మొరాదాబాద్ జిల్లా
మొరాదాబాద్ జిల్లా
मुरादाबाद ज़िला مراد آباد ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మొరాదాబాద్ |
ముఖ్య పట్టణం | మొరాదాబాద్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మొరాదాబాద్, సంభల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,493 కి.మీ2 (1,349 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 27,61,620 |
• జనసాంద్రత | 790/కి.మీ2 (2,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 45.74%[1] |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మొరాదాబాద్ జిల్లా (హిందీ:मुरादाबाद ज़िला) (ఉర్దు:مراد آباد ضلع) ఒకటి. మొరాదాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మొరాదాబాద్ జిల్లా మొరాదాబాద్ డివిజన్లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3493 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,761,620.
2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మొరాదాబాద్ జిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో అలహాబాద్ జిల్లా ఉంది. .[2] జిల్లా 28°21´ నుండి 28°16´ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°4´ నుండి 79°డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. నగరంలో తయారు చేయబడుతున్న ఇత్తడి కళాఖండాలను అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. అందువలన మొరాదాబాద్ ఇత్తడి నగరం, పీతళ్ నగరి అనఇలువబడుతుంది. జిల్లాలో వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారు.
భౌగోళికం
[మార్చు]మొరాదాబాద్ జిల్లా గంగానదికి తూర్పు తీరంలో రాంపూర్ జిల్లాకు పశ్చిమం ఉంది. జిల్లావైశాల్యం 2285 చ.కి.మీ. ఇది గంగా మైదానంలో ఉంది. రామగంగా, సాత్ నదులు జిల్లాను మూడు భాగాలుగా విభజించాయి. తూర్పు భూభాగం పర్వతాలతో పశ్చిమ భూభాగం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ హిమాలయాల నుండి ప్రవహిస్తున్న పలు జలప్రవాహాలు ఉన్నాయి. మద్య భూభాగం రామగంగా, సాత్ నదీలోయల వరకు విస్తరించి ఉంది. పశ్చిమ భూభాగం కొన్ని కి.మీ పొడవున గంగానది వైపు ఏటవాలుగా దిగువకు సాగుపోతుంది.
ప్రముఖులు
[మార్చు]- జిగర్ మొరాదాబాది
- పియూష్ చావ్లా
- నవాబ్ మజ్జు ఖాన్
- మదన్ మోహన్ వ్యాస్
- సుఫీ అంబ ప్రసాద్
- ఖమర్ మొరాదాబాది
- మన్సూర్ ఉస్మానీ
- రాబర్ట్ వాద్రా
- జావెద్ రషీద్ అమీర్
- పోంటీల చాద
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,773,138,[2] |
ఇది దాదాపు. | సింగపూర్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | అల్బామా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 26 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1224 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.25%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 903:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 58.67%.[2][5] |
జాతియ సరాసరి (72%) కంటే. |
విభాగాలు
[మార్చు]జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి: మొరాదాబాద్ ఉపవిభాగం, సంభల్ ఉపవిభాగం
- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి:
- మొరాదాబాద్ ఉపవిభాగంలో 3 తాలూకాలు ఉన్నాయి: బిలరి తాలూకా, కాంత్ తాలూకా, ఠకుర్ద్వారా తాలూకా.[6]
- సంభల్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి: సంభల్, చందౌసి తాలూకా[7]
- జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి: కుందకరి, చాజ్లెట్, భగత్పూర్, దిలరి, ముందపాండే.
- జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు: కంథ్ ( మోరాడాబాద్ ), ఠకుర్ద్వారా, మోరాదాబాద్ రూరల్, మోరాడాబాద్ నగర్, కుందర్కి, బిలరి, చందౌసి
- మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం: 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: కాంత్, ఠాకూర్ద్వారా, మొరాదాబాద్ గ్రామీణ, మొరాదాబాద్ నగరప్రాంతం.
- సంభల్ తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి: బహ్జోయీ, పంవస, అస్మొలి.
పట్టణాలు
[మార్చు]మొరాదాబాద్ నగరపాలితం చేయబడింది.
- జిల్లాలో 4 పురపాలితాలు ఉన్నాయి:- బహ్జోల్, బిలరి, చందౌసి, ఠాకూర్ద్వారా.
- జిల్లాలో 6 పురపాలితాలు ఉన్నాయి.[9]
- భోజ్ ధర్మపూర్
- కంథ్
- కుందర్కి
- నరౌలి
- రుస్తమ్నగర్ సహస్పుర్
- వయసు కలాన్
- జిల్లాలో 960 గ్రామపంచాయితీలు ఉన్నాయి.[10]
బయటి లింకులు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Singapore 4,740,737 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Alabama 4,779,736
- ↑ MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 2011-09-30 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS
- ↑ The National Panchayat Directory lists Moradabad Tehsil instead of Kanth Teshil. "Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh". Ministry of Panchayati Raj, Government of India.
- ↑ The National Panchayat Directory lists Baniyakhera instead of Chandausi Tehsil. "Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2014-09-07. Retrieved 2014-12-16.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 461–462. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-12-16.
- ↑ "Reports of National Panchayat Directory: Report on Urban Local Bodies: Uttar Pradesh: Moradabad". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2013-05-13. Retrieved 2014-12-16.
- ↑ "Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2014-09-07. Retrieved 2014-12-16.