మహా జనపదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
महाजनपद
c. 600 క్రీ.పూ.–c. 300 క్రీ.పూ.
16 మహాజనపదాల పటము
16 మహాజనపదాల పటము
సామాన్య భాషలుసంస్కృతం
మతం
ఇతిహాస సనాతన ధర్మం
బౌద్ధమతము
జైనమతము
ప్రభుత్వంగణతంత్రం
రాచరికం
చారిత్రిక కాలంఇనుప యుగ భారతదేశం
• స్థాపన
c. 600 క్రీ.పూ.
• పతనం
c. 300 క్రీ.పూ.
Preceded by
Succeeded by
Epic India
వేదిక యుగం
నంద వంశం
మహా జనపదముల పటము.

ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరు నుండి ఐదవ శతాబ్దం వరకు విలసిల్లిన 16 రాజ్యాలను మహాజనపదాలు అంటారు. వాటిలో రెండు గణతంత్రాలు కాగా, మిగతా వాటిలో రాచరికం ఉండేది. అంగుత్తార నికాయ [1] వంటి పురాతన బౌద్ధ గ్రంథాలు పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల గురించి ప్రస్తావిస్తాయి. ఇవి భారతదేశంలో బౌద్ధమతం విస్తరించడానికి ముందు,[2] భారత ఉపఖండంలో వాయవ్యంలోని గాంధార నుండి తూర్పున ఉన్న అంగ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.[3]

క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దాలను భారతీయ ప్రారంభ చరిత్ర తొలినాళ్ళలో ఒక ప్రధానమైన మలుపుగా పరిగణిస్తారు; సింధు లోయ నాగరికత నశించిన తరువాత భారతదేశంలో మొట్టమొదటి పెద్ద నగరాల ఆవిర్భావం, అలాగే వేద కాలం నాటి సనాతన ధర్మాన్ని సవాలు చేసే శ్రమణ ఉద్యమాలు (బౌద్ధమతం జైన మతాలతో సహా) పెరిగాయి.

పురావస్తు పరంగా, ఈ కాలం నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది.[4]

అవలోకనం

[మార్చు]
నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి చెందిన కుండలు (క్రీ.పూ. 500-200)

"జనపదం" అనే పదానికి ప్రజల పాదం అని అర్థం. జనపదం జన నుండి ఉద్భవించిందనే వాస్తవం, స్థావర జీవన విధానం కోసం ప్రజలు భూమిని సేకరించుకునే ప్రారంభ దశను సూచిస్తుంది. భూమిపై తొలి జనావాస ప్రక్రియలో చివరి దశ, బుద్ధుడు, పాణిని కాలాని కంటే ముందే పూర్తయింది. బుద్ధుడి కంటే ముందు, భారతీయ ఉపఖంపు వాయవ్య ప్రాంతం అనేక జనపదాలుగా విభజించబడి ఒకదానికొకటి సరిహద్దులుగా గుర్తించబడి ఉండేవి. పాణిని యొక్క "అష్టాధ్యాయి" లో, జనపదం అటే దేశం, జనపదిన్ అంటే దాని పౌరులు. ఈ జనపదాలకు క్షత్రియుల పేరు పెట్టారు.[5][6][7][8][9][10][11][12] బౌద్ధ, ఇతర గ్రంథాలు యాదృచ్ఛికంగా బుద్ధుని కాలానికి ముందు ఉనికిలో ఉన్న పదహారు గొప్ప దేశాలను (షోడశ మహాజనపదాలు) సూచిస్తాయి. మగధ విషయంలో తప్ప అవి, మిగతావాటి చరిత్రను చెప్పవు. బౌద్ధ అంగుత్తర నికాయ, అనేక ప్రదేశాలలో,[13] పదహారు గొప్ప దేశాల జాబితాను ఇస్తుంది:

మరొక బౌద్ధ గ్రంథం, దిఘా నికాయ, పై జాబితాలో ఉన్నవాటిలో పన్నెండు మహాజనపదాలను మాత్రమే ప్రస్తావించింది. వాటిలో నాలుగింటిని (అస్సక, అవంతి, గాంధార, కాంభోజ) వదిలివేసింది.[14]

మరొక పురాతన బౌద్ధ గ్రంథం, చుల్ల నిద్దేశలో ఈ జాబితాకు కళింగను చేర్చింది. గాంధార స్థానంలో యోనను చేర్చింది. ఆ విధంగా యోన, కాంభోజ - ఈ రెంటిని మాత్రమే మహాజనపదాల్లో ఉత్తరాపథానికి చెందిన వాటిగా గుర్తించింది.[15][16]

జైన మత సూత్రమైన వ్యాఖ్యాప్రజ్ఞప్తి (లేదా భగవతి సూత్రం) ఇచ్చే పదహారు మహాజనపదాల జాబితా మరికొంత భిన్నంగా ఉంటుంది:

  1. అంగ
  2. బంగ (వంగ)
  3. మగధ
  4. మాలయ
  5. మాళవక
  6. అచ్చ
  7. వచ్చ
  8. కొచ్చ
  9. పధ
  10. లధ (లత)
  11. బజ్జి (వజ్జి)
  12. మోలి (మల్ల)
  13. కాశీ
  14. కోసల
  15. అవాహ
  16. శంభుత్తర

భగవతి సూత్రం (లేదా వ్యాఖ్యాప్రజ్ఞప్తి) రచయిత మధ్యదేశ రాజ్యాలపై, దూర ప్రాచ్య, దక్షిణ ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టారు. అతను కాంభోజ, గాంధార వంటి ఉత్తరాపథ రాజ్యాలను వదిలివేసాడు. భగవతి జాబితాలో మరింత దూరాల్లో ఉన్న రాజ్యాలు ఉండడం, ఉత్తరాపథం లోని రాజ్యాలను పూర్తిగా లేకపోవడం చూస్తే "భగవతి జాబితా తరువాతి కాలానికి చెందినదని, అందువల్ల అది అంత నమ్మదగినది కాదనీ స్పష్టంగా తెలుస్తుంది." [17]

మహాజనపదాల జాబితా

[మార్చు]

అంగ రాజ్యం గురించిన తొలి ప్రసక్తి అథర్వణ వేదంలో కనబడుతుంది. అందులో మగధ, గాంధార, ముజావత్‌లతో పాటు ఇదీ ప్రస్తావనకు వస్తుంది. ఆర్యన్ ప్రజల మొదటి సమూహంలో జైన ప్రజ్ఞాపన అంగ, వంగలను మొదటి సమూహానికి చెందిన ఆర్యులుగా చూపిస్తుంది. ఇది ప్రాచీన భారతదేశంలోని ప్రధాన నగరాల గురించి ప్రస్తావించింది.[18] ఇది గొప్ప వ్యాపార వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. అంగ రాజ్యపు వ్యాపారులు క్రమం తప్పకుండా సుదూర సువర్ణభూమికి ప్రయాణించేవారు. బింబిసారుడి కాలంలో అంగను మగధ ఆక్రమించింది. ఇది బింబిసారుడి ఏకైక విజయం.

