Jump to content

సుడిగాడు

వికీపీడియా నుండి
సుడిగాడు
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనసి. ఎస్. అముదన్
నిర్మాతడి.సి.రెడ్డి
తారాగణంఅల్లరి నరేశ్
మోనాల్ గుజ్జర్
ఫిష్ వెంకట్
ఛాయాగ్రహణంవిజయ్ ఉలగనాధ్
కూర్పుగౌతం రాజు
సంగీతంశ్రీ వసంత్
నిర్మాణ
సంస్థ
అరుంధతి మూవీస్
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీ
ఆగస్టు 24, 2012 (2012-08-24)
దేశంభారత్
భాషతెలుగు
బాక్సాఫీసు32.01 crore (US$4.0 million)

సుడిగాడు 2012 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం. అరుండతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి రెడ్డి నిర్మించాడు. సిఎస్ అముధన్ తొలి తమిళ చిత్రం తమిజ్ పాదానికి రీమేక్ ఇది. [1] ఈ చిత్రంలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రల్లో నటించారు. [2] [3] ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేసాడు. [1] ఈ చిత్రం 2012 ఆగస్టు 24 న విడుదలైంది. [4]

కామేష్ ( అల్లరి నరేష్ )కు, అతని భార్య ( హేమా ) కూ సిక్స్ ప్యాక్ బాడీతో జన్మించిన డైనమిక్, శక్తివంతమైన శిశువుకు జన్మనిస్తారు. శిశువు జన్మించినప్పుడే, తిక్కల్ రెడ్డి ( జయ ప్రకాష్ రెడ్డి ) శిశువు గదిలోకి పరిగెత్తే తన శత్రువును వెతుక్కుంటూ విలన్ గా వస్తాడు. ఆ శత్రువు తనను రక్షించమని దేవుడిని ప్రార్థిస్తూ ఆ గదిలో దాక్కుంటాడు. ఈ శిశువు మూత్రవిసర్జన చేస్తే, అది చాలాదూరం పారి, తిక్కల్ రెడ్డి అనుచరులు జారిపడి, అతడి పెద్ద కొడుకు మరణానికి దారితీస్తుంది. అతను శిశువుకు శత్రువు అవుతాడు. రెడ్డి నుండి శిశువును కాపాడటానికి, కామేష్ బిడ్డను తన తల్లి ( కోవై సరాలా ) కి ఇచ్చి, హైదరాబాదు పంపించేస్తాడు. శిశువు శివ ( అల్లరి నరేష్ ) గా పెరుగుతాడు. తెలుగు సినిమా హీరో వంటి అజేయ శక్తులు కలిగిన శక్తివంతమైన, డైనమిక్ యువకుడౌతాడు.

శివ దూసుకొచ్చే బుల్లెట్లను గాల్లోనే ఆపగలడు, కాలాన్ని సవాలు చేయగలడు, పోసాని కృష్ణ మురళినైనా తెలివిగా మాట్లాడేలా చేయగలడు. కాలం గడుస్తూండగా శివ ప్రియ ( మోనాల్ గజ్జర్ ) ను కలుసుకుని ఆమెతో ప్రేమలో పడతాడు. తిక్కల్ రెడ్డి ముఠా సభ్యులు శివ కోసం వేటాడుతూనే ఉంటారు. అతను వారికి ఎదురు తిరిగి పోరాడాలని నిర్ణయించుకుంటాడు. అతను అంతుబట్తని డాన్ డి అనేవాడి నుండి కూడా ప్రతిఘటన ఎదుర్కొంటాడు.

అతను వారందరితో పోరాడుతాడు. అతను శివ మనోహర్ ఐపిఎస్ అనీ, అండర్కవర్ ఆపరేషన్లో ఉన్న యువ పోలీసాఫీసరనీ అని తెలుస్తుంది. అతను అన్ని విలన్లందరినీ చంపేస్తాడు. ఇక డాన్ డి విషయానికి వస్తే, అది అతని నాయనమ్మేనని తెలుస్తుంది. శివను శక్తివంతమైన హీరోగా, తనను తాను డాన్ గా మార్చడానికి ఆమె అలా చేస్తుంది. కోర్టులో ఇద్దరూ అమాయకులుగా విడుదలౌతారు. శివకు ఆంధ్రప్రదేశ్ డిజిపిగా పదోన్నతి లభిస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ట్వింకిల్ ట్వింకిల్"  రంజిత్ 4:17
2. "ఇంకీ పింకీ"  అల్లరి నరేష్, రాహుల్ సిప్లిగంజ్ 2:03
3. "ఎందుకే చెలీ"  హరిచరణ్ 4:11
4. "జగాలు మొత్తం"  రేవంత్ 1:59
5. "గజిబిజి గతుకుల రోడ్డు"  సాహితి, శ్రీకృష్ణ, రేవంత్, పృథ్వీచంద్ర 4:31
6. "జరా జరా"  అల్లరి నరేష్, గీతా మాధురి, హేమచంద్ర, హరిత 4:26
21:29

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Allari Naresh as son, father in Sudigaadu - Telugu Movie News". IndiaGlitz. 1 July 2012. Archived from the original on 6 జూలై 2012. Retrieved 25 August 2012.
  2. "News: Allari Naresh's 'Sudigadu' offers 100 films per single ticket". Telugucinema.com. Archived from the original on 25 జూన్ 2012. Retrieved 25 August 2012.
  3. "Sudigadu Telugu Movie - Allari Naresh, Bheemineni Srinivasa Rao". Sudigadumovie.blogspot.in. Retrieved 25 August 2012.
  4. "Sudigadu to release on Aug 24". 123telugu.com. 1 January 1998. Retrieved 25 August 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=సుడిగాడు&oldid=4041150" నుండి వెలికితీశారు