Jump to content

ముత్తయ్య మురళీధరన్

వికీపీడియా నుండి
Deshabandu
ముత్తయ్య మురళీధరన్
2013 ఫిబ్రవరిలో సియట్ క్రికెట్ రేటింగ్స్
పురస్కారాల సందర్భంలో మురళి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముత్తయ్య మురళీధరన్
పుట్టిన తేదీ (1972-04-17) 1972 ఏప్రిల్ 17 (వయసు 52)
క్యాండీ, శ్రీలంక
మారుపేరుముత్తయ్య
ఎత్తు5 అ. 7 అం. (1.70 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 54)1992 ఆగస్టు 28 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2010 జూలై 18 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 70)1993 ఆగస్టు 12 - ఇండియా తో
చివరి వన్‌డే2011 ఏప్రిల్ 2 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.8
తొలి T20I (క్యాప్ 13)2006 డిసెంబరు 22 - న్యూజీలాండ్ తో
చివరి T20I2010 అక్టోబరు 31 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92–2009/10Tamil Union
1999, 2001, 2005, 2007Lancashire
2003Kent
2008–2010Chennai Super Kings
2011Kochi Tuskers Kerala
2011–2012Gloucestershire
2011/12Wellington Firebirds
2011/12Chittagong Kings
2012–2014Royal Challengers Bangalore
2012/13–2013/14Melbourne Renegades
2013Jamaica Tallawahs
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 133[1] 350[2] 232 453
చేసిన పరుగులు 1,256 674 2,192 945
బ్యాటింగు సగటు 11.67 6.80 11.35 7.32
100లు/50లు 0/1 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 67 33* 67 33*
వేసిన బంతులు 44,039 18,811 66,933 23,734
వికెట్లు 800 534 1,374 682
బౌలింగు సగటు 22.72 23.08 19.64 22.39
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 67 10 119 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 22 0 34 0
అత్యుత్తమ బౌలింగు 9/51 7/30 9/51 7/30
క్యాచ్‌లు/స్టంపింగులు 72/– 130/– 123/– 159/–
మూలం: ESPNcricinfo, 2014 జనవరి 8

1972, ఏప్రిల్ 17న జన్మించిన ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్. 2007, డిసెంబర్ 4న టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండుతో కాండీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కాలింగ్‌వుడ్ను తన స్పిన్ బౌలింగ్‌తో ఔట్ చేసి తన టెస్ట్ జీవితంలో 709వ వికెట్టు సాధించి ఇంతకు క్రితం ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ సృష్టించిన రికార్డును అధిగమించాడు. షేన్‌వార్న్ 145 టెస్టులు ఆడి నెలకొల్పిన రికార్డును మరళీధరన్ కేవలం 116వ టెస్టులోనే అధిగమించాడు. 2004లోనే మరళీధరన్ అత్యధిక టెస్ట్ వికెట్ల రికార్డును సృష్టించిననూ ఆ వెంటనే షేన్‌వార్న్ అధిగమించాడు. చాలా కాలంపాటు ఈ రికార్డు వీరిద్దరి మధ్య చేతులు మారింది. షేర్‌వార్న్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఇక మరళీధరన్‌కు తిరుగులేకపోయింది. వన్డే క్రికెట్‌లో కూడా అత్యధిక వికెట్ల రేసులో మరళీధరన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2002లో మరళీధరన్ గణాంకపరంగా క్రికెట్ బౌలర్లలో సుప్రసిద్ధుడిగా విజ్డెన్ క్రికెటర్స్ యొక్క అల్మానాక్ ద్వారా గుర్తింపు పొందినాడు [3]. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందిననూ అతని క్రీడాజీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు. బౌలింగ్ శైలిపై పలు మార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు అతను జింబాబ్వే, బంగ్లాదేశ్లపై మాత్రమే ఎక్కువ వికెట్లు సాధించాడని, ఆస్ట్రేలియా, భారత్‌లపై రికార్డు అంతంత మాత్రమేనని విమర్శకుల వాదన. ఏమైననూ క్రీడాప్రపంచం దృష్టిలో అతను గొప్ప బౌలరే.

