Jump to content

mind

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, వినుట, లక్ష్యపెట్టుట.

  • you must mind what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినవలసినది.
  • he does not mind వినడు, లక్ష్యపెట్టడు.
  • I wish you would mind what I say నేను చెప్పేమాట యెందుకు వినవోయి.
  • you must not mind what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినబోకు.
  • he did not mind the punishment ఆ శిక్షను వాడు లక్ష్యపెట్టలేదు.
  • mind or you will spill the ink భద్రము, నీవు శిరా వొలకపోసేవు.
  • what is the good of telling you if you do not mind ? వినకపోతే, నీతో యెందుకు చెప్పేది.
  • mind to tell him వాడితో చెప్పను మరిచేవు సుమీ.
  • never mind చింత లేదు, పరవాలేదు.
  • never mind where యెక్కడ నైతేనేమి.
  • never mind the names ఆ పేర్లేందుకు, ఆ పేర్లు అక్కరలేదు.
  • If you wont tell me, never mind నీవు చెప్పకుంటే మానె.
  • I do not mind his going there వాడు అక్కడికిపోతే నాకు చింత లేదు.
  • do not playwhen you should mind your book నీవుపుస్తకము మీద ధ్యానము వుంచవలశి నప్పుడు ఆట్లాడక.

నామవాచకం, s, మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి,హృదయము.

  • or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు.
  • have you a mind to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా.
  • he does not know his own mind వాడు చపలుడు, చలచిత్తుడు.
  • I have half a mind to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది.
  • I have a great mind to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది.
  • have you a mind to this? యిది నీకు యిష్టమా.
  • I let him know my mind అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను.
  • I am of the same mind still నాకిప్పటికి అదే భావము.
  • you must keep this in mind నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది.
  • put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి.
  • their grief is never out of my mind వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.
  • you must bear this in mind దీన్ని నీవు మరువబోకు.
  • this put your business out of my mind యిందువల్ల నీ పనిని మరిచినాను.
  • time out of mind అనాదిగా.
  • when this comes to mind యిది జ్ఞాపకము వచ్చినప్పుడు.
  • he called to mind the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు.
  • a man who is out of his mind చలచిత్తుడు.
  • a man of sound mind స్థిరబుద్ధిగలవాడు.
  • he is of a serious turn of mind గంభీర పురుషుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mind&oldid=938102" నుండి వెలికితీశారు