కవి చౌడప్ప శతకము
కం. బూతులు నీతులు చెప్పితి -
నీతులు విని మెచ్చ బుధులు, నీతి విదూరుల్
బూతుల మెచ్చందగు నని -
కౌతుక మతి కుందవరపు కవి చౌడప్పా !
కం . నీతుల కేమి ఒకించుక -
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక -
ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా !
కం. పది నీతులు పది బూతులు -
ఓదు శ్రుంగారములు కల్గు పద్యముల సభన్
చదివిన వాదే అధికుడు -
కద రప్పా ! కుందవరపు కవి చౌడప్పా !
కం. విద్దెల మే లెరుగని నరు -
డెద్దే సరి ; గది తినెది దెద్దా ? పనులం
దెద్దుకు కొంత వివెకము -
కద్దప్పా కుందవరపు కవి చౌడప్పా !
కం. ఆడిన మాతలు తప్పిన - '
గాడిద కొదు' కంచు తిట్టగా విని, మదిలో
'వీడా కొడు ' కనఏడ్చును -
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా !
కం. దేవుడు దేవుం డనగా
దేవుం డా దివి నుండి దిగి వచ్చేనా ?
ఈవి గల దొరయె దేవుడు
కావంగను కుందవరపు కవి చౌడప్పా !
కం. ఇయ్యగ ఇప్పింపం గల -
అయ్యలకే కాని మీస మందరి కేలా ?
రొయ్యకు లేదా బారెడు -
కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా !
కం. నేరుతు నని మాటాడగ -
నారిజ భవు నంతవాని వశమా ? తంజా
వూరి రఘునాధ నాయని -
గా రెరుగగ కుందవరపు కవి చౌడప్పా !
కం. పడతుకయును వంకాయయు -
అడరు సమూలంబు మధుర, మందుల లోగా
తొడ మొదలుతొడిమమొదలును -
కడుమధురముకుందవరపు కవి చౌడప్పా !
శా. ఒడ్డారంబు ఘటించె బ్రహ్మ వినరా ! ఓరోరి చన్ ముక్కులన్
బిడ్డం డంటిన పాలు కారు, అవియే ప్రేమన్ మగం డంటినన్
జిడ్డం చె మ్మగు కాళ్ళ సందిది మహాసాధ్యంబె అ బ్రహ్మకున్
దొడ్డా కుందవరంపురాయ సుకవీ ! ధూర్త ప్రకారాగ్రణీ !
కం. తన సతి ఇడగా మనుమలు -
తనయులు తలిదండ్రు లన్న దమ్ములు బంధుల్
దిన దినమును భుజియించుట -
ఘన విభవము కుందవరపు కవి చౌడప్పా !
కం. వేయారు వగల కూరలు -
కాయ లనేకములు ధాత్రి కల వందులలో
నాయకములు రా కాకర -
కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా !
కం. విను భారవి భట్టును నా -
చన సోముని మాఘ కవిని చతురత శ్రీ నా
ధు నుతింతును కవితకు తి -
క్కన తలతున్ కుందవరపు కవి చౌడప్పా !
కం. పెద్దన వలె క్రుతి చెప్పిన -
పె ద్దనవలె, అల్ప కవిని పె ద్దనవలెనా ?
ఎ ద్దనవలె, మొ ద్దనవలె -
గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా !
కం. ముందుగ చను దినములలో -
కందమునకు సోమయాజి ఘను డందురు; నే
డందరు నను ఘనుడందురు -
కందమునకు కుందవరపు కవి చౌడప్పా !
కం. పప్పే పస బాపలకును, -
ఉప్పే పస రుచుల కెల్ల, ఉవిదల కెల్లన్
కొప్పే పస, దంతములకు -
కప్పే పస కుందవరపు కవి చౌడప్పా !
కం. మీసము పస మొగ మూతికి, -
వాసము పస ఇండ్ల కెల్ల, వనితల కెల్లన్
వేసము పస, బంట్రౌతుకు -
గ్రాసము పస కుందవరపు కవి చౌడప్పా !
కం. వెన్నెల పస అగు రాత్రుల -
కెన్నులు పస సస్యములకు, ఇంతుల కెల్లన్
చన్నులు పస, అటు మీదట-
కన్నులు పస కుందవరపు కవి చౌడప్పా !
కం. మాటలు పస నియ్యోగికి -
కోటలు పస దొరల కెల్ల, ఘోటకములకున్
దాటులు పస, బెబ్బులులకు-
కాటులు పస, కుందవరపు కవి చౌడప్పా !
కం. ఇంటికి పదిలము బీగము -
వింటికి పదిలము నారి, వివరింపంగా
చంటికి పదిలము రవికెయు -
కంటికి పదిలము రెప్ప కవి చౌడప్పా !
కం. నా నీతి వినని వానిని -
భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని -
కానను రా కుందవరపు కవి చౌడప్పా !
వనరులు
[మార్చు]
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.