క్రీడా జీవితం

[మార్చు]

1992లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన మురళీధరన్ టెస్టులు, వన్డే క్రికెట్ లలో కల్పి 1000 వికెట్లకు పైగా సాధించి ఈ ఘనత పొందిన తొలి బౌలర్ గా అవతరించాడు. 200 కి పైగా వికెటను సాధించిన బౌలర్ల గణాంకాలు చూస్తే ప్రతి టెస్ట్ మ్యాచ్ కు అత్యధిక సరాసరి వికెట్లు (6.2) తీసుకున్న బౌలర్‌గా మురళీధరన్ ప్రథమ స్థానంలో నిలుస్తారు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెటులు సాధించిన బౌలర్‌గా రికార్డు స్థాపించడం మురళీధరన్ కు ఇది తొలిసారి కాదు. ఇంతకు పూర్వమే 2004 మేలో 519 టెస్ట్ వికెట్లు సాధించి వెస్ట్‌ఇండీస్ బౌలర్ కోర్ట్నీవాల్ష్ సృష్టించిన రికార్డును అధికమించాడు. 2004 చివరి నాటికి షేర్‌వార్న్ీధికమించే వరకు ఇతనిదే రికార్డు[4]. ఇన్నాళ్ళు వార్న్ రికార్డును అధికమించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్పిన్ మాంత్రికుడు పట్టువదలేడు. చివరికి వార్న్ రిటైర్ కావడంతో మరళీధరన్ కు అవకాశం లభించింది. అయితే తన రికార్డును మరలి అధికమిస్తాడని వార్న్ ఎప్పుడొ జోస్యం చెప్పాడు. తను రిటైర్ కావడాన్కి ముందే అంతర్జాతీయ క్రికెట్ లో మరళి 1000 వికెట్లు సాధిస్తాడని కూడా వార్న్ జోస్యం చెప్పాడు.[5] ఈ విషయంలో మాజీ ప్రపంచ రికార్డు స్థాపకుడు కోర్ట్నీవాల్ష్ కూడా మరళీధరన్ వికెట్ల ఆకలితో ఉన్నాడని త్వరలోనే ఈ రికార్డుకు చేరువ అవుతాడని చెప్పినాడు.[6] మురళీధరన్ స్వయంగా ఈ మైలురాయిని చేరుకోవడం సుసాధ్యమేనని ఊహించాడు.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భారతీయ సంతతికి చెందిన, శ్రీలంక తమిళుడైన మురళీధరన్ 2005 మార్చి 21 న తమిళ అమ్మాయి మదిమలార్ ను వివాహం చేసుకున్నాడు [8]. 2006 జనవరిలో మొదటి సంతానం నరేన్ జన్మించాడు [9]. క్రికెట్ అంటే ఏమిటో తెలియని మదిమలర్ మురళీధరన్ ను తొలి చూపులోనే క్లీన్‌బౌల్డ్ చేసింది.[10]. ఎంబిఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన మదిమలార్ కు ఈ సంబంధం కుదిర్చింది తమిళ నటుడు చంద్రశేఖర్.

టెస్ట్ క్రికెట్ లో మైలురాళ్ళు

[మార్చు]

