Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి

సంక్రాంతి

హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే పండగలలో అతి పెద్ద పండగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో మొదటి పండగ భోగి, భోగ భాగ్యాలను ఇవ్వమంటూ కోరుకోవడమే కాదు.. చెడుని విడిచి మంచిగా బతకమని సూచిస్తూ భోగి మంటలు వేస్తారు. రెండో రోజు సంక్రాంతిపండగను పెద్దల పండగగా, తమ ఇంటికి ధాన్యం చేరుకున్నందుకు ఆనందంతో కొత్త బియ్యంతో పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు కనుమ ఇది రైతుల పండగ.. పశువులను పూజిస్తారు. ధనుర్మాసం మొదలు నెల రోజులపాటు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటాయి. ధనుర్మాస ముగింపును గుర్తు చేస్తూ మకర సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త సంవత్సరంలో జరుపుకునే మొదటి పండగ భోగి పండగ జనవరి 13వ తేదీన, సంక్రాంతిని 14 వ తేదీన , కనుమను 15 వ తేదీన జరుపుకోనున్నారు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది.

ఇంకా చదవండి

ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ డైరెక్టర్‌దే హవా.. ఎవరు వారంటే?

ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఇప్పటి వరకు ఫెయిల్యూరే లేకుండా దూసుకుపోతున్న జక్కన్న మీద అభిమానుల కంప్లయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక్కో సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంటారని, హీరోలను ఏళ్ల తరబడి బ్లాక్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆల్మోస్ట్ రాజమౌళి రేంజ్‌ సక్సెస్‌ రేటుతో ఒక్క కంప్లయింట్ కూడా లేని దర్శకుడు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

హీరోయిన్స్ విషయంలో వెంకీ మ్యాజిక్.. అప్పడు అంజలి.. ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్!

వెంకీ గ్యారేజ్.. ఇచ్చట తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇవ్వబడును..! ఏంటిది అనుకుంటున్నారా..? చూడ్డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో. ఎప్పట్నుంచో పక్క ఇండస్ట్రీలో ఉండి బ్రేక్ కోసం చూస్తున్న తెలుగమ్మాయిలకు వెంకటేష్ బ్రేక్ ఇస్తున్నారు. పుష్కరం కింద జరిగిన సీనే మళ్లీ రిపీట్ అయిందిప్పుడు. మరి ఈ మ్యాజిక్ ఏంటో చూద్దామా..?

రికార్డ్ క్రియేట్ చేసిన సంక్రాంతి.. కలెక్షన్స్‌లో సునామీ సృష్టించిన సినిమాలివే!

ఈ సంక్రాంతి టాలీవుడ్‌కు మోర్ అండ్ మోర్ స్పెషల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సాధారణంగా ఎంత పెద్ద సీజన్‌ అయినా రిలీజ్ అయిన అన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించటం కష్టం. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రిలీజ్‌ అయిన అన్ని సినిమాలు బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసి టాలీవుడ్‌ స్క్రీన్‌కు కొత్త జోష్‌ తీసుకువచ్చాయి.

జంధ్యాలను గుర్తు చేస్తున్న అనిల్ రావిపూడి!

తెలుగు తెరపై హాస్యాన్ని పండించిన దర్శకులలో జంధ్యాల స్థానం ప్రత్యేకం. అంతకుముందు సినిమాల్లో హాస్యం ఒక భాగంగా ఉండేది. హాస్యాన్నే ప్రధాన రసంగా తీసుకుని, నాన్ స్టాప్ గా నవ్వించిన దర్శకుడిగా జంధ్యాల పేరే అందరికీ గుర్తుంటుంది. జంధ్యాల తరువాత ఈవీవీ కొంతవరకూ ఆ మార్క్ ను కొనసాగించారు. ఇక ఆ ఇద్దరూ తనకి ఎంతో ఇష్టమని చెబుతూ వస్తున్న అనిల్ రావిపూడి, తన సినిమాల్లో కామెడీ ఫ్లేవర్‌ను జొప్పించి సక్సెస్‌ అవుతున్నాడు. జంధ్యాల సినిమాల్లో ప్రతి పాత్రకి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత నుంచే ఆయన కావాల్సినంత కామెడీ పంచేవారు.