అస్సక

[మార్చు]

అస్సక దేశం లేదా అశ్మక దేశం దక్షిణాపథంలో లేదా దక్షిణ భారతదేశంలో ఉంది. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు భాగంగా ఉండేవి..[19] గౌతమ బుద్ధుని కాలంలో, అస్సకులు చాలా మంది గోదావరి నది ఒడ్డున ( వింధ్య పర్వతాలకు దక్షిణాన) ఉండేవారు. అస్సకుల రాజధాని పొటానా లేదా పొటాలి. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బోధన్. ఇదే మహాభారతంలోని పౌదన్య కూడా.[20] అశ్మకులను పాణిని కూడా ప్రస్తావించాడు. మార్కండేయ పురాణం, బ్రహత్ సంహితలు వీరు వాయవ్యంలో ఉంటారని చెప్పాయి. గోదావరి నది అస్సకుల దేశాన్ని ములాకుల (లేదా అలకా) నుండి వేరు చేసేది. అస్సక రాజ్యం మధ్య దేశాలకు వెలుపల దక్షిణాపథంలో ఉండేది. ఒక సమయంలో, మూలక రాజ్యం అస్సక లోనే భాగంగా ఉండేది. అది అవంతిని ఆనుకుని ఉండేది.[21]

అవంతి

[మార్చు]
అవంతి మహాజనపదానికి చెందిన వెండి నాణెం (క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం)

అవంతి పశ్చిమ భారతదేశంలోని ఒక ముఖ్యమైన రాజ్యం. మహావీర, బుద్ధుల అనంతర కాలంలో భారతదేశంలోని నాలుగు గొప్ప రాచరికాలలో ఇది ఒకటి. మిగతా మూడు కోసల, వత్స, మగధ . అవంతిని నర్మదా నది ఉత్తర, దక్షిణాలుగా విభజించింది. మొదట్లో, మాహిష్మతి దక్షిణ అవంతికి రాజధానిగా ఉండేది. ఉత్తర అవంతి రాజధాని ఉజ్జయిని. కానీ మహావీరుడు, బుద్ధుడి కాలాల్లో ఉజ్జయిని ఐక్య అవంతికి రాజధానిగా ఉండేది. అవంతి దేశం సుమారుగా ఆధునిక మాల్వా, నిమార్, నేటి మధ్యప్రదేశ్^కు ఆనుకుని ఉన్న ప్రాంతాలు కలిసి ఉండేవి. మాహిష్మతి, ఉజ్జయిని రెండూ, రాజగృహ నుండి ప్రతిష్ఠానపురం (పైఠాన్) వరకూ ఉన్న దక్షిణాపథంపై ఉండేవి. అవంతి బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. కొందరు ప్రముఖ థేరాలు, థేరీలు ఇక్కడే పుట్టి ఇక్కడే నివసించారు. అవంతి రాజు నందివర్ధనను మగధ రాజు శిశునాగ ఓడించాడు. అవంతి తరువాత మగధ సామ్రాజ్యంలో భాగమైంది.

ఛేది

[మార్చు]

ఛేది లేదా ఛేతి లేదా ఛేత్య రెండు విభిన్న స్థావరాలు - ఒకటి నేపాల్ పర్వతాల్లో ఉంది. రెండోది, బుందేల్ఖండ్ సమీపంలోని కౌశాంబి. పాత గ్రంథ్యాల ప్రకారం ఛేది, కురు వత్స రాజ్యాల మధ్య యమున దగ్గర ఉండేది. మధ్యయుగ కాలంలో, ఛేది రాజ్యపు దక్షిణ సరిహద్దు నర్మదా నది ఒడ్డు వరకూ విస్తరించాయి. మహాభారతం లోని సొత్తివత్‌నగరం, లేదా సూక్తి లేదా సూక్తిమతి, ఛేది రాజ్య రాజధాని. ఛెదీయులు భారతదేశానికిచెందిన ప్రాచీన ప్రజలు. వారి రాజు కాశు చైద్య గురించి ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది.[22]

రాజధాని నగరం సూక్తిమతి స్థానం ఎక్కడనేది కచ్చితంగా తెలియలేదు. చరిత్రకారుడు హేమచంద్ర రాయచౌదరి, ఎఫ్.ఇ.పార్గిటర్ లు ఇది ఉత్తర ప్రదేశ్ లోని బందా సమీపంలో ఉందని నమ్మారు.[22] మధ్యప్రదేశ్‌లోని రేవా శివార్లలో ఆధునిక ఇటాహా ఉన్న ప్రదేశంలో, ఒక పెద్ద ప్రారంభ చారిత్రక నగరం యొక్క శిథిలాలుగా సూక్తిమతిని గుర్తించవచ్చని పురావస్తు శాస్త్రవేత్త దిలీప్ కుమార్ చక్రవర్తి ప్రతిపాదించాడు.[22]

గాంధార

[మార్చు]

ఋగ్వేదంలో గాంధార ఉన్ని గురించిన ప్రస్తావన ఉంది. గాంధారలు, వారి రాజూ మహాభారత యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా కురులకు బలమైన మిత్రులుగా ఉన్నారు. గాంధారాలు శౌర్య ప్రతాపాలు కలిగినవారు. యుద్ధ కళలో బాగా శిక్షణ పొందినవారు. గాంధార జనపదాన్ని యయాతి వంశానికి చెందిన అరుద్ధుడి కుమారుడు గాంధార స్థాపించాడని పౌరాణిక ప్రశస్తి. ఈ రాజ్యంలోని యువరాజులు ఋగ్వేద కాలం నాటి ప్రసిద్ధ రాజు ద్రుహుకు వారసత్వ రేఖనుండి వచ్చినవారని ప్రతీతి. ఈ ద్రుహు చంద్ర వంశపు రాజైన యయాతి ఐదుగురు కొడుకుల్లో ఒకడు. సింధు నది గాంధార భూములను తడిపింది. ఈ మహాజనపదంలోని రెండు నగరాలైన తక్షశిల, పుష్కలావతి ల పేర్లను భరతుడి ఇద్దరు కుమారులు తక్ష, పుష్కరుల పేరు మీదుగా పెట్టారు. అయోధ్య రాముడి తమ్ముడే ఈ భరతుడు. వాయు పురాణం (II.36.107) ప్రకారం, గాంధారలను ప్రమితి (అనగా కలిక) నాశనం చేసాడు. పాణిని వేద రూపమైన గాంధారిని, తరువాత గాంధార రూపాన్ని -రెంటినీ తన అష్టాధ్యాయంలో పేర్కొన్నాడు. గాంధార రాజ్యంలో భాగంగా కొన్నిసార్లు కాశ్మీర కూడా ఉంటుంది.[23] మిలేటస్ కు చెందిన హెకాటేయస్ (549-468), కాస్పపిరోస్ (కశ్యపురా లేదా పురుషపురా, అనగా ఆధునిక పెషావర్) అనే గాంధార నగరాన్ని ఉదహరించాడు. గాంధార జాతక కథ ప్రకారం, ఒక సమయంలో, గాంధార కాశ్మీర్ రాజ్యంలో ఒక భాగంగా ఏర్పడింది. జాతక కథలు గాంధారను చాందహరా అని కూడా వ్యవహరించాయి.

