా యజ్ఞాలను, శమంతక మణి ఇచ్చే బంగారం సహాయంతో చేస్తూ లోకకళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. |
అకర్కారుడు | కథ్రువ కొడుకు. ఒక సర్పం. |
అపర్ణ | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
అయతి | మేరువు కుమార్తె, ధాత భార్య . ఈమె కుమారుడు .. ప్రాణుడు . |
అగ్ని శౌచము | కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము . |
అతికాయుడు | రావణుని కుమారుడు . పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు. |
అనంత విజయం | ధర్మరాజు శంఖము |
అలకనంద | దేవలోకం లోని గంగానది . పితృలోకాలో పయనించేటప్పుడు దీనిని ' వైతరణి ' అంటారు . మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.స్వర్గలోకంలో మందాకిని, భూలోకంలో గంగ, అలకనంద, పాతాళలోకంలో భోగవతి అని గంగానదికి పేర్లు |
అహల్య | అహల్య గౌతమ మహర్షి భార్య.ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడింది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడింది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి. |
అక్షయపాత్ర | అరణ్యవాసము చేస్తున్న ధర్మరాజు తనవెంట బ్రాహ్మణ భోజనార్ధం సూర్యుడుని ప్రార్థించి ఒక పాత్ర సంపాదించారు . దానిలో కొద్దిగా వండినా అక్షయమవుతుంది (సరిపోయినంత), దానితో ధర్మరాజు నిరంతరము అన్నదానాలు చేస్తుంటాడు . |
అంజన | కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది. |
అంగదుడు | 1. లక్ష్మణుని కుమారుడు, ఇతని నగరము అంగదపురము 2. ఒక వానరుడు. వాలి పుత్రుడు. ఇతని తల్లి తార. వాలి మరణానంతరం సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యెని. అపుడితడు యువరాజాయెను. |
అంగన | ఉత్తరపు దిక్కున ఉన్న ఆడుఏనుగు |
అంగరాజు | 1) బలియను రాజు కుమారుడు. ఇతని తల్లి సుధేష్ణ. ఈమె తల్లి భర్త వియోగముచేఅ దీర్ఘతముని వలన నితనిని కన్నది. ఇతడు పాలించిన దేశమే అంగదేశము. 2) కర్ణుడు |
అంగారకుడు | 1) ఏకాదశ రుద్రులలో ఒకడు 2) నవగ్రహముకలో ఒకడు. భూదేవి విష్ణుమూర్తిని కామించి స్త్రీ రూపము దాల్చియాతని తన కోర్కె దీర్చమని కోరెను. విష్ణువు అంగీకరించెను. భూదేవి పవడపు రూపమున నొక బీజమును విడెచెను. దాని నుండి అంగారకుడు పుట్టేను (బ్రహ్మవైవర్తన పురాణం) |
అంగారపర్ణుడు | ఒక గంధర్వుడు, కుబేరుని మిత్రుడు.ద్రుపదునగరం పోవుచున్న అర్జునునితో యుద్ధము చేసి ఓడిపోయి, అర్జునుని శక్తి సామర్థాలను మెచ్చుకొని జాక్షుసి యను గంధర్వ విద్యనుపదేశించెను. |
అంగిరసుడు | 1) యాగ్నేయీయూరువుల కుమారుడు. (మత్స్య పురాణం) 2) పథ్యుని శిష్యుడు.అధర్వణ వేదము పఠించెను. (భాగవతము) 3) ఉల్ముకుని కుమారుడు.అంగుని తమ్ముడు. ఇతని భార్య స్మృతి. 4) ఒక ముని. ఈయన ప్రసిద్ధోపాస్యభూతమైన ముఖ్య ప్రాణమును ఆత్మదృష్టిచే ఉపాసన చేసెను. అందువలన ముఖ్య ప్రాణమును అంగిరసముగ ఋషులు తలచుచున్నారు. 5) బ్రహ్మ మానస పుత్రుడు. ఒకనాడు అగ్నికి కోపమువచ్చి తన రూపమునుపహరించి తపస్సు చేయనారంభించెను. కొలది కాలములో అగ్ని స్థానమును అంగీరసునకీయబడెను. తన పదవి పోగిట్టుకొనిన అగ్ని చింతించెను. అపుడు అంగిరసుడు ఆ పదవినతనికిచ్చి తనకు పుత్రునిగా ఉండుటకంగీకరించెను. ఇతని భార్య శివ (శ్రద్ధ). ఈతనికి బృహర్కీర్తి, బృహజ్యోతి, సంవర్తనుడు, ఉతధ్యుడు, మొదలగు పుత్రులు పుట్టిరి. |
అంగుడు | 1) ఊరుని (ఊల్ముకుని) కుమారుడు. ఒకరాజు. ఇతని భార్య సునీధ. 2) దివిరథ తనయుడగు దధివాహనుని పుత్రుడు. |
అంజనపర్వుడు | ఘటోత్కచుని కుమారుడు. భారత యుద్ధంలో అశ్వత్ధామ వలన మరణించెను. |
అంజనము | పడమటి దిక్కున గల యేనుగు |
అంతరిక్షుడు | మురాసురుని కుమారుడు. కుష్ణునిచే చంపబడెను |
అంతర్థానుడు | పృథువు కుమారుడు. ఇతడే విజితాశ్వుడు. ఈ రాజకుమారుడు గంగా తీరమున గౌతమ మునీంద్రునిచే రక్షణ సేయబడెను. |
అంధకాసురుడు | ఒక రాక్షసుడు. సింహికావిప్రచిత్తుల కుమారుడు. |
ఆ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఆంజనేయుడు | 'అంజన' కు పుట్టినవాడు అని అర్ధము . హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. |
ఇ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఇంద్రజిత్తు | ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము). ఇంద్రజిత్తు -- రావణాసురిడికి మండోదరికి జన్మించిన పెద్ద కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి (బ్రహ్మ) అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు. ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల) నాగకన్యను వివాహమాడినాడు |
ఇంద్రుడు | హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కవల పిల్లలలో ఒకడు (ఇంద్రుడు, అగ్ని ). అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి, కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు. |
ఇంద్రమాల | ఒక కమల మాలిక . ఎన్నడూ వాడనిది . ఈ మాల ధరించిన వారిని ఏ అస్రమూ ఎమీ చేయలేదు . |
ఈ
[మార్చు]ఈశ్వర్
ఉ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఉత్తర | విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉంది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు. |