ఆ విషయంలో జక్కన్నను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్న బాలీవుడ్ మేకర్స్!

మేకింగ్ మాత్రమే కాదు... ఆ సినిమాను ఆడియన్స్‌ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే అంటున్నారు ఈ జనరేషన్‌ డైరెక్టర్‌. ఏదో సినిమా చేసేసి పక్కన పెట్టేయటం కాకుండా... ప్రమోషన్స్‌లో కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. అలా అంతా తామే అయి సినిమాలను ముందుకు తీసుకెళుతున్న వారికే భారీ విజయాలు దక్కుతున్నాయి.

Andhra News: పందెంలో చచ్చిన కోడిపుంజుకు వేలం.. ఎంత ధర పలికిందో తెలిస్తే బిత్తరపోతారు

పందెంలో ఓడి పోయిన కోడి ఏమవుతుంది..? చనిపోతుంది.. లేదా.. తీవ్రగాయాల పాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.. చనిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే.. అలా చనిపోయిన కోడి పుంజు మాంసం ఖరీదు ఎంత ఉంటుంది.. అటు ఇటుగా గరిష్టంగా కే.జీకి వెయ్యి రూపాయల నుంచి రెండు మూడు వేల వరకు ఇవ్వవచ్చు.. అయితే, వేలం పాటలో ఓ చనిపోయిన కోడి పుంజు రికార్డు ధర పలికింది.

నార్త్ అమెరికాలో కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న సంక్రాతికి వస్తున్నా మూవీ!

సంక్రాంతి సినిమాల వసూళ్లు పోట్ల గిత్తెల వలె పరుగులు పెడుతున్నాయి. తాజాగా సంక్రాంతి నాడు రిలీజ్‌ అయిన వెంకటేశ్‌ సినిమా ఓ రేంజ్‌లో విక్టరీ మోత మోగిస్తోంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షురూ చేశాడు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!

సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ప్రతి ఇల్లు రంగుల ముగ్గులు, పిండి వంటలు, చుట్టాలతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజు సంతకు వెళ్లి చనిపోయారని... పి కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగను జరుపుకోవడమే మానేయడం వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా... ఇది నిజం. అలా సంక్రాంతి పండుగకు దూరంగా పి. కొత్తపల్లి గ్రామం ఉండిపోయింది.

Andhra News: జమ్మూలో తెలుగులో మాట్లాడుతున్న మహిళ.. ఆరా తీయగా.. 20 ఏళ్ల తర్వాత

ఆ పేద ఇంట్లో అసలుసిసలు పండుగ వేడుక జరిగింది.. వారు జరుపుకున్న సంక్రాంతి పండుగలో ఊరుఊరంతా పాల్గొన్నారు. వారే కాదు ఊరు వాడా సంబరాలు జరుపుకున్నారు. ఇంతకీ ఆ కుటుంబానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ పండుగ ఏంటి? వారికి మంచి జరిగితే ఆ ఊరు ఎందుకు సంబరపడుతుంది. అదేంటో తెలియాలంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే..

Cockfights: బుల్లెట్లు, థార్ కార్లు.. ఈసారి రేంజే వేరప్పా..! ‘పందెంకోడి’ సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే..

సంక్రాంతి పండగ, సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని, కోడిపందేలకు మాత్రం పర్మిషన్‌ లేదు. బెట్టింగులు పెట్టి మరీ ఆడతామంటే చట్టం ఒప్పుకోదు. కాని, సంక్రాంతి సమయంలో ఇవేమీ చట్టానికి కనిపించవు. ప్రతి రాజకీయ పార్టీ కోడిపందేలను ప్రోత్సహించడమే కారణం. అందుకే, ఏటా వందల కోట్ల రూపాయల కోడిపందేలు జరుగుతాయి.