Jump to content

లైంగిక విద్య

వికీపీడియా నుండి
స్టాన్ ఫర్డు విశ్వవిద్యాలయంలో లైంగిక విద్యను బోధిస్తున్న దృశ్యం

లైంగిక విద్య (ఆంగ్లం: Sex Education) అనగా మానవ లైంగికత (మానవ లైంగిక శరీరనిర్మాణశాస్త్రముతో సహా), లైంగిక పునరుత్పత్తి, సంభోగము, పునరుత్పత్తి ఆరోగ్యం, భావోద్రేక సంబంధాలు, పునరుత్పత్తి హక్కులు, విధులు, లైంగిక సన్యాసం, కుటుంబ నియంత్రణల గురించి తెలిపే విధివిధానాలు. తద్వారా లైంగిక వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తవహించాలో కూడా అర్ధం చేసుకోవడానికి వీలుకలుగుతుంది.

పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు. ఈ అంశం పై సలహాలు/సూచనలు, సమాచారం తల్లిదండ్రులు వారి సంతానానికి ఇవ్వటం వారి వారి విచక్షణకు వదిలి వేయబడింది. దీనితో తల్లిదండ్రులు వారి సంతానానికి వివాహం అయ్యేవరకూ ఈ ప్రస్తావన తీసుకువచ్చేవారు కారు. దీనితో యుక్తవయసులో పలు లైంగిక సందేహాలు గల యువత స్నేహితులు, (ముద్రణ, ప్రసార) మాధ్యమాలు వంటి అనధికారిక మూలాలపై ఆధారపడేవారు. ఈ మూలాల నుండి వచ్చే సమాచారం కావలసినంత మేరకు ఉండకపోవటం లేదా నమ్మదగినది అవ్వకపోవటం వంటివి ఉండేవి.

అయితే -

  • 60వ దశకంలో పాశ్చాత్య దేశాలలో కౌమార దశలోనే పెరిగిపోయిన అవాంఛిత గర్భాలు
  • ఆఫ్రికా దేశాలలో విరుచుకుపడిన ఎయిడ్స్ మహమ్మారి
  • చైనా, భారతదేశం లలో అనూహ్యంగా పెరిగిపోయిన జనాభా
  • స్త్రీవాదం వలన పెరిగిన అవగాహన. లైంగిక పునరుత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్యం, పునరుత్పత్తి హక్కుల గురించిన జ్ఞానం విస్తరించటం

- వంటి కారణాల వలన లైంగిక విద్య యొక్క ఆవశ్యకత పెరిగింది.

కొన్ని లైంగిక మిథ్యలు , వాస్తవాలు

వాస్తవం : స్త్రీ యొక్క యోనికి స్పర్శాజ్ఞానం ఉపరితలం పై అత్యధికంగా ఉంటే అంతరాలలోనికి పోయే కొద్దీ ఈ స్పర్శాజ్ఞానం తగ్గుతూ వస్తుంది. 3 inches వరకు స్పర్శ ఉంటుంది

యోని యొక్క అత్యంత అంతర్లీన భాగమైన గర్భాశయం (Cervix) వద్ద స్త్రీకి స్పర్శాజ్ఞానం అసలు ఉండదు. కావున పురుషాంగ పరిమాణానికి, సంభోగంలో స్త్రీ పొందే సుఖానికి సంబంధం లేదు.