ఉత్తరుడు | విరాట రాజ్యానికి రాజైన విరాటరాజుకు ఇతని భార్య సుధేష్ణకు పుట్టిన కుమారుడు . ఉత్తర ఈయన సహోదరి . |
ఉమ | పార్వతి ( Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
ఉలూచి | నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు. ఉలూచి కౌరవ్యుడు అను నాగరాజు కుమార్తె.
అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున ఉలూచి అతనిని పాతాళలోకమునకు తీసుకుని వెళ్లి వివాహము చేసికొన్నది. వీరికి ఐరావణుడు అను కుమారుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునితో యుద్ధము చేసి తన బాణముతో అర్జునుని చంపాడు. అప్పుడు ఉలూచి సంజీవనిమణితో అర్జునుని తిరిగి బ్రతికించింది. |
ఉశన -- | భృగువు భార్య, శుకృడి తల్లి . |
ఉష | వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర... * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల. |
ఉద్దాలకుడు | ఉద్దాలక మహర్షి అరుణుడు కుమారుడు. శ్వేతకేతువు ఇతని కుమారుడు.లు, |
ఊ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఊర్వశి | ఊరువు (తొడ) నుండి ఉద్భవించింది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి రంభను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది. |
ఊర్మిళ | రామాయణంలో దశరథుని కోడలు, లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. |
ఋ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఋష్యమూకము | అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ . తన తల వేయి ముక్కలవును అనే ముని శాపముతో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు . |
ఎ
[మార్చు]ఏ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఏకలవ్యుడు | మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణగా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు. |
ఏతశం | సూర్యుని రథం గుర్రాలలో ఒకటి . |
ఐ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఐరావణుడు | ఐరావణుడు అర్జునుడు, నాగుల రాకుమారి ఉలూపిల కుమారుడు. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన పోరాడి ఎనిమిదవ రోజు అలుంవష అను రాక్షసుని చేతిలో మరణించాడు. |
ఒ
[మార్చు]ఓ
[మార్చు]ఔ
[మార్చు]అం
[మార్చు]క
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
కబంధుడు | రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యములో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల, మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు, వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను. |
కల్పవృక్షము | కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు. బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు . |
కర్ణుడు | పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు. మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించాడు. |
కాత్యాయిని | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
కాళి | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
కాళిదాసు | ఒక గొప్ప సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు. |
కశ్యపుడు | ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు (మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కథ్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు. ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది. |
కుచేలుడు | చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు |
కుబేరుడు | హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి. |
కురువంశము | భరతుడి తరువాత వంశం--భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి, హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు. |
కుంభకర్ణుడు | రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలో సంభోగం వల్ల జన్మించిన సంతానం. ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు" |
కృపి | మహాభారతంలోని పాత్ర. ఈమె కృపాచార్యుని సోదరి, ద్రోణుని భార్య. (జన్మ వృత్తాంతము -- శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి రేతః పతనమై ఆ వీర్యము రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. కృపుడు విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్థనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు. కృపిని ద్రోణాచార్యుడు పరిణయం చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ.) |
కేదారేశ్వరుడు | శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది, మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది. |
కైకేయి | అశ్వపతి కూతురు . దశరథమహారాజు ముడో భార్య . భరతుని తల్లి . |
కౌరవులు | కురువంశరాజులు . మహాభారతంలో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు. |
కౌశికుడు | ధర్మ వ్యాధునివల్ల ధర్మ విశేషాలు తెలుసుకున్నవాడు . విశ్వామిత్రునికి మరో పేరు . |
కంసుడు | ఉగ్రసేనుని కుమారుడు, శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. |