బౌద్ధ సంప్రదాయాలకు చెందిన గాంధార మహాజనపదంలో తూర్పు ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ వాయవ్య భాగాలు (ఆధునిక పెషావర్ (పురుషాపుర), రావల్పిండి జిల్లాలు) ఉండేవి. తరువాతి కాలంలో దీని రాజధాని తక్షశిల ( టాక్సీలాకు ప్రాకృతం). తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన కాలంలో ప్రఖ్యాత విద్యా కేంద్రంగా ఉండేది. ప్రపంచం నలుమూలల నుండి పండితులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవారు. వ్యాకరణకర్తా మేధావీ అయిన పాణిని, చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం మధ్యలో గాంధార రాజు పుక్కుసతి లేదా పుష్కరశారిన్ మగధ రాజు బింబిసారుడికి సమకాలికుడు. గాంధార ఉత్తరాపథంలో ఉంది. అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. కొందరు పండితుల ప్రకారం, గాంధారలు, కాంభోజులు తెలివికలవారు.[24][25][26] కురులు, కాంభోజులు, గాంధారులు, బాహ్లికులు అంతా తెలివైనవాళ్ళే అని కూడా వాదించారు.[27] గాంధార, కాంభోజ ఒకే సామ్రాజ్యం లోని రెండు ప్రాంతాలే నని, అవి ఒకదానికొకటి ఆనుకుని ఉండేవనీ, అందువల్ల ఒకరి భాషను మరొకటి ప్రభావితం చేసాయనీ డాక్టర్ టిఎల్ షా చెప్పాడు.[28] సహజంగానే, వారు ఒకప్పుడు తెలివైన ప్రజలే అయి ఉండవచ్చు.[29] గాంధార తరచూ పొరుగు ప్రాంతాలైన కాశ్మీర కాంభీజలతో రాజకీయంగా ముడిపడి ఉన్నారు.[30]

కాంభోజ

[మార్చు]

కాంభోజులు కూడా ఉత్తరాపథంలో ఉండేవారు. పురాతన సాహిత్యంలో, కాంభోజ వివిధ గాథల్లో వివిధాలుగా - గాంధారులు, దరదులు, బాహ్లికుల (బాక్ట్రియా) తో సంబంధం ఉన్నట్టుగా చిత్రించాయి. పురాతన కాంభోజ హిందూకుష్ పర్వతాలకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను కలిగి ఉండేది. అసలు కాంభోజ తూర్పు ఆక్సస్ దేశంలో బాహ్లికకు పొరుగున ఉండేది. అయితే కాలక్రమేణా, కాంభోజులలోని కొన్ని వంశాలు హిందూకుష్ను దాటి దాని దక్షిణ భాగంలో వలసలను స్థాపించినట్లు కనిపిస్తోంది. ఈ తరువాతి కాంభోజులు భారతీయ సాహిత్యంలో దారదులు, గాంధారులతో సంబంధం కలిగి ఉన్నారు. అశోకుడి శాసనాలలో కూడా వీరి ప్రస్తావన ఉంది. మహాభారత ఆధారాలు, టోలెమి భౌగోళికంలోని ఆధారాల ప్రకారం, రెండు కాంభోజ స్థావరా లున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.[31] సిస్-హిందూకుష్ ప్రాంతంలో నూరెస్తాన్ నుండి కశ్మీరు లోని రాజౌరి వరకూ ఉన్న భూభాగమే కాంభోజ. దీనికి దరదులు, గాంధారులతో సరిహద్దులుండేవి.[32] కాంభోజుల రాజధాని బహుశా కాశ్మీర్ నైరుతిలో ఉన్న రజౌరి అయి ఉండవచ్చు. బౌద్ధ సంప్రదాయాల్లో ఉన్న మహాజనపదాల్లోని కాంభోజ అంటే ఈ హిందూకుష్ ప్రాంతమే.[33]

పామీర్లు, బదక్షన్ లతో కూడిన హిందూకుష్-ఆవలి ప్రాంతం ఓరమ కాంభోజ రాజ్యం. దీనికి పశ్చిమాన బాహ్లికులు, ఉత్తరన సోగ్దియనా/పర్గాణా ల్కు చెందిన రిషికులు సరిహద్దులుగా ఉండేవారు.[34] కాంభోజుల ట్రాన్స్-హిందూకుష్ శాఖ స్వచ్ఛమైన ఇరానియన్లుగా మిగిలిపోయారు గానీ, హిందూకుష్‌కు ఇవతల ఉన్న కాంభోజులు భారతీయ సాంస్కృతిక ప్రభావానికి లోనైనట్లు కనిపిస్తోంది. కాంభోజులకు ఇరానియన్ భారతీయ అనుబంధాలు రెండూ ఉన్నట్లు తెలుస్తోంది.[35][36][37][38][39][40][41][42][43][44][45]

కాంభోజులు పురాణ కాలం నుండి ప్రసిద్ధి గాంచిన గణతంత్ర ప్రజలు. మహాభారతం కాంభోజులలోని అనేక గణా (లేదా రిపబ్లిక్) లను సూచిస్తుంది.[46] కౌటిల్యుని అర్ధశాస్త్రం [47] అశోకుడి శాసనం నంబర్ XIII కూడా కాంభోజులు గణతంత్ర రాజ్యాంగాన్ని అనుసరించాయని ధ్రువీకరిస్తున్నాయి. పాణిని సూత్రాలు మాత్రం,[48] కాంభోజది క్షత్రియ రాచరికం అని తెలియజేస్తున్నాయి. కాంభోజుల పాలకుడు నామమాత్రపు నేత మాత్రమేనని కూడా చెబుతాడు [49] బౌద్ధ గ్రంథాల ప్రకారం, పైన పేర్కొన్న మహాజనపదాలలో మొదటి పద్నాలుగు మజ్జిమదేశ (మధ్య భారతదేశం) కు చెందినవి. చివరి రెండు ఉత్తరాపథానికి లేదా జంబూద్విప వాయవ్య ప్రాంతానికి చెందినవి.

