ప్రజ్ఞా నగ్రా
ప్రజ్ఞా నగ్రా | |
---|---|
దస్త్రం:Pragya Nagra.jpg | |
జననం | అంబలా, హర్యానా, భారతదేశం | 1998 డిసెంబరు 14
ఇతర పేర్లు | ప్రగ్యా నగ్రా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
ప్రజ్ఞా నగ్రా (ఆంగ్లం: Pragya Nagra; జననం 1998 డిసెంబరు 14) భారతీయ సినిమా నటి.[1][2][3] ఆమె 2022లో తమిళ చిత్రసీమలోకి వరలారు ముక్కియం, మలయాళ చిత్రసీమలోకి నధికళిల్ సుందరి యమునా (2023) చిత్రాలతో ప్రవేశించింది.[4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రజ్ఞా నగ్రా హర్యానాలోని అంబాలాలో పంజాబీ కుటుంబంలో జన్మించింది.[6] ఆమె తన పాఠశాల, కళాశాల చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ఆ తరువాత, ఆమె మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. 100కి పైగా వాణిజ్య ప్రకటనలలో నటించింది.[7][8] ఇంజనీరింగ్ చదువుకునే సమయంలో ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో సభ్యురాలు, తండ్రి భారత సాయుధ దళాలలో ఉద్యోగి కావడంతో తను కూడా సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షించింది. అయితే, ఆమె చివరికి చిత్ర పరిశ్రమలో కొనసాగాలని నిర్ణయించుకుని చెన్నైకి మకాం మార్చింది.[9]
కెరీర్
[మార్చు]ఆమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆమె తరచూ చెన్నైకి వెళ్ళిరావడంలో నటన పట్ల ఆమెకున్న అభిరుచి పెరిగింది. ఇది చివరికి ఆమె చిత్ర పరిశ్రమకు చేరుకోవడానికి దారితీసింది.
2022లో విడుదలైన తమిళ చిత్రం వరలారు ముక్కియంలో జీవా సరసన ఆమె మలయాళీ అమ్మాయి పాత్రను పోషించింది.[10] ఆమె మలయాళ చిత్రం నదికళిల్ సుందరి యమునా అనే సామాజిక-రాజకీయ నాటకంలో కన్నడ అమ్మాయి పాత్రను పోషించింది.[11][12][13]
మూలాలు
[మార్చు]- ↑ "Pragya Nagra eruma saani News in Tamil, Latest Pragya Nagra eruma saani news, photos, videos | Zee News Tamil". Zee Hindustan Tamil (in తమిళము). Retrieved 2023-05-03.
- ↑ telugu. "Pragya Nagra Photos: Latest News, Photos and Videos on Pragya Nagra Photos". telugu.abplive.com. Retrieved 2023-05-03.
- ↑ "Pragya Nagra - Actor Filmography، photos، Video". elCinema.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-03.
- ↑ "Post-production work of Jiiva's 'Varalaru Mukkiyam' on at brisk pace". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-03.
- ↑ "பிரக்யா நாக்ரா's filmography and latest film release news". FilmiBeat (in తమిళము). Retrieved 2023-05-03.
- ↑ "Pragya Nagra eruma saani News in Tamil, Latest Pragya Nagra eruma saani news, photos, videos | Zee News Tamil". Zee Hindustan Tamil (in తమిళము). Retrieved 2023-05-03.
- ↑ "ஜம்மு நாயகி பிரக்யா". Hindu Tamil Thisai (in తమిళము). 2021-08-30. Retrieved 2023-05-03.
- ↑ Jayabalan, Suriyakumar. "Pragya Nagra Pics: கனவு கன்னி பிரக்யா நாக்ரா !". Tamil Hindustan Times (in తమిళము). Retrieved 2023-05-03.
- ↑ "Pragya in Lokesh's Kasimedu-set thriller". The Times of India. 2019-06-30. ISSN 0971-8257. Retrieved 2023-05-03.
- ↑ "Jiiva, Kashmira, Pragya in a romantic comedy". The Times of India. 2020-10-21. ISSN 0971-8257. Retrieved 2023-05-03.
- ↑ "Jiiva's next titled Varalaru Mukkiyam". The Times of India. 2022-01-04. ISSN 0971-8257. Retrieved 2023-05-03.
- ↑ "Nadikalil Sundari Yamuna Set in Kannur's Socio-Political Backdrop; Know More". News18 (in ఇంగ్లీష్). 2022-10-06. Retrieved 2023-05-03.
- ↑ "Pragya Nagra Movies". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-05-03.