ఖ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ఖాండవం (వనము) | ఇంద్రుని వనము . అగ్నిదేవుడు ప్రార్థించగా కృష్ణార్జునులు దానిని అతనికి ఆహారముగా ఇచ్చారు . |
గ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
గంగ | గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు . గంగ అనగా తెలుగు భాషలో నీరు అని కూడా అర్ధం. పరమేశ్వరుని భార్యలలో ఒకరు . |
గరుత్మంతుడు | విశిష్టమైన రెక్కలు కలవాడు . గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు. |
గౌరి | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
గాంఢీవం | అర్జునుడి ధనుస్సు . దీనిని అగ్నిదేవుడు ఖాండవ వనం దహనమప్పుడు అర్జునుడికి ఇస్తాడు . |
జ్ఞానప్రసూనాంబ | పరాశక్తి అవతారము . శ్రీకాళహస్తీశ్వరుని భార్య . |
జ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
జటాయువు | రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు. |
జమదగ్ని | భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడుకి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య . |
జనమేజయుడు | మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. |
జయ విజయులు | శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారా పాలకులు. వీరి గురించి భాగవత పురాణంలో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకంలో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. |
జరాసంధుడు | పరమ శివ భక్తుడు, రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వంలో వచ్చే పాత్ర. బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెబుతుంది. |
జాంబవంతుడు | బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మథనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు. |
ఝష
[మార్చు]ట
[మార్చు]ఠ
[మార్చు]డ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
డాకిని | మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రీ . |
ఢ
[మార్చు]ణ
[మార్చు]త
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
తపతి | సూర్యుని కుమార్తె . -- సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు. తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు. చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు సంవరణుడుతో ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది. |
తార | తారుని కుమార్తె . వాలి భార్య . అంగదుని తల్లి . వాలి మరణించిన అనంతరము తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. కాని అది వీలుపడదని కర్మా-ధర్మాలను అనుభవించవసిందేనని తాను నిమిత్తమాత్రుడునని హితవు పలికెను . వాలి సోదరుడు ' సుగ్రీవుడు ' ఈమెను వివాహమాడెను . |
తాటకి లేదా తాటక | రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన, అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన సుమాలిని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు, కైకసి. వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుల్ని పుత్రులుగాను, శూర్పణఖ అనే పుత్రికను పొందుతుంది. |
తుంబురుడు | తుంబుర (వాద్య విశేషము) కలవాడు. గందర్వుడు, విష్ణు భక్తుడు, దేవగాయకుడు . నారదునితో పోటాపోటిగా నిలిచి నారద-తుంబురులుగా ప్రసిద్ధిగాంచిరి . |
త్రిశంకుడు | 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు శంకువులు (పాపాలు) చేసినవాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన సత్యవంతుడు అనే మహారాజు, కులగురువులైన వశిష్ఠుడితో వైరం నొంది వశిస్టుని కుమారులచే శపించబడి చండాలరూపాన్ని పొంది, విశ్వామిత్రుని ఆశ్రయించి త్రిశంకుస్వర్గము ( విశ్వామిత్రుని చే సృస్టించబడినది ) నకు రాజైయ్యాడు. |
ధక్షకుని పెద్దకుూతురు
[మార్చు]ద
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
దమయంతి | 'దమనుడు' అను ముని వరము వలన జన్మించింది. 2. తన అందముచే ఇతరులను దమించునది. (అణచునది).భీమమహారాజు కుమార్తె, నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది. కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు . |
దత్తాత్రేయుడు | శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. |
దశరథుడు | దశ (పది) దిశలలో రథ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు - (కౌషల్య, సుమిత్ర, కైకేయి ) భార్యలకు ... రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు . |
దామోదరుడు | కృష్ణుడు చిన్నతనంలో తల్లి యశోద అతని నడుముకు పొట్టకు కట్టువేసి బండరాయికి కట్టివేసినది . బంధితమైన పొట్టగల వాడు కనుకనే ఆ నాటి నుంచి ఆయనకు దామోదరుడు అనే పేరొచ్చింది. |
దాక్షాయణి | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, బద్రకాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
దక్షిణాయనము | సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి మకరరాశిని చేరే వరకు మధ్యనున్న సమయమే దక్షిణాయనము . ఆ సమ్యములో సూర్యుడు భూమధ్యరే్ఖకు దక్షిణముగా సంచరిస్తాడు . |
