మణిపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణిపూర్
Map of India with the location of మణిపూర్ highlighted.
Map of India with the location of మణిపూర్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
ఇంఫాల్
 - 23°48′N 25°41′E / 23.80°N 25.68°E / 23.80; 25.68
పెద్ద నగరం ఇంఫాల్
జనాభా (2001)
 - జనసాంద్రత
2,388,634 (22వ స్థానం)
 - 107/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
22,327 చ.కి.మీ (23వ స్థానం)
 - 9
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[మణిపూర్ |గవర్నరు
 - [[మణిపూర్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1972-01-21
 - శివిందర్ సింగ్ సిద్ధు
 - ఒక్రామ్ ఇబోది సింగ్
 - ఒకే సభ (60)
అధికార బాష (లు) మణిపురి
పొడిపదం (ISO) IN-MN
వెబ్‌సైటు: manipur.nic.in
దస్త్రం:Manipurseal.png

మణిపూర్ రాజముద్ర

మణిపూర్ (মনিপুর, Manipur) భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రము. దీని రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరామ్, పశ్చిమాన అసోం రాష్ట్రాలున్నాయి. తూర్పున మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

మణిపూర్‌లో మెయితీ తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. వారి భాష మెయితీ భాష. దీనినే మెయితిలాన్ అనీ, మణిపురీ అనీ అంటారు. 1992లో దీనిని జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించారు,

మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా పరిగణింపబడుతున్నది. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలులో ఉన్నాయి. మణిపూర్‌కు వచ్చే విదేశీయులు (మణిపూర్‌లో జన్మించిన విదేశీయులు కూడా) "నియంత్రిత ప్రాంత అనుమతి" (Restricted Area Permit) కలిగి ఉండాలి. ఈ అనుమతులు 10రోజులకు మాత్రమే చెల్లుతాయి. యాత్రికులు అనుమతింపబడిన ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఏర్పాటు చేయబడిన టూర్లలో, అదీ 4 వ్యక్తుల గ్రూపులలో, మాత్రమే పర్యటించవలెను. ఇంకా వారు ఇంఫాల్ నగరానికి విమాన ప్రయాణం ద్వారానే అనుమతింపబడుతారు.

చరిత్ర

[మార్చు]

ఒకప్పుడు థాయ్‌లాండ్, బర్మాల మధ్య తగవులలో మణిపూర్, అస్సాంలు ఇరుక్కున్నాయి. బర్మావారు థాయ్‌లాండ్‌ను ఆక్రమించిన తరుణాన్ని అవకాశంగా తీసుకొని మణిపూర్ బర్మా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళింది. ఆ కారణంగా బర్మావారు మణిపూర్, అస్సాంలపై దండెత్తారు. దీనితో ప్రక్కనున్న బెంగాల్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌వారు కలుగజేసుకొనవలసి వచ్చింది. తమ ఆధిపత్యాన్ని నిలుపకోవడానికి, బర్మాను నిరోధించడానికీ బ్రిటిష్‌వారు 1891లో అస్సాంను, మణిపూర్‌ను బర్మానుండి జయించి, తమ సామ్రాజ్యంలో కలుపుకొన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనలకూ మిత్రదళాల సేనలకూ (Allied forces) మధ్య జరిగిన భీకరయద్ధాలకు మణిపూర్ యుద్ధరంగమైంది. తూర్పు ఆసియాను జయించిన జపానీయుల సైన్యం మణిపూర్ సరిహద్దులకు చేరుకొంది. కాని వారు ఇంఫాల్‌లో ప్రవేశింపకముందే మిత్రదళాలు వారిని ఓడించారు. రెండవ ప్రపంచయుద్ధ గతిలో ఇది ఒక ముఖ్యమైన ఘటన. ఆయుధ్ధంలో నేలకొరిగిన భారతీయ, మిత్రదళాల సైనికుల స్మృత్యర్ధం "బ్రిటిష్ యుద్ధ సమాధుల కమిషన్" (British War Graves Commission) ఇప్పటికీ రెండు సమాధి స్థలాల పరిరక్షణను పర్వవేక్షిస్తున్నది.

1947లో భారత స్వాతంత్ర్య ప్రక్రియలో మళ్ళీ మణిపూర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపూర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపూర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యపాలనకు నాంది పలికాడు. 1949లో ప్రక్కనున్న భారతదేశపు అస్సాం≤ రాజధాని షిల్లాంగ్‌కు మహారాజు పిలువబడ్డాడు. మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పందంపై ఆయన సంతకం పెట్టాడు. 1949 అక్టోబరులో మణిపూర్ రాజ్యాంగ శాసనసభ రద్దుచేయబడింది. 1956 నుండి మణిపూర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబడింది.

1972లో మణిపూర్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

ఎన్నికలు

[మార్చు]

2022 మణిపూర్ శాసనసభ ఎన్నికలు 60 అసెంబ్లీ స్థానాలకు 2022 ఫిబ్రవరి 28, మార్చి 5న ఎన్నికలు జరిగాయి.