క్రీస్తుపూర్వం 6/5 వ శతాబ్దంలో జరిగిన ఆధిపత్య పోరాటంలో, పెరుగుతున్న మగధ రాజ్యం ప్రాచీన భారతదేశంలో ప్రధాన శక్తిగా ఉద్భవించింది. మజ్జిమదేసలోని అనేక జనపదాలను ఆక్రమించింది. మగధ చక్రవర్తి మహాపద్మ నందుడు క్షత్రియులందరినీ నిర్మూలించాడని బ్రాహ్మణ పురాణాలలో విలాపం వినిపించింది. ఆ తరువాత క్షత్రియ అనే పేరుకు అర్హులైనవారే లేరు. ఇది కాశీ, కోసల, కురు, పాంచాల, వత్స్య, తూర్పు పంజాబుకు చెందిన ఇతర నియో-వేద తెగలను సూచిస్తుంది. వీళ్ళ గురించి పురాణాల్లోను కవిత్వాల్లోనూ తప్ప మరెక్కడా వినబడలేదు. (నందులు క్రీ.పూ. 345 లో శిశునాగ సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తద్వారా నంద సామ్రాజ్యాన్ని స్థాపించారు. ) [22]

అయితే చంద్రగుప్తుడు, కౌటిల్యుడు రంగస్థలం పైకి వచ్చే వరకు కాంభోజులు, గాంధారులకు మగధ రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కానీ ఈ దేశాలకు ఉన్న ఆహారంగా పడిపోయింది కానీ ఈ రెండు రాజ్యాలు పర్షియాకు చెందిన అకెమినీడ్ల పాలకుడు, సైరస్ (558-530 BCE) చేతిలో గానీ, డారియస్ పాలన మొదటి సంవత్సరంలో గానీ ఓడిపోయారు. కాంభోజ, గాంధారలు అకెమెనీడ్ సామ్రాజ్యపు ఇరవయ్యవ సామంత రాజ్యంగా, వారి సామంత రాజుల్లో అత్యంత ధనిక రాజ్యంగా మారిపోయింది. సైరస్ I ప్రముఖ కాంభోజ నగరం కపిసి (ఆధునిక బెగ్రామ్) ని నాశనం చేసాడని ప్రతీతి  

కాశీ

[మార్చు]

ఈ రాజ్యం దాని రాజధాని వారణాసి చుట్టూ ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంది. దీనికి ఉత్తర, దక్షిణాల్లో వరుణ, ఆసి నదులున్నాయి. వీటి వలన ఈ నగరానికి వారణాసి అనే పేరు వచ్చింది. బుద్ధుడికి ముందు, పదహారు మహాజనపదాలలో కాశీ అత్యంత శక్తివంతమైనసి. అనేక జాతక కథలు భారతదేశంలోని ఇతర నగరాల కంటే కాశీ రాజ్య రాజధానే గొప్పదని పేర్కొంటాయి. దాని గొప్పదనం గురించి, సుసంపన్నత గురించి ఎక్కువగా వర్ణిస్తాయి. ఈ కథలు కాశీ రాజ్యానికీ కోసల, అంగ, మగధ అనే మూడు రాజ్యాలకూ మధ్య ఆధిపత్యం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాల గురించి చెబుతాయి. కాశీ రాజు బృహదత్తుడు కోసలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, బుద్ధుడి కాలం లోనే కంసుడు కాశీ రాజ్యాన్ని కోసల రాజ్యంలో కలిపేసుకున్నాడు. కాశీ, కోసల, విదేహ రాజ్యాల ప్రస్తావన వేద గ్రంథాలలో కనబడుతుంది. ఈ ప్రజలు ఓక్రికొకరు దగ్గరి సంబంధీకులని తెలుస్తోంది. కాశీని మత్స్య పురాణంలో కౌశిక అని, అల్ బెరూని కౌషాక అనీ పిలిచారు. మిగతా పురాతన గ్రంథాలన్నీ కాశీ అనే పేరునే ప్రస్తావిస్తాయి

కోసల

[మార్చు]
[permanent dead link]కోసల మహాజనపాడ యొక్క వెండి నాణేలు (క్రీ.పూ. 525-465)

కోసల దేశం మగధకు వాయవ్య దిశలో ఉంది, దాని రాజధాని అయోధ్య. దీని భూభాగం మధ్య తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని ఆధునిక అవధ్ (లేదా ఔధ్) తో సరిపోతుంది. దీనికి దక్షిణాన గంగా నది, తూర్పున గండక్ (నారాయణి) నది, ఉత్తర సరిహద్దున హిమాలయ పర్వతాలూ ఉన్నాయి. ఇది వేద ధర్మ కేంద్రంగా పేర్కొనబడింది. దాని రాజులు దైత్యులు, రాక్షసులు, అసురులకు వ్యతిరేకంగా వివిధ యుద్ధాలలో దేవతలతో పొత్తు పెట్టుకున్నారు. కోసల, అయోధ్య లకు హిందూ గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలలో ప్రముఖ స్థానం ఉంది. రఘువంశం-ఇక్ష్వాకువంశం అత్యంత సుదీర్ఘమైన నిరంతర రాజవంశం; ఈ రాజవంశంలో రాముడు ఒక రాజు. ఇతర గొప్ప రాజులు పృథువు, హరిశ్చంద్రుడు, దిలీపుడు. వివిధ పురాణాల్లో, రామాయణం, మహాభారతాలలో వీరందరి ప్రస్తావన ఉంది. ఈ గ్రంథాల ప్రకారం, రికార్డు చేసిన చరిత్రలో కోసల అత్యంత శక్తివంతమైన, అతిపెద్దదైన రాజ్యం.

