Rolls Royces EV Car: రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

ప్రపంచవ్యాప్తంగా రోల్స్ రాయిస్ కార్లు అంటే ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సంపన్నులు రోల్స్ రాయిస్ తమ సంపదకు గుర్తుగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ రోల్స్ రాయిస్ తాజాగా తన ఈవీ వెర్షన్ కారును లాంచ్ చేసింది. స్పెక్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Rolls Royces EV Car: రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
Rolls Royce Ev Car Ambani
Follow us
Srinu

|

Updated on: Dec 28, 2024 | 3:54 PM

రోల్స్ రాయిస్ కంపెనీ భారతదేశంలో స్పెక్టర్‌ను లాంచ్ చేసింది. ఈ కారును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మొట్ట మొదటి కారును కొనుగోలు చేసేశారు. అంతేకాకుండా ఈ కారు వీఐపీ నంబర్ కూడా ఆకర్షణీయంగా ఉంది.  సాధారణంగా రోల్స్ రాయిస్ స్పెక్టర్ రూ. 7.5 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేశారు. ఇది మోడల్ బేస్ మోడల్. అయితే అంబానీ కొనుగోలు చేసిన వెర్షన్ మాత్రం ఆయన కోసం ప్రత్యేకంగా తయారీ చేశారని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ కారు ధర ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కారుకు అంబానీ ప్రత్యేకంగా వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంహెచ్ 0001 తీసుకున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన నంబర్ ప్లేట్లు వాహన విలువను పెంచడమే కాకుండా దాని ప్రతిష్టను కూడా పెంచుతాయి.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ మోడల్. ఈ కారులో 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఈ కారును ఓ సారి ఛార్జ్ చేస్తే 500 కంటే కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ కారుకు కేవలం 30 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ అయినప్పటికీ, రోల్స్ రాయిస్ స్పెక్టర్ పవర్ విషయంలో రాజీపడదు. మెరుగైన పనితీరు కోసం ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు అధిక-పనితీరుతో వచ్చే స్పోర్ట్స్ కార్లతో సమానంగా ఉంచుతుంది.

అల్ట్రా-లగ్జరీ వాహనాల విషయానికి వస్తే రోల్స్ రాయిస్‌తో పోల్చితే బీఎండబ్ల్యూ, బెంజ్ వంటి బ్రాండ్‌లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. అయితే ఫీచర్ల విషయానికి వస్తే రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారులో 12 మసాజ్ మోడ్‌లు ఉన్న సీట్లు ప్రత్యేకతగా నిలుస్తాయి. ముఖ్యంగా 40 అంగుళాల టీవీ స్క్రీన్‌లతో పాటు కారులోనే కాఫీ మెషీన్‌ను కూడా అమర్చారు. స్పెక్టర్ కారును కస్టమర్‌లు వాహనాన్ని ముందుగా బుక్ చేసుకోవాలి. ఈ కారు డెలివరీ చేయాలంటే ఒక ఏడాది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!