ఫీనిక్స్ (పక్షి)
ప్రాచీన గ్రీకు పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనేది పునర్జీవితాన్ని తీసుకొగలిగే ఒక కాల్పనిక పక్షి. సూర్యునితొ సన్నిహిత సంబంధం ఉన్న ఈ పక్షి, తన పూర్వీకుల బూడిద నుంచి కొత్త జీవితాన్ని పొందుతుంది. క్రైస్తవ మత ఆరంభంలో మత చిహ్నంగా కూడా చుపబడింది. చాలా కథల ప్రకారం ఫీనిక్స్ అగ్ని ద్వారా అంతమైనప్పటికీ, జన్మించే ముందు తనని తాను నాశనం చేసుకున్నట్టుగా పురాతన గ్రంథాల ఆధారాలు కూడా తక్కువగా ఉన్నాయి.కొన్ని గాథల ప్రకారం ఈ పక్షి ఒకే జీవితాన్ని 1400 సంవత్సరాల వరకు కొనసాగించగలదని చెప్పబడింది. హెరడోటస్, లూకన్, ప్లిని ద ఎల్డర్, పోప్ క్లెమెంట్ 1, లేక్టేంటియస్, ఓవిడ్ వంటి ప్రముఖుల ద్వారా ఈ పక్షి పునర్జన్మ లేదా పునర్జీవితాన్ని సంబంధించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. చారిత్మక ఆధారాల ప్రకారం ఈ పక్షి, సూర్యునికి, కాలానికి, సామ్రాజ్యాలకి, పునర్జన్మలకి, పునరజ్జీవనానికి చిహ్నంగా చిత్రీకరించబడింది. కొన్ని క్రిస్టియన్ శాఖలలో స్వర్గానికి సూచికగా కూడా చెబుతారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- Barnhart, Robert K (1995), The Barnhart Concise Dictionary of Etymology, HarperCollins, ISBN 0-06-270084-7.
- Garry, Jane; El-Shamy, Hasan (2005), Archetypes and Motifs in Folklore and Literature, ME Sharpe, ISBN 978-0-76561260-1.
- Van der Broek, R (1972), The Myth of the Phoenix, Seeger, I trans, EJ Brill.
- Lundy, John P. (1876), Monumental Christianity, JW Bouton