సాంచిలోని[permanent dead link] బుద్ధుడిని కలవడానికి శ్రావస్తి నుండి బయలుదేరిన కోసల ప్రసేనజిత్తు ఊరేగింపు .[50]

తరువాత, ఈ రాజ్యాన్ని మహావీరుడు, బుద్ధుని కాలాల్లో ప్రసిద్ధ రాజు ప్రసేనజిత్తు పాలించాడు. తరువాత అతని కుమారుడు విడుదాభా (విరూధక). ప్రసేనాజిత్తు ఉన్నత విద్యావంతుడు. మగధతో పెళ్ళి సంబంధాల ద్వారా అతని స్థానం మరింత బలపడింది: అతని సోదరిని బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్ళిలో కాశీలో కొంత భాగాన్ని కట్నంగా ఇచ్చారు. అయితే, పసేనాడి (ప్రసేనజిత్తు) కు, మగధ రాజు అజాతశత్రువుకూ మధ్య ఆధిపత్య పోరు జరిగింది. లిచ్ఛవులు మగధకు మద్దతు పలకడంతో ఈ పోరు ముగిసింది. విదుదాభా కోసల పాలకుడిగా ఉన్న సమయంలో కోసల మగధలో విలీనమై పోయింది. అయోధ్య, సాకేత, బనారస్, శ్రావస్తిలు కోసల రాజ్యపు ప్రధాన నగరాలు.  

కురు

[మార్చు]
[permanent dead link]కురు మహాజనపదపు వెండి నాణెం (క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం)

పురు - భరత కుటుంబం ప్రస్తావన ద్వారా పురాణాల్లో కురు రాజ్య మూలం ఉంది. పురు రాజవంశంలో 25 తరాల తరువాత, కురు పుట్టాడు. కురు తర్వాత 15 తరాల అనంతరం, కౌరవులు, పాండవులు జన్మించారు. కురులు మధ్యదేశంలో ఉండేవారని, ఉత్తర కురులు హిమాలయాలకు ఆవల నివసించేవారనీ ఐతరేయ బ్రాహ్మణం చెబుతోంది. బౌద్ధ గ్రంథం సుమంగవిలాసిని ప్రకారం,[51] కురురాజ్య ప్రజలు (కురులు) ఉత్తర కురు భూముల నుండి వచ్చారు. వాయు పురాణము కురు, పురు వంశం సంవర్షణుడి కుమారుడైన కురు, ఈ వంశానికి మూల పురుషుడని చెబుతుంది. ఇతడే కురుక్షేత్ర జనపద స్థాపకుడు. సుమారుగా ఆధునిక థానేసర్, ఢిల్లీ రాష్ట్రం, ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లా ప్రాంతమే కురు రాజ్యం. జాతక కథల ప్రకారం, కురు రాజధాని, ఆధునిక ఢిల్లీ సమీపంలోని ఇంద్రప్రస్థ (ఇందపత్త). బుద్ధుని కాలంలో, కురు రాజ్యాన్ని కొరైవ్య అనే పేరుగల అధిపతి (కింగ్ కాన్సుల్) పాలించారు. బౌద్ధ కాలంలోని కురులకు వేద కాలపు కురులకు ఉన్నంత ఉన్నత స్థానం లేదు గానీ, వారి ప్రాచీనుల లాగానే వీరు కూడా లోతైన జ్ఞానం, మంచి ఆరోగ్యంతో ఉండేవారు. కురులు యాదవులు, భోజులు, త్రిగ్రర్తులు, పాంచాలులతో పెళ్ళి సంబంధాలు కలుపుకున్నారు. యుధిష్ఠిర జాతికి చెందిన యువరాజుగా పరిచయం చేసిన ధనంజయ రాజు గురించి, జాతక కథలో ఒక ప్రస్తావన ఉంది. మునుపటి కాలంలో సుప్రసిద్ధ రాచరిక ప్రజలు అయినప్పటికీ, కురులు క్రీస్తుపూర్వం 6 నుండి 5 వ శతాబ్దాలలో గణతంత్ర ప్రభుత్వానికి మారారు. కురులు రాజశబ్దోప జీవిన్ (కింగ్ కాన్సుల్) రాజ్యాంగాన్ని అనుసరించేవారని క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, కౌటిల్యుని అర్ధశాస్త్రం ధ్రువీకరిస్తుంది.

[permanent dead link]మగధ మహాజనపదపు వెండి నాణెం (క్రీ.పూ 350)

మహాజనపదాలలో మగధ అత్యంత ప్రముఖమైనది, సంపన్నమైనది. రాజధాని నగరం పాటలీపుత్ర (పాట్నా, బీహార్), గంగా, సోన్, పున్పున్, గండక్ వంటి ప్రధాన నదుల సంగమ స్థలం వద్ద ఉంది. ఈ ప్రాంతంలోని ఒండ్రు మైదానాలు, బీహార్, జార్ఖండ్ ల లోని రాగి, ఇనుము అధికంగా ఉన్న ప్రాంతాల సామీప్యత వలన మంచి నాణ్యమైన ఆయుధాలను అభివృద్ధి చేయడానికీ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడింది. ఆ కాలం నాటి వాణిజ్య రహదారులకు మధ్యలో ఉన్నందున మగధ సంపదకు దోహదపడింది. ఈ కారకాలన్నీ మగధను ఆ కాలంలో అత్యంత సంపన్నమైన రాజ్యంగా ఎదగడానికి సహాయపడ్డాయి.

మగధ[permanent dead link] రాజు బింబిసారుడు రాజగృహలోని వెదురు తోట (వేణువనం) ను సందర్శిస్తాడు; సాంచి నుండి కళాకృతి.

మగధుల రాజ్యం - దక్షిణ బీహార్‌లోని పాట్నా, గయ ఆధునిక జిల్లాలు, తూర్పున బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలూ ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పాటలీపుత్రకు ఉత్తరాన గంగా నది, తూర్పున చంపా నది, దక్షిణాన వింధ్య పర్వతాలు, పశ్చిమాన సోన్ నది ఉన్నాయి. బుద్ధుని కాలంలో అంగ రాజ్యం మగధ సరిహద్దుల లోపల ఉండేది. దీని తొలి రాజధాని గిరివ్రజ లేదా రాజగృహ (ఆధునిక బీహార్ లోని నలంద జిల్లాలో ఉన్న రాజ్‌గిర్). నగరానికి ఇతర పేర్లు మగధపుర, బృహద్రథపుర, వసుమతి, కుశాగ్రపుర, బింబిసారాపురి. ఇది ప్రాచీన కాలంలో జైనమతం యొక్క చురుకైన కేంద్రం. మొదటి బౌద్ధ మండలి వైభారా కొండలలోని రాజగృహలో జరిగింది. తరువాత, పాటలీపుత్ర మగధ రాజధాని అయింది.

