భావ్‌నగర్ జిల్లా
Bhavnagar district | |||||||
---|---|---|---|---|---|---|---|
Coordinates: మూస:Wikidatacoord | |||||||
దేశం | India | ||||||
రాష్ట్రం | గుజరాత్ | ||||||
Region | Saurashtra | ||||||
ముఖ్యపట్టణం | Bhavnagar | ||||||
Government | |||||||
• Member of Parliament | Dr. Bhartiben Shiyal (BJP) | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 7,034 కి.మీ2 (2,716 చ. మై) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• Total | 23,93,272 | ||||||
• జనసాంద్రత | 340/కి.మీ2 (880/చ. మై.) | ||||||
భాషలు | |||||||
• అధికార | Gujarati, Hindi | ||||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | ||||||
Vehicle registration | GJ 4 |
భావ్‌నగర్ జిల్లా, భారతదేశం, సౌరాష్ట్ర ద్వీపకల్పంలో ఆగ్నేయ గుజరాత్‌లోని ఒక జిల్లా. భావ్‌నగర్ జిల్లా లోని ప్రధాన భాగాన్ని గోహిల్ రాజ్‌పుత్‌లు పాలించినందున, దీనిని గోహిల్వార్ అని కూడా పిలుస్తారు.[2]భావ్‌నగర్ పట్టణంలో జిల్లా పరిపాలనా ప్రధానకార్యాలయం ఉంది.
భౌగోళికం
[మార్చు]భావ్‌నగర్ జిల్లా సుమారు 8,334 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉంది. ఎక్కువ ఒండ్రుమయం కలిగిన తీర ప్రాంతం.
భావ్‌నగర్ ఈశాన్యంలోఅహ్మదాబాద్ జిల్లా, వాయువ్య దిశలో బొటాడ్ జిల్లా, తూర్పు, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ కాంబే, పశ్చిమాన అమ్రేలి జిల్లా సరిహద్దులుగాఉన్నాయి.
చరిత్ర
[మార్చు]భావ్‌నగర్ రాష్ట్రం,[2] గోహిల్ రాజ్‌పుత్‌లచే పరిపాలించబడిన కాలంలో గౌరవనీయ రాష్ట్రంగా ఉండేది.[3] భావ్‌నగర్ బొటాడ్, గడ్డాడ అనే రెండు తాలూకాలను కోల్పోయింది. 2013 ఆగస్టులో బొటాడ్ కొత్త జిల్లాగా ఏర్పడినందున బొటాడ్, గడ్డాడ రెండు తాలూకాలు బొటాడ్ జిల్లాలో చేరాయి [4]
జనాభా శాస్త్రం
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 4,63,403 | — |
1911 | 4,99,690 | +0.76% |
1921 | 4,90,446 | −0.19% |
1931 | 5,59,723 | +1.33% |
1941 | 6,81,078 | +1.98% |
1951 | 7,89,232 | +1.48% |
1961 | 9,94,473 | +2.34% |
1971 | 12,47,432 | +2.29% |
1981 | 16,81,073 | +3.03% |
1991 | 20,69,953 | +2.10% |
2001 | 24,69,630 | +1.78% |
2011 | 28,80,365 | +1.55% |
source:[5] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం భావ్‌నగర్ జిల్లాలో 28,80,365 జనాభా ఉంది. ఈ జనాభా జమైకా దేశం లేదా యుఎస్ రాష్ట్రం కాన్సాస్ లోని జనాభాతో సమానం. దీనిని భారతదేశంలోని 640 జిల్లాలలో జనాభాపరంగా లెక్కించినప్పుడు 133వ ర్యాంక్‌ను ఇస్తుంది.జిల్లా జనసాంద్రత చ.కి.మీ.కు 288 మందిని కలిగి ఉంది. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.53% శాతానికి పెరిగింది. భావ్‌నగర్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 931 స్త్రీల లింగ నిష్పత్తిని కలిగి ఉంది.[1] అక్షరాస్యత రేటు 76.84%గా ఉంది.[1] జిల్లాలో హిందువులు 21,76,962 కాగా ముస్లింలు 18,7,148, జైనులు 21,851 మంది ఉన్నారు [6]
పరిపాలనా విభాగాలు
[మార్చు]భావ్‌నగర్ జిల్లా పరిపాలనా సౌలభ్యంకోసం భావ్‌నగర్, సిహోర్, ఉమ్రలా, గరియాధర్, పాలితానా, మహువ, తలజా, ఘోఘా, జెసర్, వల్భిపూర్ అనే పది తాలూకాలుగా విభజించబడ్డాయి.[7] జిల్లాలో దాదాపు 800 గ్రామాలు ఉన్నాయి.