దుర్యోధనుడు | (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరువాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించింది. ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరువాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు. తరువాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు. |
దుర్వాసుడు | దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము), దుర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు. |
దుస్సల | ధృతరాష్ట్రుడు, గాంధారి ల ఏకైక కుమార్తె . ధుర్యోధనాదుల సోదరి . ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు |
దుశ్శాసనుడు | సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు. దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభలో ద్రౌపతి వస్త్రాపహరణం నకు పూనుకున్నాడు. కానీ శ్రీ కృష్ణుడి అభయ హస్తంతో ద్రౌపతి గౌరవం కాపాడబడింది. |
దుష్యంతుడు | హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు మహారాజు . శకుంతల భర్త . భరతుని తండ్రి . |
దృపదుడు | పాంచాల రాజు . ద్రౌపది తండ్రి . ఈయన కుమారులు ... దృష్టద్యుమ్నుడు, శిఖండి . |
ద్రౌపది | పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరములో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది |
ద్రోణుడు | ద్రోణము (కుండ) నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. . అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి. |
ధ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
ధర్మరాజు | మహాభారతములో పంచపాండవులలో మొదటివాడు . యుధిష్ఠిరుడని మరొక పేరు . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన (యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్ఠిరుడని పేర్లు కలిగాయి. జూదములో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు . |
ధర్మవ్యాధుడు | మిధిలా నగరములో ఉండేవాడు . సమస్త ధర్మాలూ చక్కగా తెలిసినవాడు . |
ధర్వంతరి | క్షీరసాగర మధన సమయములో జర్మించినది . ఆయుర్వేదానికి అధిష్టాన దేవత . |
ధృతరాష్ట్రుడు | కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు . అంధుడు . గాంధారి ఈయం భార్య . దుర్యోధనుడు .. .తదితర నూరు మంది కుమారులు, వీరినే కౌరవులు అంటారు . |
ధ్వజస్తంభము | సూర్యుని కాంతి కిరణములు నలభై ఐదు డిగ్రీల కోణములో పరవర్తనము చెందుతాయి . ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిస్ఠారు . దక్షిణం వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశము మీదుగా ధ్వజస్తంభము పైనుంచి స్వామి భూమధ్యకి చేరుతాయి అందుకే ధ్వజస్తంభమునకు, స్వామికి మధ్యన నిల్చుని నమస్కరించాలి . అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తీ మనల్ని చేరుతుంది . |
న
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
నకులుడు | పాండవుల్లో నాల్గోవాడు . |
నారదుడు | 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు. నారదుడు - లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి. |
ప
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
పార్వతి | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
ప్రహ్లాదుడు | భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగింది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు. |
పరశురాముడు | శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు. |
పరాశరుడు | వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను. ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను. వీరికి వ్యాసుడు జన్మించెను. |
పరీక్షిత్తు | అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు. |
పూతన | ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది . |
ప్రద్యుమ్నుడు | ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము). ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడికి రుక్మిణికి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతంలో వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య . |
పంచవటి | రాముడు వనవాస సమయంలో దండకారణ్యములోని ఆశ్రమము పేరు . |
ఫ
[మార్చు]ఫాల్గుణ, ఫల్గుణ్, ఫాలనేత్ర
బ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
బభృవాహనుడు | బభృవాహనుడు అర్జునుడు, మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు. |
బలిచక్రవర్తి | బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు (హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు. |
బర్బరీకుడు | బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు. |
బలరాముడు | బలముచే జనులను రమింపచేయువాడు., వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము, నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేణుక . |
బద్రకాళి | పార్వతికి మరో పేరు . హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, బద్రకాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