మల్ల

[మార్చు]

బౌద్ధ, జైన రచనలలో మల్ల గురించి తరచుగా ప్రస్తావించబడుతుంది. వారు ఉత్తర దక్షిణాసియాలో నివసించే శక్తివంతమైన ప్రజలు. మహాభారతం ప్రకారం, పాండుపుత్ర భీమసేన తూర్పు భారతదేశంలో తన యాత్రలో మల్లులను జయించినట్లు చెబుతారు. బౌద్ధ కాలంలో, మల్ల క్షత్రియులు తొమ్మిది సమాఖ్య వంశాలకు చెందిన తొమ్మిది భూభాగాలు కలిగిన గణతంత్ర రాజ్యం.[52] ఈ గణతంత్ర రాజ్యాలను గణా లనేవారు. ఈ సమాఖ్యల్లో రెండు - కుశినారా (గోరఖ్‌పూర్ సమీపంలో ఆధునిక కాసియా) రాజధానిగా ఒకటి, పావా (ఆధునిక పద్రానా, కాసియా నుండి 12 మైళ్ళు) రాజధానిగా రెండవది - బుద్ధుని సమయంలో చాలా ముఖ్యమైనవి. బౌద్ధ, జైన మత చరిత్రలో కుసినారా, పావాలు చాలా ముఖ్యమైనవి. బుద్ధుడు, 24 వ జైన తీర్థంకరుడైన మహావీరుడు, చివరిసారిగా కుశినారా, పావ / పావపురి వద్ద భోజనం చేశారు. బుద్ధుడు పావ వద్ద అనారోగ్యానికి గురై కుసినారాలో మరణించాడు. మహావీరుడు పావపురి వద్ద నిర్వాణం చెందాడు. కుశినగర / కుశినారా రాజు సస్తిపాల్ మాల్ ప్రాంగణంలో బుద్ధుడు మరణించాడని నమ్ముతారు. కుషినగర ఇప్పుడు బౌద్ధ తీర్థయాత్రకు కేంద్రంగా ఉంది. దీనిని ఉత్తర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తోంది.

మనుస్మృతి, లిచ్ఛవుల లాగానే మల్లులను కూడా వ్రత్య క్షత్రియులు అని వర్ణించింది. వాటిని మహాప్పరినిబ్బన సుత్తాంతంలో వాశిష్ఠులు (వాసిత్తులు) అంటారు. మల్లులు మొదట రాచరిక ప్రభుత్వం ఉండేది. కాని తరువాత వారు సంఘా (రిపబ్లిక్) లలో ఒకదానికి మారారు. ఈ సంఘాల సభ్యులు తమను తాము రాజా అని పిలుచుకునేవారు. మల్లులు ఆత్మరక్షణ కోసం లిచ్ఛవులతో ఒక కూటమిని ఏర్పరచుకున్నట్లుగా కనిపిస్తుంది. కాని బుద్ధుడు మరణించిన కొద్దికాలానికే వారు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. వారి రాజ్యం మగధ సామ్రాజ్యంలో కలిసిపోయింది.

[permanent dead link]
మల్లులు తమ నగరం కుశినగరను రక్షించుకుంటున్న చిత్రం, సాంచి. మల్ల ఒక పురాతన భారతీయ రిపబ్లిక్ (గణ సంఘ) అంగూత్తర నికాయలో ప్రస్తావించబడింది.[53]

మత్స్య దేశం

[మార్చు]

మత్స్య దేశం కురు రాజ్యానికి దక్షిణాన, యమునకు పశ్చిమాన ఉంటుంది. పాంచాలకు మత్స్య రాజ్యనికీ మధ్య యమునానది ఉంది. సుమారుగా రాజస్థాన్ లోని పూర్వ జైపూర్ రాష్ట్రం ఉన్న ప్రాంతం, భరత్‌పూర్ లోని కొన్ని భాగాలతో, అల్వార్ మొత్తమంత కలిపిన ప్రాంతమే ఈ రాజ్యం. మత్స్య రాజధాని విరాటనగర (ఆధునిక బైరత్) వద్ద ఉంది. ఈ నగర వ్యవస్థాపక రాజు విరాటుడి పేరే దీనికి పెట్టారు. పాళీ సాహిత్యంలో, మత్స్యులు సాధారణంగా సూరసేనులతో సంబంధం కలిగి ఉంటారు. పశ్చిమ మత్స్య చంబల్ నదికి ఉత్తర ఒడ్డున ఉన్న కొండ ప్రాంతం. మత్స్య రాజ్యపు శాఖ ఒకటి తరువాతి రోజులలో విశాఖపట్నం ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. బుద్ధుని కాలంలో మత్స్యులకు తమకంటూ రాజకీయ ప్రాముఖ్యత లేదు. సుజాత రాజు ఛేది, మత్స్యలు రెండింటినీ పరిపాలించాడు. తద్వారా మత్స్య ఒకప్పుడు ఛేది రాజ్యంలో భాగమని తెలుస్తోంది.

పాంచాల

[మార్చు]
అహిచ్ఛత్ర[permanent dead link] పాంచాలుల నాణెం (క్రీ.పూ. 75-50). ఇంద్రుడు పీఠంపై ఎదురుగా కూర్చుని, విభజించబడిన వస్తువును పట్టుకున్నాడు. బ్రహ్మి, పంచల చిహ్నాలలో ఇద్రమిత్ర.

పాంచాలులు కురు రాజ్యానికి తూర్పున, పర్వతాలకూ గంగా నదికీ మధ్య దేశాన్ని పాలించారు. సుమారు ఆధునిక బుదౌన్, ఫరూఖాబాద్, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర ప్రదేశ్ జిల్లాల ప్రాంతమే పంచాల రాజ్యం. దేశాన్ని ఉత్తరా-పాంచాల, దక్షిణ-పాంచాలగా విభజించారు. ఉత్తర పాంచాల రాజధాని అధిచ్ఛత్ర లేదా ఛత్రావతి (బరేలీ జిల్లాలో ఆధునిక రామ్‌నగర్), దక్షిణ పాంచాల రాజధాని ఫరూఖాబాద్ జిల్లాలోని కాంపిల్య లేదా కాంపిల్ వద్ద ఉంది. ప్రసిద్ధ నగరం కన్యాకుబ్జ లేదా కనౌజ్ పాంచాల రాజ్యంలో ఉంది. రాచరిక వంశీకులైన పాంచాలులు క్రీస్తుపూర్వం 6, 5 శతాబ్దాలలో గణతంత్రానికి మారినట్లు తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, కౌటిల్యుడి అర్ధశాస్త్రం కూడా రాజశబ్దోప జీవిన్ (కింగ్ కాన్సుల్) రాజ్యాంగాన్ని అనుసరించి పాంచాలను ధ్రువీకరిస్తుంది. 

