రవీంద్ర కుమార్ పాండే
Appearance
రవీంద్ర కుమార్ పాండే | |||
పదవీ కాలం 1 సెప్టెంబర్ 1996 – 2004 | |||
ముందు | బినోద్ బిహారీ మహతో | ||
---|---|---|---|
తరువాత | టేక్ లాల్ మహ్తో | ||
నియోజకవర్గం | గిరిడిహ్ | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | టేక్ లాల్ మహ్తో | ||
తరువాత | చంద్ర ప్రకాష్ చౌదరి | ||
నియోజకవర్గం | గిరిడిహ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఘుటియాండ్, బొకారో, జార్ఖండ్ | 1959 జనవరి 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ పాండే | ||
సంతానం | 5 | ||
నివాసం | బొకారో, జార్ఖండ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రవీంద్ర కుమార్ పాండే (జననం 20 జనవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన గిరిడిహ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
ఎన్నికలలో పోటీ
[మార్చు]- రవీంద్ర కుమార్ పాండే 1996 లోక్‌సభ ఎన్నికల్లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థి సబా అహ్మద్ పై 91,663 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1998 ఎన్నికల్లో గిరిడిహ్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ సింగ్ పై 68,791 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1999లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి టెక్ లాల్ మహపై గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 2009లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి టెక్ లాల్ మహ్తోపై గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 2014లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి జగర్నాథ్ మహ్తోపై గెలిచి ఐదోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2024). "Ravindra Kumar Pandey : Bio, Political life, Family". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ The Times of India (10 March 2019). "Party gave my seat to Ajsu-P without consulting me: BJP MP". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ The Indian Express (15 March 2019). "Jharkhand: Five-time MP cries foul as BJP sets aside seat for ally" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.