Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

చక్క నేఁగుచు నవ్వచఱి గడచి హరిఁదలఁచి మ్రొక్కుచును మోఁకాళ్ళ ముడుగు గడచినమీఁద! నక్కడక్కడ వెంకటాద్రీశు సంపదలు అంతంతఁ గాన రాఁగాను ||అదె|| 3

బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును పొందైననానావిధంబుల వనంబులును! నిగిడి క్రిక్కిఱిసి పండినమహావృక్షముల నీడలను నిలిచి నిలిచి! గగనంబు దాఁకి శృంగారరసభరితమై కనకమయమైన గోపురములనుఁజెలువొంది! జగతీధరునిదివ్యసంపదలుగల నగరు సరగునను గానరాఁగాను ||అదె|| 4

ప్రాకటంబైన పాపవినాశనములోన భరితమగు దురితములు పగిలి పాఱుచునుండ! ఆకాశగంగతోయములు సోఁకిన భవము లంతంత వీడిపాఱఁగను! ఈకడనుఁ గోనేట యతులు బాశుపతుల్ మును లెన్ననగ్గలమై వున్న వైష్ణవులలో నేకమై తిరువెంకటాద్రీశుఁ డాదరిని యేప్రొద్దు విహరించఁగాను ||అదె|| 5 -అన్న అధ్యా. 37 ఱేకు.

శేషాద్రి దర్శనము

శ్రీరాగం

అదివో అల్లదివో హరివాసము! పదివేల శేషుల పడగలమయము ||పల్లవి|| అదె వేంకటాచల మఖిలోన్నతము! అదివో బ్రహ్మాదుల కపురూపము!