ప్రపంచ రికార్డులు

[మార్చు]
  • టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు (2007 డిసెంబర్ 3 నాటికి 710 వికెట్లు) [11]
  • అంతర్జాతీయ క్రికెట్ లో (టెస్టులు, వన్డేలు కల్పి) అత్యధికవికెట్లు (2007 డిసెంబర్ 3 నాటికి 1165 వికెట్లు) [11]
  • ఒకే టెస్టు ఇన్నింగ్సులో 5 వికెట్లను అత్యధిక సార్లు పడగొట్టడం (61 పర్యాయాలు) [12]
  • ఒకే టెస్టులో 10 వికెట్లను అత్యధిక సార్లు తీసుకోవడం (20 సార్లు) [13]
  • తక్కువ టెస్టులలో (అత్యంత వేగంగా) 350 వికెట్లు, [14] 400, [15] 450, [16] 500, [17] 550, [18] 600, [19] 650[20] and 700[21] .
  • వరుసగా 4 టెస్టులలో 10 వికెట చొప్పున సాధించిన ఏకైక బౌలర్ (ఈ ఘనతను 2 సార్లు సాధించాడు) [22]
  • టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపై 50 కి పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ [23]
  • టెస్ట్ ఇన్నింగ్స్ లో 9 వికెట్లను 2 సార్లు సాధించిన రెండో బౌలర్ (మొదటి బౌలర్ జిమ్‌లేకర్)
  • అత్యధిక దేశాలపై ఇన్నింగ్సులో 7 వికెట్లను సాధించడం (5 దేశాలపై) [24]
  • బౌల్డ్ ద్వారా అత్యధిక వికెటను సాధించడం (153 వికెట్లు, [25] స్టంప్డ్ (37, [26], క్యాచ్ & బౌల్డ్ (30 సార్లు).[27]
  • అత్యంత సఫలమైన బౌలర్/ఫీల్డర్ (అతని బౌలింగ్ లో మహెలా జయవర్థనే 62 సార్లు క్యాచ్ పట్టాడు) [28]
  • అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు (11 సార్లు) [29]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Including 1 Test for an ICC World XI
  2. Including 4 ODIs for the Asian XI and 3 for an ICC World XI.
  3. BBC Sport, Murali 'best bowler ever'
  4. http://www.dawn.com/2004/10/16/spt6.htm
  5. http://news.bbc.co.uk/sport1/hi/cricket/3626081.stm
  6. http://ia.rediff.com/cricket/2006/nov/10walsh1.htm
  7. http://news.bbc.co.uk/sport2/hi/cricket/other_international/sri_lanka/6209055.stm
  8. The Tribune, Murali to tie knot with Chennai girl
  9. Lanka NewspapersWorld Cup to be Murali`s swansong?
  10. ఈనాడు దినపత్రిక, వసుంధర లో ఎ.కిశోర్ బాబు వ్రాసిన వ్యాసం తేది డిసెంబర్ 4, 2007
  11. 11.0 11.1 http://stats.cricinfo.com/ci/content/records/93276.html ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Cricinfo Profile" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  12. Cricinfo, Tests - Most 5 Wickets in an Innings
  13. Cricinfo, Tests - Most 10 Wickets in a Match
  14. Cricinfo, Tests - Fastest to 350 Career Wickets
  15. Cricinfo, Tests - Fastest to 400 Career Wickets
  16. Cricinfo, Tests - Fastest to 450 Career Wickets
  17. Cricinfo, Tests - Fastest to 500 Career Wickets
  18. Cricinfo, Tests - Fastest to 550 Career Wickets
  19. Cricinfo, Tests - Fastest to 600 Career Wickets
  20. Cricinfo, Tests - Fastest to 650 Career Wickets
  21. Cricinfo, Tests - Fastest to 700 Career Wickets
  22. Cricinfo, Tests - 10 Wickets in Most Consecutive Matches Archived 2007-06-22 at the Wayback Machine
  23. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-12-04.
  24. Cricinfo, Tests - 7 Wickets in an Innings against Most Countries Archived 2011-06-22 at the Wayback Machine
  25. Cricinfo, Tests - Most Wickets Taken Bowled Archived 2007-01-29 at the Wayback Machine
  26. Cricinfo, Tests - Most Wickets Taken Stumped Archived 2007-01-29 at the Wayback Machine
  27. Cricinfo, Tests - Most Wickets Taken Caught and Bowled Archived 2007-01-29 at the Wayback Machine
  28. Cricinfo, Tests - Most Wickets by Same Fielder/Bowler Combination Archived 2007-01-24 at the Wayback Machine
  29. [1]

బయటి లింకులు

[మార్చు]