శూరసేన

[మార్చు]
శూరసేన[permanent dead link] మహాజనపదానికి (క్రీ.పూ. 5 వ శతాబ్దం) చెందిన వెండి నాణెం.

శూరసేన దేశం మత్స్యదేశానికి తూర్పున, యమునా నదికి పశ్చిమాన ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని బ్రిజ్ ప్రాంతానికి,మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతానికీ కలిపి సుమారుగా సరిపోతుంది. దీనికి రాజధాని మధుర లేదా మథుర వద్ద ఉంది. బుద్ధుని ముఖ్య శిష్యులలో శూరసేన రాజైన అవంతీపుత్ర మొదటివాడు. అతని వల్లనే మధుర రాజ్యంలో బౌద్ధమతం పుంజుకుంది. మధుర / శూరసేన లకు చెందిన అంధకులు, వృృష్ణులను పాణిని యొక్క అష్టాధ్యాయిలో సూచించాడు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో, వృష్ణులను సంఘ లేదా గణతంత్రంగా వర్ణించాడు. వృృష్ణులు, అంధకులు, యాదవులకు చెందిన ఇతర అనుబంధ తెగలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాయి, వాసుదేవ (కృష్ణ) ను సంఘ-ముఖ్యుడిగా వర్ణించారు. శూరసేనకు రాజధాని మథుర, మెగస్థనీస్ కృష్ణుని ఆరాధనకు కేంద్రంగా ఉండేది. మగధ సామ్రాజ్యం స్వాధీనం చేసుకోవడంతో శూరసేన రాజ్యం స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది.

వజ్జి

[మార్చు]
[permanent dead link]లిచ్ఛవులు వైశాలి వద్ద నిర్మించిన ఆనంద స్థూపం. వైశాలి వజ్జి రాజధాని. ప్రపంచంలోని మొట్టమొదటి గణతంత్రాల్లో ఒకటి

వజ్జీ లేదా వృజ్జి మహాజనపదాల్లో ఒకటి. పొరుగున ఉన్న లిచ్ఛవుల వటి ఇతర జాతులతో కలిసి సమాఖ్యగా ఏర్పడింది.వారు పాలించిన ప్రాంతం ఉత్తర బీహార్‌లోని మిథిల ప్రాంతం. వారి రాజధాని వైశాలి నగరం.[54]

బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయ, జైన గ్రంథం భగవతి సూత్ర (సాయా XV ఉద్దేశ I) రెండింటి లోనూ చూపిన షోడశ మహాజనపదాల్లో వజ్జి ఉంది.[55] ఈ మహాజనపద పేరు దాని పాలక వంశాలలో ఒకటైన వృజ్‌ల నుండి వచ్చింది. వజ్జీ రాజ్యం గణతంత్రం అని చెప్పబడింది. ఈ వంశాన్ని పాణిని, చాణక్య, జువాన్జాంగ్‌లు ప్రస్తావించారు.[56]

వత్స లేదా వంశ

[మార్చు]