బృహస్పతి | బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి).బృహస్పతికి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రునితో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను. |
భరతుడు | అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు. 1. భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు. సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదులకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. 2. భరతుడు మహాభారతములో శకుంతల-దుష్యంతుల కుమారుడు . భరతుడు పరిపాలించిన దేశము గనుక భారతదేశము అని పేరు వచ్చినది . |
బాణాసురుడు | వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర. బ్రహ్మ కుమారుడు పరిచుడు, పరిచుని కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరొచుని కుమారుడు బలి చక్రవర్తి, ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు, ఆ బాణాసురుని భార్య కండల.
వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు. |
భ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
భవాని | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
భైరవి | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
భీముడు | భయమును కలిగించువాడు . భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. ద్రౌపతి, హిడింబి ఇతని భార్యలు . హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించాడు. |
భీష్ముడు | తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ జన్మ భ్రహ్మచారి . మహాభారతంలో గంగాదేవీ శంతనమహారాజుకి జన్మించాడు, భీష్ముడు పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. |
మ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
మండోదరి | పలుచని ఉదరము కలది (మండ-పలుచని). మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. |
మన్మధుడు | మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు, మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని, అనంగుడని, పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి . మంచి రూపం కలిగిన వాడు. విష్ణువుకు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. |
మహిషాసురుడు | హిందూ పురాణాలలో రాక్షసుడు 1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. 2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై (గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడుకి జన్మనిస్తుంది. దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. |
మహిషాసుర మర్ధిని | మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది . |
మారీచుడు | రాక్షసి తాటకకి కుమారుడు . సీతాపహరణ సమయంలో రావణుడు ఇతన్ని బంగారు జింకగా మారమని అదేశిస్తాడు ... తరువాత రాముని చే హతమార్చబడినాడు . ఇతని సోదరి కైకసి, సోదరుడు సుబాహుడు . |
మేనక | మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామితుడి తపోభంగానికి ఇంద్రుడు నియమించిన అప్సరస . వీరిరువురి కలయిక వలన శకుంతల జన్మించింది . |
మోహిని | మోహిని అంటే సాధారణంగా నారాయణుని మోహినీ అవతారము . దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు. రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు. |
య
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
యముడు, యమధర్మరాజు | యమము (లయ) నుపొందించువాడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. * భార్య పేరు ' శ్యామల * సోదరులు : వైవస్వతుడు, శని * సోదరీమణులు: యమున, తపతి |
యశోద | యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతములో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు, సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు . |
యాజ్ఞవల్కుడు | ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని, తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ధ పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని, యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు . |
యుధిష్ఠిరుడు | ధర్మరాజుకు యుధిష్ఠిరుడని మరొక పేరు, మహాభారతములో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన (యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్ఠిరుడని పేర్లు కలిగాయి. జూదములో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు . |
ర
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
రాముడు | హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు . అతను పురాతన భారతదేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదురెనను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. రాముడి తండ్రి -ధశరధుడు, తల్లి -కౌసల్య, పినతల్లులు- సుమిత్ర, కైకేయి, సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు . |
రావణాసురుడు | కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము . రావణుడు (Ravana) రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు. పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. రావణుని భార్య ' మండోదరి ' .
రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు . సోదరులు = 1. కుబేరుడు 2. కుంభకర్ణుడు 3. విభీషణుడు 4. ఖరుడు 5. దూషణుడు 6. అహిరావణుడు, సోదరీమణులు = 1. శూర్పణఖ (చంద్రనఖు)2.కుంభిని . కుమారులు = 1. ఇంద్రజిత్తు, 2. ప్రహస్థుడు,3. అతికాయుడు,4. అక్షయకుమారుడు,5. దేవాంతకుడు,6. నరాంతకుడు, 7. త్రిశిరుడు. |
రంభ | ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. రూప రేఖాలావణ్యాలు గల నర్తకి . దేవలోకానికి అధిపతియైన ఇంద్రుడు భూలోకములో ఋఉషుల తపస్సు లను భగ్ననము చేయుటకు పంపే అప్సరసలలో రంభ ఒకతె . రంభ, కుబేరుని కొడుకు అయిన 'నలకుబేరుని' భార్య .. |
రాధ లేదా రాధిక | శ్రీకృష్ణుని ప్రియురాలు, నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్దాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే ఉన్నారు. |
రతీదేవి | దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య, మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. |
రేణుక | రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. |
రేవతి | ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య, భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ . |
రుక్మిణి | రుక్మము (బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యలలో పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజుకి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు . |
ల
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
లలిత | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
లంఖిణి | లంకను కాపలాకాసిన రాక్షసి . హనుమంతుడు లంఖినిని హతమార్చి లంకలో ప్రవేశిస్తాడు . లంకాదహనము కావిస్తాడు . |
లవకుశులు | సీతా రాముల కవల పిల్లలు . |
Lo
వ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
వాల్మీకి | నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస .అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడుగా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి. |
వేది | బ్రహ్మ దేవుని భార్య |
విదురుడు | బుద్ధిమంతుడు, తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలికని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబికకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు. |
విభీషణుడు | దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణులు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము తర్వాత లంకకు రాజు అయ్యాడు . |
విశ్వ రూపుడు | విశ్వకర్మ కుమారుడు, సూర్యుని కుమార్తె ' విష్టి ' ఇతని భార్య . |
విశ్వామిత్రుడు | హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుని గురించిన గాథలలో ప్రధానమైనవి: * గాయత్రీ మంత్ర సృష్టి కర్త * శ్రీరామునకు గురువు. * హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. * త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు * శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత. |
వ్యాసుడు | వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు, 555 బ్రహ్మసూక్తులు, 108 ఉపనిషత్తులు, మహాభారతం, మహాభాగవతతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. ఈయన తండ్రి ' పరాశరుడు ', తల్లి ' సత్యవతి ' . వశిష్టవంశము వాడు . |
శ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
శకుంతల | మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య, భరతుని తల్లి. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు. మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు. |
శక్తి | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
శంతనుడు | శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట, సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు. అని అర్దము . శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు |
శివగంగ | బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరసుడి భార్య . |
శ్యామ | హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. |
ష
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
షస్టీదేవి | మూల ప్రకృతిలోని అరోభాగం నుంచి జన్మించిన దేవత . |
స
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
సత్యభామ | శ్రీకృష్ణుని భార్య సత్యభామ, ఈమె తండ్రి సత్రాజిత్తు (సత్రాజిత్తును శతధన్వుడు అనేవాడు సంహరించి శమంతక మణిని చేజిక్కించుకున్నాడు. శమంతక మణిని అపహరించుకుపోవటమేకాకా తన మామ అయిన సత్రాజిత్తును సంహరించిన శతధన్వుడిని శ్రీకృష్ణుడు హతమార్చెను . |
సాంబుడు | జాంబవతి, శ్రీకృష్ణులకు జన్మించిన కుమారుడు . |
సురభి | దేవతల గోవు |
హ
[మార్చు]పురాణాలలో నామం | వివరణ |
హరిశ్చంద్రుడు | హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికాపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.తండ్రిపేరు =సత్యవ్రతుడు, ఈ సత్యవ్రతునికే ' త్రిశంకుడనే ప్రసిద్ధ నామము ఉంది. తల్లిపేరు --సత్యరధ, భార్య పేరు -- చంద్రమతి,
కొడుకు పేరు -- లోహితాస్యుడు . |