మణిపూర్ ఎదుర్కొంటున్న సమస్యలు

[మార్చు]

మాదక ద్రవ్యాలు

[మార్చు]

మణిపూర్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ఒకటి మాదక ద్రవ్యాల అలవాటు (drug addiction). మాదక ద్రవ్యాల వ్యాపారంలో ముఖ్యస్థానమైన బంగారు త్రికోణం (Golden Triangle) దగ్గరలో ఉండటం ఈ సమస్య పెరగడానికి ఒక కారణం. ఇందువల్ల వేలాది యువజనులు నిర్వీర్యులై పోతున్నారు. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి కూడా ఇది కారణమైనది. భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి ప్రబలంగా ఉన్నప్రాంతాలలో మణిపూర్ ఒకటి అయ్యింది.

జాతి వైషమ్యాలు

[మార్చు]

వివిధ జాతుల మధ్య ప్రబలుతున్న వైరుధ్యాలు మణిపురి సమాజానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయి. ఎన్నో తరాలుగా మెయితి జాతి ప్రజలు ఇరుగు పొరుగుతో సామరస్యంగా ఉంటూ వచ్చారు. కాని ఆర్థిక అసమానతలూ, తరుగుతున్న వనరులు, పెరుగుతున్న పోటీ, జనాభాకు సరిపడా పెరగని ఉద్యోగావకాశాలూ వివిధజాతుల మధ్య వైషమ్యాలకు ఆస్కారమిస్తున్నాయి. హిందూ ముస్లిము విభేదాలతో ఈ వైషమ్యాలు ఆగటంలేదు. కొండలలోని తెగలకూ విస్తరించాయి. ముఖ్యజాతులైన నాగా, కుకీ తెగల మధ్య దారుణ మారణకాండలు ప్రజ్వరిల్లాయి.

ముఖ్యమంత్రులు

[మార్చు]

సాయుధ వేర్పాటువాదం

[మార్చు]

అయితే సాయుధ వేర్పాటువాదం మణిపూర్‌లో అన్నింటికంటే తీవ్రమైన సమస్య. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ నేతృత్వంలో భారత జాతీయ సేన (INA) త్రివర్ణ పతాకం మొదటిసారిగా ఎగురవేసిన భారతభూభాగమైన ఈ నేల ఇప్పుడు వేర్పాటువాదంతో కకావికలవుతున్నది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ వేర్పాటువాదం ఎన్నో వర్గాలు, జాతులతో విస్తరించింది. మణిపూర్ జీవనంలో పోరాటాలు, మరణాలు, ఆందోళనలు అనుదిన సంఘటనలైపోయాయి. నెలనెలా ఉగ్రవాదుల దళాలకు ధనం ముట్టజెప్పడం సర్వ సాధారణమైపోయింది.

పెచ్చరిల్లుతున్న నిరుద్యోగ సమస్య, భారత ప్రభుత్వం చూపిన అలక్ష్య ధోరణి, మణిపూర్‌వాసుల పట్ల ఇతర ప్రాంతాలవారు చూపే వివక్షత - ఇలా చాలా కారణాలు వేర్పాటు వాదానికి కారణాలని విశ్లేషకులు చెబుతారు. ప్రస్తుతం ఎన్నో వేర్పాటుపోరాఠం చేసే వర్గాలు ఉన్నాయి. (GlobalSecurity.org నుండి)

సరిహద్దు తగవులు

[మార్చు]

చాలాకాలంనుండి మణిపూర్‌కు మయన్మార్‌తో సరిహద్దువిషయంలో తగవులున్నవి. ఇంకా మణిపూర్, నాగాలాండ్‌ల మధ్య కూడా సరిహద్దు విభేదాలున్నాయి.

నివారణా చర్యలు

[మార్చు]

మణిపూర్ వాసుల అసంతృప్తిని పోగొట్టేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసికొంది. 1992లో రాజ్యాంగం 71వ సవరణ ద్వారా మణిపురి భాషను 8వ షెద్యూలులో చేర్చారు. ఇప్పుడు మణిపూర్‌కు స్వంత టెలివిజన్ స్టేషను ఉంది.

2004 నవంబరు 20న ప్రధాన మంత్రి మన్‌మోహన్ సింగ్ మణిపురి జనుల ఒక చిరకాల కోరికను నెరవేర్చాడు. చారిత్రాత్మకమైన కాంగ్లా కోట మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పబడింది. ఇంతకుముందు, 1915 నుండి ఇది అస్సామ్ రైఫిల్స్ పారా మిలిటరీ దళం ప్రధాన కార్యాలయంగా ఉండేది. 113 సంవత్సరాల తరువాత ఈ కోటను సామాన్యప్రజల సందర్శనకు అనుమతించారు.

మణిపూర్ విశ్వవిద్యాలయంకు కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కల్పించారు. 97.9 కి.మీ. పొడవైన జిరిబామ్-ఇంఫాల్ బ్రాడ్‌గేజి రైలు మార్గం పనులు ప్రారంభించారు. ఈ మార్గం ఇంఫాల్‌కు 25 కి.మీ. దూరంలోని తుపుల్ వరకు వేయబడుతుంది.

రాష్ట్రానికి చెందిన ప్రముఖులు

[మార్చు]

అవీ-ఇవీ

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మణిపూర్&oldid=4288701" నుండి వెలికితీశారు