వత్స లేదా వంసను కురు ల్లోనే ఒక శాఖగా భావిస్తారు. వత్స దేశం ఉత్తర ప్రదేశ్‌లోని ఆధునిక అలహాబాద్ భూభాగమే. కౌశాంబి దీని రాజధాని. (అలహాబాద్ నుండి 38 మైళ్ళ దూరంలో ఉన్న కోశాం గ్రామం అని గుర్తించారు).[57] ఇక్కడ రాచరిక ప్రభుత్వ వ్యవస్థ ఉండేది. కౌశాంబి చాలా సంపన్నమైన నగరం. ఇక్కడ పెద్ద సంఖ్యలో సంపన్న వ్యాపారులు నివసించేవారు. ఇది వాయవ్య, దక్షిణ ప్రాంతాల నుండి వచ్చే వస్తువులు, ప్రయాణీకులకు అతి ముఖ్యమైన స్థానం. క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దంలో ఉదయనుడు వత్సకు పాలకుడు. అతను చాలా శక్తివంతమైనవాడు, యోధుడు. వేటను ఇష్టపడ్డాడు. ప్రారంభంలో ఉదయనుడు బౌద్ధమతాన్ని వ్యతిరేకించాడు. కాని తరువాత బుద్ధుని అనుచరుడు అయ్యాడు. బౌద్ధమతాన్ని రాజ్య అధికారిక మతంగా మార్చాడు. ఉదయనుడి తల్లి, రాణి మృగవతి, భారత చరిత్రలో తొలి మహిళా పాలకులలో ఒకరు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261.
  2. 16 Mahajanapadas - Sixteen Mahajanapadas, 16 Maha Janapadas India, Maha Janapada Ancient India. Iloveindia.com. Retrieved on 2013-07-12.
  3. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Delhi: Pearson Education. pp. 260–4. ISBN 978-81-317-1120-0.
  4. J.M. Kenoyer (2006), "Cultures and Societies of the Indus Tradition. In Historical Roots" in the Making of ‘the Aryan’, R. Thapar (ed.), pp. 21–49. New Delhi, National Book Trust.
  5. India as Known to Panini: A Study of the Cultural Material in the Ashṭādhyāyī, 1963, p 427
  6. Vasudeva Sharana Agrawala - India; India in the Time of Patañjali, 1968, p 68 Dr B. N. Puri - India;
  7. Socio-economic and Political History of Eastern India, 1977, p 9, Y. K Mishra - Bihar (India)
  8. Tribes of Ancient India, 1977, p 18 Mamata Choudhury - Ethnology
  9. Tribal Coins of Ancient India, 2007, p xxiv Devendra Handa - Coins, Indic - 2007
  10. The Journal of the Numismatic Society of India, 1972, p 221 Numismatic Society of India - Numismatics
  11. A History of Pāli Literature, 2000 Edition, p 648 B. C. Law
  12. Some Ksatriya Tribes of Ancient India, 1924, pp 230-253, Dr B. C. Law.
  13. Anguttara Nikaya: Vol I, p 213, Vol IV, pp 252, 256, 260 etc.
  14. Digha Nikaya, Vol II, p 200.
  15. Chulla-Niddesa (P.T.S.), p 37.
  16. Lord Mahāvīra and his times, 1974, p 197, Dr Kailash Chand Jain; The History and Culture of the Indian People, 1968, p lxv, Dr Ramesh Chandra Majumdar, Bharatiya Vidya Bhavan, Bhāratīya Itihāsa Samiti; Problems of Ancient India, 2000, p 7, K. D. Sethna.
  17. Political History of Ancient India, 1996, p. 86; History & Culture of Indian People, Age of Imperial Unity, pp. 15–16
  18. Digha Nikaya
  19. Tiwari, Anshuman; Sengupta, Anindya (2018-08-10). Laxminama: Monks, Merchants, Money and Mantra (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. p. 307. ISBN 9789387146808.
  20. Sen, Sailendra Nath (1999). Ancient Indian History and Civilization (in ఇంగ్లీష్). New Age International. p. 109. ISBN 9788122411980.
  21. Dr Bhandarkaar
  22. 22.0 22.1 22.2 22.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  23. Jataka No 406.
  24. Revue des etudes grecques 1973, p. 131, Ch-Em Ruelle, Association pour l'encouragement des etudes grecques en France.
  25. Early Indian Economic History, 1973, pp. 237, 324, Rajaram Narayan Saletore.
  26. Myths of the Dog-man, 199, p. 119, David Gordon White; Journal of the Oriental Institute, 1919, p 200; Journal of Indian Museums, 1973, p 2, Museums Association of India; The Pāradas: A Study in Their Coinage and History, 1972, p 52, Dr B. N. Mukherjee - Pāradas; Journal of the Department of Sanskrit, 1989, p 50, Rabindra Bharati University, Dept. of Sanskrit- Sanskrit literature; The Journal of Academy of Indian Numismatics & Sigillography, 1988, p 58, Academy of Indian Numismatics and Sigillography - Numismatics; Cf: Rivers of Life: Or Sources and Streams of the Faiths of Man in All Lands, 2002, p. 114, J. G. R. Forlong.
  27. Journal of the Oriental Institute, 1919, p 265, Oriental Institute (Vadodara, India) - Oriental studies; For Kuru-Kamboja connections, see Dr Chandra Chakraberty's views in: Literary history of ancient India in relation to its racial and linguistic affiliations, pp. 14,37, Vedas; The Racial History of India, 1944, p. 153, Chandra Chakraberty - Ethnology; Paradise of Gods, 1966, p 330, Qamarud Din Ahmed - Pakistan.
  28. Ancient India, History of India for 1000 years, four Volumes, Vol I, 1938, pp. 38, 98 by Dr T. L. Shah.
  29. James Fergusson observes: "In a wider sense, name Gandhara implied all the countries west of Indus as far as Candhahar" (The Tree and Serpent Worship, 2004, p. 47, James Fergusson).
  30. Encyclopedia Americana, 1994, p 277, Encyclopedias and Dictionaries.
  31. Ptolemy's Geography mentions Tambyzoi located in eastern Bactria (Ancient India as Described by Ptolemy: Being a Translation of the Chapters ... 1885, p. 268, John Watson McCrindle - Geography, Ancient; Barrington Atlas of the Greek and Roman World, History - 2000, p. 99, (editors) Richard J. A. Talbert) and Ambautai people located to south of Hindukush Mountains (Geography 6.18.3; See map in McCrindle, p. 8). Dr S. Levi has identified Tambyzoi with Kamboja (Indian Antiquary, 1923, p. 54; Pre Aryan and Pre Dravidian in India, 1993, p. 122, Dr Sylvain Lévi, Dr Jean Przyluski, Jules Bloch, Asian Educational Services) while land of Ambautai has also been identified by Dr Michael Witzel (Harvard University) with Sanskrit Kamboja Electronic Journal of Vedic Studies, Vol. 5, 1999, issue 1 (September), Dr. M. Witzel; Indo-Aryan Controversy: Evidence and Inference in Indian History, 2005, p 257, Laurie L. Patton, Edwin Bryant; The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity, 1995, p. 326, George Erdosy.
  32. MBH VII.4.5; II.27.23.
  33. See: Problems of Ancient India, 2000, pp. 5-6; cf: Geographical Data in the Early Puranas, p. 168.
  34. MBH II.27.27.
  35. Vedic Index I, p. 138, Macdonnel, Dr Keith.
  36. Ethnology of Ancient Bhārata, 1970, p. 107, Dr Ram Chandra Jain.
  37. The Journal of Asian Studies; 1956, p. 384, Association for Asian Studies, Far Eastern Association (U.S.).
  38. Balocistān: siyāsī kashmakash, muz̤mirāt va rujḥānāt; 1989, p. 2, Munīr Aḥmad Marrī.
  39. India as Known to Panini: A Study of the Cultural Material in the Ashṭādhyāyī; 1953, p. 49, Dr Vasudeva Sharana Agrawala.
  40. Afghanistan, p. 58, W. K. Fraser, M. C. Gillet.
  41. Afghanistan, its People, its Society, its Culture, Donal N. Wilber, 1962, pp. 80, 311 etc.
  42. Iran, 1956, p. 53, Herbert Harold Vreeland, Clifford R. Barnett.
  43. Geogrammatical Dictionary of Sanskrit (Vedic): 700 Complete Revisions of the Best Books..., 1953, p. 49, Dr Peggy Melcher, Dr A. A. McDonnel, Dr Surya Kanta, Dr Jacob Wackernagel, Dr V. S. Agarwala.
  44. Geographical and Economic Studies in the Mahābhārata: Upāyana Parva, 1945, p. 33, Dr Moti Chandra - India.
  45. A Grammatical Dictionary of Sanskrit (Vedic): 700 Complete Reviews of the ..., 1953, p. 49, Dr Vasudeva Sharana Agrawala, Surya Kanta, Jacob Wackernagel, Arthur Anthony Macdonell, Peggy Melcher - India.
  46. MBH 7/91/39.
  47. Arthashastra 11/1/4.
  48. Ashtadhyayi IV.1.168–175.
  49. Hindu Polity: A Constitutional History of India in Hindu Times, Parts I and II., 1955, p. 52, Dr Kashi Prasad Jayaswal - Constitutional history; Prācīna Kamboja, jana aura janapada =: Ancient Kamboja, people and country, 1981, Dr Jiyālāla Kāmboja - Kamboja (Pakistan).
  50. Marshall p.59
  51. II. p 481
  52. Kalpa Sutra; Nirayavali Sutra
  53. Asiatic Mythology by J. Hackin p.83ff
  54. Olivelle, Patrick (13 July 2006). "Between the Empires: Society in India 300 BCE to 400 CE". Oxford University Press.
  55. Raychaudhuri Hemchandra (1972), Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp. 85–6
  56. Raychaudhuri Hemchandra (1972), Political History of Ancient India, Calcutta: University of Calcutta, p.107
  57. Rohan L. Jayetilleke (2007-12-05). "The Ghositarama of Kaushambi". Daily News. Archived from the original on 4 June 2011. Retrieved 2008-10-29.