Jump to content

బసంతి (2014 సినిమా)

వికీపీడియా నుండి
బసంతి
బసంతి
దర్శకత్వంచైతన్య దంతులూరి
స్క్రీన్ ప్లేచైతన్య దంతులూరి
కథచైతన్య దంతులూరి
నిర్మాతచైతన్య దంతులూరి
తారాగణంరాజా గౌతమ్
అలీషా బేగ్
షాయాజీ షిండే
తనికెళ్ల భరణి
శ్రీకాంత్ అయ్యంగర్
రణధీర్ గట్ల
ఛాయాగ్రహణంఅనిల్ బండారి
కూర్పుమార్తాండ్ కె.వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
స్టార్ట్ కెమెరా పిక్చర్స్
విడుదల తేదీ
28 ఫిబ్రవరి 2014 (2014-02-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

బసంతి చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 2014, ఫిబ్రవరి 28న విడుదలయ్యింది. ఇదే సినిమాను 2018లో టెర్రర్ 2 అనే పేరుతో హిందీలోనికి డబ్ చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

'బసంతి' ఓల్డ్ సిటీలోని ఓ కాలేజీ పేరు. అందులో తన తోటి స్నేహితులు అబ్బాస్, స్వాతి, మల్లితో కలిసి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటూ ఉంటాడు అర్జున్. జీవితంలో పెద్ద ఆశలంటూ లేని సగటు కుర్రాడిలానే ప్రవర్తిస్తుంటాడు. అబ్బాస్ చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు రోష్ని (అలీషా బేగ్)ని చూసి ప్రేమలో పడతాడు అర్జున్. ఆమె సిటీ పోలీస్ కమీషనర్ ఆలీఖాన్ (షాయాజీ షిండే) కూతురు అని తెలిసినా... ఆ ప్రేమను కొనసాగిస్తాడు. ఓసారి అతను చేసిన రక్తదానం కారణంగా రోష్ని నానమ్మ అపాయంనుండి బయటపడుతుంది. ఆ రకంగా రోష్నితో పరిచయం పెరుగుతుంది. అయితే ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్ళాలని రోష్ని నిర్ణయించుకుంటుంది. తండ్రి ప్రోత్సాహంతో తన మనసులోని ప్రేమను రోష్నికి తెలియచేయాలని ఎయిర్పోర్ట్కు వెళతాడు అర్జున్. సరిగ్గా అదే సమయంలో కొందరు టెర్రరిస్టులు అతను చదివే బసంతి కాలేజీని స్వాధీన పరుచుకుంటారు. బందీగా ఉన్న తమ నాయకుడు బాబార్ ఖాన్‌ను వదిలిపెడితేనే విద్యార్థులను తాను వదిలిపెడతామని హెచ్చరికలు జారీ చేస్తాడు ఘాజీఖాన్. తన స్నేహితులతోపాటే... రోష్ని కూడా టెర్రరిస్టుల కబంధ హస్తాలలో చిక్కుకుందనే విషయం అర్జున్‌కు తెలుస్తుంది. ఆ పైన అతనేం చేశాడన్నదే మిగతా కథ![1]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు మణిశర్మ సంగీతం సమకూర్చగా శ్రీమణి, కృష్ణ చైతన్యలు సాహిత్యాన్ని అందించారు.

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "తిరుగుబాటిది తిరుగుబాటిది"  శ్రీకృష్ణ,
కారుణ్య,
హేమచంద్ర,
సాహితి
 
2. "పారిపోతున్నా..బంగారు లోకంలోకి వాలిపోతున్నా"  పవన్  
3. "ప్రతిక్షణం పెదాలతో ప్రతిక్షణం నిరీక్షణ"  దినకర్,
చైత్ర
 
4. "స్పిరిట్ ఆఫ్ బసంతి"  శ్రీకృష్ణ,
కారుణ్య,
హేమచంద్ర
 
5. "వెళ్ళకురా"  దీపు  

స్పందనలు

[మార్చు]
  • రాజా గౌతమ్‌కు నటుడిగా ఇది మూడో సినిమా. కాలేజీ విద్యార్థిగా బాగానే నెగ్గుకొచ్చిన గౌతం, ఎమోషనల్ సీన్స్ను పండించలేక పోయాడు. అలానే బాలనటిగా పలు హిందీ చిత్రాలలో నటించి, రంగస్థలంలోనూ అనుభవం సంపా దించుకున్న అలీషా బేగ్ సైతం కొన్ని సన్నివేశాలలో తేలిపోయింది. ఇక సిటీ పోలీస్ కమీషనర్ అలీఖాన్ పాత్రలో షాయాజీ షిండే రొటీన్ నటనే కనబరిచాడు. ఘాజీఖాన్ పాత్రను శ్రీకాంత్ అయ్యంగార్ పోషించాడు. అయితే అతని పక్కన ఉన్న తోటి టెర్రరిస్టులంతా పేలవమైన నటన కనబరిచారు. ఓ జటిలమైన, వాస్తవమైన కథాంశాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేప్పుడు దానిని ఉత్కంఠభరితంగానూ, హృదయానికి హత్తుకునేలానూ చెబితేనే వాళ్ళను ఆకట్టుకోగలం. ఆ విషయంలో ‘బసంతి' చిత్రం విఫలమైందనే చెప్పాలి. మణిశర్మ సంగీతంకూడా సినిమాకు పెద్దగా ఉపయోగ పడలేదు. 'తిరుగు బాటిది...' లాంటి మంచి పాట సరైనచోట పడలేదు! సంభాషణలు బాగున్నా, పేలవమైన సన్నివేశాల నడుమ అవి తేలిపోయాయి! అయితే యేడాదిలో వందకు పైగా వస్తున్న రోటీన్ యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలకు ‘బసంతి' పూర్తిగా భిన్నమైంది.[1] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 చంద్రం (10 March 2014). "అభినందించదగ్గ ప్రయత్నం 'బసంతి'!". జాగృతి వారపత్రిక: 50. Retrieved 17 February 2024.

బయటి లింకులు

[మార్చు]