మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ
Appearance
మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ | |
---|---|
స్థాపన తేదీ | 2002 |
ప్రధాన కార్యాలయం | షిల్లాంగ్ |
శాసన సభలో స్థానాలు | 0 / 60
|
మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ అనేది మేఘాలయ రాష్ట్రంలో 2002లో ఏర్పడిన రాజకీయ పార్టీ.[1] యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ నుండి విడిపోయి ఈ పార్టీ ఏర్పడింది.
2003 మేఘాలయ శాసనసభ ఎన్నికల తరువాత, పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి డిడిలపాంగ్ ఆధ్వర్యంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలో చేరింది.[2] మొదటి క్యాబినెట్‌లో పార్టీ మూడు మంత్రి స్థానాలను పొందింది, అయితే, 2004లో 91వ రాజ్యాంగ సవరణ అమలు తర్వాత, మంత్రివర్గం 39 నుండి 12కి తగ్గించబడింది, దాంతో ఈ పార్టీ మంత్రివర్గంలోని అన్ని స్థానాలను కోల్పోయింది.[3]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]2008 ఎన్నికలలో పార్టీ తన నాలుగు స్థానాలను కోల్పోయింది, 2013 ఎన్నికలలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. 2018 ఎన్నికలలో ఎవరినీ అభ్యర్థులను నిలబెట్టలేదు.[4][5][6]
సీట్లు | ఓట్లు | |||||
---|---|---|---|---|---|---|
పోటీ చేసినవి | గెలిచినవి | +/- | మొత్తం | % | +/- | |
2003 | 18 | 4 | 47,852 | 5.31 | ||
2008 | 18 | 0 | 4 | 30,691 | 2.78 | 2.53 |
2013 | 2 | 0 | 6,098 | 0.46 | 2.32 |
మూలాలు
[మార్చు]- ↑ Roy, Ramashray; Wallace, Paul (2007). India's 2004 Elections: Grass-Roots and National Perspectives (in ఇంగ్లీష్). SAGE Publications India. p. 245. ISBN 978-81-321-0110-9.
- ↑ "Congress asked to form Meghalaya govt". www.rediff.com. 4 March 2003. Retrieved 2020-03-04.
- ↑ "Meghalaya ministry downsized". Outlook India. 6 July 2004. Retrieved 2020-03-04.
- ↑ 4.0 4.1 "Meghalaya 2008". Electoral Commission of India. Retrieved 4 March 2020.
- ↑ 5.0 5.1 "Meghalaya 2013". Electoral Commission of India. Retrieved 4 March 2020.
- ↑ "Meghalaya General Legislative Election 2018". Electoral Commission of India. Retrieved 4 March 2020.
- ↑ "Meghalaya 2003". Electoral Commission of India. Retrieved 4 March 2020.