భాష
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, 97.51% జనాభా గుజరాతీ , 1.18% హిందీ వారి మొదటి భాషగా మాట్లాడతారు.[8]
నగరాలు, పట్టణాలు,
[మార్చు]భావ్‌నగర్ జిల్లాలో నగరాలు, పట్టణాల జనాభా అభివృద్ధి.[9]
పేరు | జనాభా
1991 జనాభా లెక్కలు ప్రకారం |
జనాభా
2001 జనాభా లెక్కలు ప్రకారం |
జనాభా
2011 జనాభా లెక్కలు ప్రకారం |
---|---|---|---|
అలంగ్ | . . . | 18,475 | 8,309 |
అలంగ్-సోసియా | . . . | . . . | 18,480 |
భావ్‌నగర్ | 402,338 | 517,708 | 605,882 |
బొటాడ్ | 64,603 | 100,194 | 130,327 |
ధసవిషి | . . . | 13,368 | 14,448 |
ధోలా | 7,510 | 8,050 | 7,560 |
గఢడ | 21,955 | 26,754 | 29,872 |
గరియాధర్ | 19,723 | 30,526 | 33,949 |
ఘోఘా | 9,420 | 10,848 | 12,208 |
కాట్పర్ | 7,088 | 7,044 | 8,677 |
మహువ | 59,912 | 80,726 | 98,519 |
మలంక | . . . | 4,016 | 4,765 |
నారి | . . . | 9,066 | 9,467 |
పాలితానా | 41,877 | 51,944 | 64,497 |
సిద్సార్ | . . . | 7,195 | 11,795 |
సిహోర్ | 34,008 | 46,960 | 54,547 |
సోంగాధ్ | . . . | . . . | 6,027 |
తలజా | 17,965 | 26,104 | 27,822 |
ఉమ్రాలా | . . . | . . . | 8,044 |
వల్లభిపూర్ (వల్లభి) | . . . | 15,038 | 15,852 |
వర్తేజ్ | 8,187 | 9,705 | 11,354 |
రాజకీయం
[మార్చు]జిల్లా | నం. | నియోజకవర్గం | పేరు | పార్టీ | వ్యాఖ్యలు | |
---|---|---|---|---|---|---|
భావ్‌నగర్ | 99 | మహువ - భావనగర్ | శివభాయ్ గోహిల్ | భారతీయ జనతా పార్టీ | ||
100 | తలజా | గుతంభాయ్ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ | |||
101 | గరియాధర్ | సుధీర్ వాఘాని | ఆమ్ ఆద్మీ పార్టీ | |||
102 | పాలితానా | భిఖాభాయ్ బరయ్యా | భారతీయ జనతా పార్టీ | |||
103 | భావ్‌నగర్ రూరల్ | పర్సోత్తంభాయ్ సోలంకి | భారతీయ జనతా పార్టీ | |||
104 | భావ్‌నగర్ తూర్పు | సెజల్‌బెన్ పాండ్యా | భారతీయ జనతా పార్టీ | |||
105 | భావ్‌నగర్ వెస్ట్ | జితేంద్ర వఘని | భారతీయ జనతా పార్టీ |
దర్శించతగిన ప్రదేశాలు
[మార్చు]చారిత్రక ప్రదేశాలు
[మార్చు]భావ్‌నగర్ జిల్లాలోని అనేక చారిత్రక ప్రదేశాలలో ముఖ్యమైనవి:[10]
- తలేజాలోని బౌద్ధ గుహలు,
- రౌహిశాలలోని ఏడుగురు సోదరీమణుల విగ్రహాలు,
- భావ్‌నగర్ పట్టణంలోని క్రెసెంట్ సర్కిల్ వద్ద గాంధీ జ్ఞాపకచిహ్నం, సర్దార్ జ్ఞాపకచిహ్నం.
