Jump to content

బల్వంత్ సింగ్

వికీపీడియా నుండి
బల్వంత్ సింగ్

పదవీ కాలం
2014 – 2019
ముందు రాజ్‌పాల్
తరువాత రేణు బాలా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రిక్షా దేవి
సంతానం 1
వృత్తి రాజకీయ నాయకుడు

బల్వంత్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2000, 2005 & 2014లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో సధౌర నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

బల్వంత్ సింగ్ 2000లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో సధౌర నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి దీప్ చంద్‌పై 7,478 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బల్వంత్ సింగ్ 2005 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి దీప్ చంద్‌పై 8,442 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బల్వంత్ సింగ్ 2009 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌పాల్ చేతిలో 8,613 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు.

బల్వంత్ సింగ్ 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి పింకీ ఛాపర్ పై 14,146 ఓట్ల మెజారిటీ గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బల్వంత్ సింగ్ 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రేణు బాలా చేతిలో 17,020 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.

బల్వంత్ సింగ్ 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రేణు బాలా చేతిలో 1699 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. రేణు బాలాకి 57534 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బల్వంత్ సింగ్ కి 55835 ఓట్లు వచ్చాయి.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Haryana Vidhan Sabha MLA". haryanaassembly.gov.in. Archived from the original on 4 August 2017. Retrieved 10 January 2017.
  2. Hindustantimes (14 September 2019). "Haryana Assembly Polls: Balwant Singh, Sadhaura MLA". Retrieved 25 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Sadhaura". Retrieved 25 October 2024.
  4. India Today (8 October 2024). "Sadhaura (SC) Assembly Election Results 2024" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.