సోఫియా బానో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోఫియా బానో
జననం
సోఫియా బానో బేగం

(1938-10-23) 1938 అక్టోబరు 23 (వయసు 86)
వృత్తి
  • నటి
  • గాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1964 - 1976
జీవిత భాగస్వామి
హరూన్ అహ్మద్‌
(m. 1978)
పిల్లలు2
పురస్కారాలునిగార్ అవార్డు:
ఉత్తమ సహాయ నటిగాపర్డే మే రెహనే దో (1973)

సోఫియా బానో పాకిస్తాన్ కు చెంది సినిమా నటి, గాయని. 1960లు, 1970లలో లాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా సహాయక పాత్రల్లో నటించింది.[1] ఎహసాస్ (1972), ఘరానా (1973), పర్డే మే రెహనే దో (1973) వంటి ప్రముఖ సినిమాలలో నటించిన సోఫియా 1973లో ఉత్తమ సహాయ నటిగా నిగర్ అవార్డును గెలుచుకుంది.[2]

జననం

[మార్చు]

సోఫియా 1938, అక్టోబరు 23న మహారాష్ట్రలోని బొంబాయి నగరంలో జన్మించింది.

నటనారంగం

[మార్చు]

సోఫియా 1960లలో లాలీవుడ్ సినిమాలలో నటించడానికి బొంబాయి నుండి పాకిస్తాన్ వెళ్ళింది.[3] సోఫియా నటించిన మొదటి సినిమా "ఛోటీ బెహన్" 1964లో విడుదలైంది, ఇందులో ఆమె సహాయక పాత్రను పోషించింది.[4] తరువాత అకేలే నా జానా అనే సినిమాలో నటుడు ముహమ్మద్ అలీకి కథానాయికగా నటించింది, కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.[5] 1973 సోఫిమా నట జీవితంలో అత్యంత ముఖ్యమైన సంవత్సరం, "ఘరానా", షబాబ్ కిరణ్వీ తీసిన పర్డే మే రెహ్నాయ్ దో అనే రెండు హిట్ సినిమాలకు సంతకం చేసింది.[6] తరువాతి సినిమాలో మొండి పట్టుదలగల ధనవంతురాలిగా నటించింది.[7] హసన్ తారిఖ్ దర్శకత్వంలో 1976లో విడుదలైన జరూరత్ అనే సినిమాలో చివరిసారిగా నటించింది.[2] సోఫియా తన 12 సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితంలో 28 సినిమాల్లో నటించింది. పంజాబీ సినిమాలో కూడా నటించింది.[8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సోఫియా కరాచీకి చెందిన వ్యాపారవేత్త, పాకిస్తాన్ ముస్లిం లీగ్ రాజకీయవేత్త అయిన హరూన్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం తరువాత సోఫియా సినిమాల నుండి నిష్క్రమించింది.[1]

నటించినవి

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష
1964 ఛోటీ బెహన్ ఉర్దూ
1966 అకేలే నా జానా ఉర్దూ
1966 అజాది యా మౌట్ ఉర్దూ[9]
1966 హామ్ డోనో ఉర్దూ
1967 మేరే లాల్ ఉర్దూ
1968 మంజిల్ డోర్ నహేన్ ఉర్దూ
1968 పాపి ఉర్దూ
1968 ఖిలోనా ఉర్దూ
1968 తుమ్ మేరే హో ఉర్దూ
1969 నీలా పర్బత్ ఉర్దూ
1970 మా తే మా ఉర్దూ
1971 పరాయ్ ఆగ్ ఉర్దూ
1971 మొహబ్బత్ ఉర్దూ
1972 ఎహ్సాస్ ఉర్దూ
1973 సర్హాద్ కీ గౌడ్ మే ఉర్దూ
1973 ఘరానా ఉర్దూ
1973 నాదన్ ఉర్దూ
1973 పర్డే మే రెహ్నయ్ దో ఉర్దూ
1974 డూ తస్వీరీన్ ఉర్దూ[10]
1974 షరాఫత్ ఉర్దూ
1974 నౌకర్ వోహ్తీ డా పంజాబీ
1974 కిస్మత్ ఉర్దూ[11]
1975 ప్రొఫెసర్ ఉర్దూ
1976 జరూరత్ ఉర్దూ
విడుదల కాలేదు సెహ్రా ఉర్దూ
విడుదల కాలేదు హామ్ భీ పర్హయ్ హేన్ రహోన్ మే ఉర్దూ
విడుదల కాలేదు హల్చల్ ఉర్దూ

అవార్డులు, గుర్తింపు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం ఫలితం పేరు మూలాలు
1973 నిగర్ అవార్డు ఉత్తమ సహాయ నటి విజేత పర్డే మే రెహ్నయ్ దో [12] [13]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Rasheed, Yaqoob (10 November 2020). "ماضی کی خوبصورت فن کارہ "صوفیہ بانو"". Roznama Jang. Archived from the original on 19 June 2022.
  2. 2.0 2.1 "Beautiful artist of the past "Sofia Bano"". IG News. 18 April 2021. Archived from the original on 12 మార్చి 2023. Retrieved 12 మార్చి 2023.
  3. Pakistan Spotlight International, Volume 1, Issues 1-7. p. 36. {{cite book}}: |work= ignored (help)
  4. Illustrated Weekly of Pakistan. p. 36. {{cite book}}: |work= ignored (help)
  5. "فلمی و ادبی شخصیات کے سکینڈلز۔ ۔ ۔قسط نمبر 491". Daily Pakistan. 2 January 2022.
  6. The Pakistan Review. p. 45. {{cite book}}: |work= ignored (help)
  7. Illustrated Weekly of Pakistan, Volume 20, Issues 1-17. p. 32. {{cite book}}: |work= ignored (help)
  8. "Sufia Bano: Filmography". Pak Film Magazine. Retrieved 23 April 2022.
  9. Gazdar, Mushtaq (1997). Pakistan Cinema, 1947-1997. Oxford University Press. p. 255. ISBN 0-19-577817-0.
  10. Gazdar, Mushtaq (1997). Pakistan Cinema, 1947-1997. Oxford University Press. p. 278. ISBN 0-19-577817-0.
  11. The Statesman, Volume 22. p. 16. {{cite book}}: |work= ignored (help)
  12. "THE NIGAR AWARDS 1972 - 1986". Internet Wayback Machine. Archived from the original on 2008-07-25.
  13. "Pakistan's "Oscars"; The Nigar Awards". Desi Movies Reviews. Archived from the original on 2015-07-22. Retrieved 2023-03-12.

బయటి లింకులు

[మార్చు]