సహజ వారసత్వ ప్రదేశాలు
[మార్చు]*వెలవాదర్ బ్లాక్‌బక్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని జాతీయ ఉద్యానవనంగా గుర్తించబడిన ఏకైక ఉష్ణమండల గడ్డిభూమి ఈ జిల్లాలో ఉంది. ఇది 34.08 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనంలో ప్రధానంగా కృష్ణజింక, జింకలు, నీల్గై, తోడేళ్ళు, నక్కలు, హైనాలు, అడవి పిల్లులు, నక్కలు, అడవి పంది ఉన్నాయి. హౌబరా బస్టర్డ్, లెస్సర్ ఫ్లోరికాన్, సారస్ వైట్ స్టోర్క్స్, వైట్ పెలికాన్, మోంటాగు, పాలిడ్ హారియర్ వంటి అంతరించిపోతున్న పక్షులు ఉన్నాయి. గ్రేటర్ స్పాటెడ్ ఈగిల్, జువెనైల్ ఇంపీరియల్ ఈగిల్, బోనెల్లీస్ ఈగిల్, షార్ట్-టోడ్ స్నేక్ ఈగిల్, లాంగ్-లెగ్డ్ బజార్డ్‌తో సహా రాప్టర్‌లు ఉద్యానవనంలో కనిపిస్తాయి. వెలవ్దార్ జాతీయ ఉద్యానవనం లోని వాతావరణం, వలస పక్షుల సంతానోత్పత్తికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తించారు.
*పిరమ్ ద్వీపం, ఘోఘా ఆఫ్‌షోర్ నుండి సుమారు 6 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది.ఈ ద్వీపం దాదాపు 3.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెబుతారు. ఇది అనేక హాని కలిగించే లేదా అంతరించిపోతున్న జాతులతో సహా దాని జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. సా.శ. 1325లో నిర్మించిన శిథిలమైన కోట అక్కడ ఉంది. ఈ ద్వీపం మడ వృక్షసంపదను కలిగి ఉంది. అంతరించిపోతున్న రెండు జాతుల సముద్ర తాబేళ్లకు గూడు కట్టటానికి అనువైన ప్రదేశం ఇక్కడ ఉంది. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు, ఆకుపచ్చ సముద్ర తాబేలు, ఇంకా దాదాపు యాభై జాతుల పక్షులు, ఎక్కువగా సముద్ర పక్షులు ఈ ప్రదేశంలో జీవిస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "District Census Hand Book – Bhavnagar" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
- ↑ 2.0 2.1 "History". Bhavnagar District Panchayat, Gujarat Government. Archived from the original on 27 September 2013.
- ↑ Singhji, Virbhadra (1994). "The Gohil Rajputs". The Rajputs of Saurashtra. Bombay, India: Popular Prakashan. p. 38. ISBN 978-81-7154-546-9.
- ↑ "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. 13 August 2013. Archived from the original on 16 August 2013.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ "Population by Religion - Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ "Taluka Panchayat". Bhavnagar District Panchayat, Gujarat Government. Archived from the original on 20 July 2013.
- ↑ 8.0 8.1 "Table C-16 Population by Mother Tongue: Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ "Bhavnagar (District, Gujarat, India) - Population Statistics, Charts, Map and Location". citypopulation.de. Retrieved 2023-03-17.
- ↑ "Historical Places". Bhavnagar District Panchayat, Gujarat Government. Archived from the original on 26 June 2014.