ఫ్రాంక్ కాప్రా
ఫ్రాంక్ కాప్రా | |
---|---|
జననం | ఫ్రాంక్ రస్సెల్ కాప్రా 1897 మే 18 |
మరణం | 1991 సెప్టెంబరు 3 లా క్వింటా, కాలిఫోర్నియా | (వయసు 94)
Burial place | కోచెల్లా వ్యాలీ పబ్లిక్ స్మశానవాటిక |
విద్యాసంస్థ | కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1922–1964 |
బిరుదు | అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 1935–1939 అధ్యక్షుడు |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)[1] |
జీవిత భాగస్వామి | హెలెన్ హోవెల్
(m. 1923; div. 1928)లూసిల్లే వార్నర్
(m. 1932; died 1984) |
పిల్లలు | 4, ఫ్రాంక్ కాప్రా జూనియర్ |
ఫ్రాంక్ రస్సెల్ కాప్రా (1897, మే 18 – 1991, సెప్టెంబరు 3) ఇటాలియన్-అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతని తీసిన సినిమాలు 1930లు, 1940లలో ముఖ్య అవార్డులు గెలుచుకున్నాయి. ఇటలీలో పుట్టి, ఐదేళ్ల వయస్సు నుండి లాస్ ఏంజెల్స్‌లో పెరిగిన ఫ్రాంక్ "అమెరికన్ డ్రీం పర్సనఫైడ్"గా పరిగణించబడ్డాడు.[2]
జననం
[మార్చు]ఫ్రాంక్ కాప్రా 1897 మే 18న ఇటలీ దేశం, సిసిలీలోని బిసాక్వినోలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]కాప్రా 1930లలో అమెరికా సినిమారంగ అత్యంత ప్రభావవంతమైన దర్శకుల్లో ఒకడిగా నిలిచాడు. ఆరు నామినేషన్లతో ఉత్తమ దర్శకుడిగా మూడు అకాడమీ అవార్డులను గెలుచుకున్నాడు. ఇతర విభాగాల్లో తొమ్మిది నామినేషన్లతో మూడు ఇతర ఆస్కార్ అవార్డులను అందుకున్నాడు. కాప్రా తీసిన ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్ (1934), మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936), యు కెన్ట్ టేక్ ఇట్ విత్ యు (1938), మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్ (1939), ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్ (1946) మొదలైన సినిమాలు గుర్తింపు పొందాయి.[3] రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, కాప్రా యుఎస్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్‌లో పనిచేశాడు. వై వి ఫైట్ సిరీస్ వంటి ప్రచార చిత్రాలను కూడా నిర్మించాడు.[4]
కాప్రా వివిధ రాజకీయ, సామాజిక కార్యకలాపాలు నిర్వహించాడు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాతో కలిసి పనిచేశాడు. డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకు అధిపతిగా ఉన్నాడు.
అవార్డులు, సన్మానాలు
[మార్చు]అకాడమీ అవార్డులు
[మార్చు]సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|
1933 | లేడీ ఫర్ ఎ డే | ఉత్తమ చిత్రం | నామినేట్ |
ఉత్తమ దర్శకుడు | నామినేట్ | ||
1934 | ఇట్ హాపెన్డ్ వన్ నైట్ | ఉత్తమ చిత్రం (హ్యారీ కోన్‌తో) | విజేత |
ఉత్తమ దర్శకుడు | విజేత | ||
1936 | మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ | ఉత్తమ చిత్రం | నామినేట్ |
ఉత్తమ దర్శకుడు | విజేత | ||
1937 | లాస్ట్ హారిజన్ | ఉత్తమ చిత్రం | నామినేట్ |
1938 | యూ కాంట్ టేక్ ఇట్ విత్ యూ | ఉత్తమ చిత్రం | విజేత |
ఉత్తమ దర్శకుడు | విజేత | ||
1939 | మిస్టర్ స్మిత్ గోస్ టూ వాషింగ్టన్ | ఉత్తమ చిత్రం | నామినేట్ |
ఉత్తమ దర్శకుడు | నామినేట్ | ||
1943 | ప్రెల్యూడ్ టూ వార్ | ఉత్తమ డాక్యుమెంటరీ | విజేత |
1944 | ది బాటిల్ ఆఫ్ రష్యా | ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ | నామినేట్ |
1946 | ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్ | ఉత్తమ చిత్రం | నామినేట్ |
ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
ఇతర అవార్డులు
[మార్చు]- అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
- జీవిత సాఫల్య పురస్కారం (1982)
- డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా
- ఎ హోల్ ఇన్ హెడ్ (1959) చిత్రానికి ఉత్తమ దర్శకుడు నామినేషన్
- జీవిత సాఫల్య పురస్కారం (1959)
- పాకెట్‌ఫుల్ ఆఫ్ మిరాకిల్స్ (1961) చిత్రానికి ఉత్తమ దర్శకుడు నామినేషన్
- గోల్డెన్ గ్లోబ్ అవార్డు
- ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ (1946) చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు
- వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్
- ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ (1934) ఉత్తమ విదేశీ చిత్రంగా ముస్సోలినీ కప్‌లు నామినేషన్
- మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936) ఉత్తమ విదేశీ చిత్రంగా ముస్సోలినీ కప్‌కు ప్రతిపాదన
- గోల్డెన్ లయన్ (1982)
- యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ
- ది స్ట్రాంగ్ మ్యాన్ (1926)
- ఇట్ హాపెండ్ వన్ నైట్ (1934)
- లాస్ట్ హారిజన్ (1937)
- మిస్టర్. స్మిత్ గోస్ టు వాషింగ్టన్ (1939)
- వై వి ఫైట్ (1942)
- ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ (1946)
మరణం
[మార్చు]1985లో 88 సంవత్సరాల వయస్సులో, కాప్రాకి మొదటిసారిగా స్ట్రోక్ వచ్చింది.[5] 1991, సెప్టెంబరు 3న తన 94 సంవత్సరాల వయస్సులో కాలిఫోర్నియా, లా క్వింటాలోని తన ఇంటిలో నిద్రలో గుండెపోటుతో మరణించాడు. కాలిఫోర్నియా, కోచెల్లాలోని కోచెల్లా వ్యాలీ పబ్లిక్ శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరిగాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ Wilson 2013, p. 266.
- ↑ Freer 2009, pp. 40–41.
- ↑ Poague 2004, p. viii.
- ↑ The War Years; From Pearl Harbor to Dachau, many of Hollywood's top directors volunteered their creative talents to help win World War II. Their films from the front left a lasting document of the often brutal fight for freedom. Directors Guild of America. Retrieved 2023-05-25.
- ↑ Lambert, Gavin. "Book review: "The World Outside the Pictures: 'Frank CAapra: The Catastrophe of Success'." The Los Angeles Times, May 27, 1992.
- ↑ Brooks 2006, p. 248.
బయటి లింకులు
[మార్చు]గురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
- కాప్రా స్మిత్ , డో: యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియాలో అమెరికన్ స్టడీస్ నుండి అమెరికన్ హీరోని చిత్రీకరించడం
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఫ్రాంక్ కాప్రా పేజీ
- ఫ్రాంక్ కాప్రా at the TCM Movie Database
- గ్రంథ పట్టిక
- కాప్రా "కాప్రాస్క్" కాకముందు BFI సైట్ & సౌండ్ మ్యాగజైన్ 2010 నవంబరులో కాప్రా యొక్క ప్రారంభ కెరీర్‌పై జోసెఫ్ మెక్‌బ్రైడ్ కథనం
- ఫ్రాంక్ కాప్రా Frank Capra accepts Life Achievement Award యూట్యూబ్‌లో
- James Stewart at the "Tribute to Frank Capra" యూట్యూబ్‌లో
- Bette Davis at the "Tribute to Frank Capra" యూట్యూబ్‌లో
- Jack Lemmon at the "Tribute to Frank Capra" యూట్యూబ్‌లో
- Frank Capra receiving Academy Awards యూట్యూబ్‌లో
- 1971 శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఫ్రాంక్ కాప్రా