  • మిథ్య : పురుషులు వీర్యాన్ని సంతానోత్పత్తికి తప్పితే మరెప్పుడూ స్ఖలించరాదు. ఒక వీర్యపు బొట్టు వంద రక్తపు బొట్లకి సమానం. వీర్యం పోయినచో, పురుషుణ్ణి నిస్సత్తువ ఆవహిస్తుంది
వాస్తవం : వీర్యస్ఖలనానికి, రక్తానికి, నిస్సత్తువకి అసలు సంబంధమే లేదు. ఆకలి వేసినపుడు చక్కని వంటలు కనబడితే నోరు ఎలా ఊరుతుందో, సంభోగాంతంలో పురుషుడి మర్మావయవాలలో అలా వీర్యం ఉత్పత్తి అవుతుంది. పైగా స్ఖలించని వీర్యం మూత్రాశయంలో చేరి అనవసరమైన ఇన్ఫెక్షన్ లకి కారకం అవుతుంది
  • మిథ్య : భావప్రాప్తి పొందే సమయంలో వీర్యస్ఖలనం చేయక, వాయిదాలు వేస్తూ, పలు భావప్రాప్తులు పొందిన తర్వాత వీర్యస్ఖలనం చేస్తే పారవశ్యపు పరిధి అత్యధికంగా ఉంటుంది.
వాస్తవం : ఒకే భావప్రాప్తి వలన ఎక్కువ సుఖముందా, పలు భావప్రాప్తుల వలన ఎక్కువ సుఖముందా అన్నది పూర్తిగా వ్యక్తిగతం. కడుపు నిండా భోంచేసిన తర్వాత ఇష్టమైన వంటని మరల ముందు పెడితే, దానిని ఆరగించటానికి కడుపులో చోటు ఉందా, ఆ కాస్త చోటు కూడా లేదా అన్నది ఎంత వ్యక్తిగతమో, ఇది కూడా అంతే.
  • మిథ్య : హస్తప్రయోగం ఒంటికి మంచిది కాదు. దీని వలన నరాల బలహీనత వస్తుంది. ఇది అనైతికం.
వాస్తవం : ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా లైంగికానందం పొందే ఏకైక మార్గం హస్తప్రయోగం. హస్తప్రయోగం అవివాహితులు పెడదారులు పడకుండా చూస్తుంది. వివాహితుల దాంపత్య జీవితంలో ఏవయినా లోటుపాట్లు ఉన్ననూ, ఏ పరిస్థితుల వలనైనా భార్యా-భర్తలు ఒకరికొకరు దూరంగా ఉన్ననూ హస్తప్రయోగాన్ని మించిన సాధన లేదు.
  • మిథ్య : సంభోగ సమయంలో లైంగిక ఊహ అనైతికం. ఇది భాగస్వామిని మోసం చేసినట్టే
  • వాస్తవం : సంభోగం యొక్క ప్రధాన ఉద్దేశం సంతానోత్పత్తి అయిననూ, మానసిక/శారీరక ఆనందం, తృప్తులు కూడా ముఖ్యమైనవే. తనకి ఆనందాన్నిచ్చే, తన భాగస్వామికి ఆనందాన్ని అందించేందుకు సహకరించే ఏ లైంగిక ఊహ అయిననూ ఆమోదయోగ్యమే. ఈ ఊహలని ఒకరితో ఒకరు పంచుకోవాలా లేదా అన్నది మాత్రం పూర్తిగా వ్యక్తిగతం. ఇరువురూ ఆనందించగలిగినచో పంచుకొన్ననూ తప్పులేదు.

లైంగిక ఆరోగ్య సూత్రాలు

  • భోజనం చేసిన వెంటనే సంభోగానికి ఉపక్రమించరాదు. భోజనానికి సంభోగానికి మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.
  • శారీరక/మానసిక ఆరోగ్యమే లైంగికారోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి శరీరాన్ని ఆకృతిలో ఉంచుకొనుటకు తగు వ్యాయామం చేయాలి. భాగస్వాములు ఇరువురూ కలసి వ్యాయామం చేయటం వారి మధ్య అన్యోన్యతని పెంచుతుంది.
  • సెక్స్ చేసే ముందు మీ భాగస్వామితో స్వేచ్ఛగా చర్చించండి.
  • స్త్రీలు సంభోగానికి ముందు మంచి మొత్తంలో ఫోర్ ప్లేని ఆస్వాదిస్తారు, కాబట్టి తొందరపడకపోవడమే మంచిది.
  • ముద్దులు, నజ్లింగ్ మీ భాగస్వామిని కచ్చితంగా సంతృప్తి పరచగల ఫోర్‌ప్లేలో ముఖ్యమైన భాగాలు, కాబట్టి దాని కోసం సమయాన్ని వెచ్చించండి.

లైంగిక విద్యని పెంపొందించేందుకు శ్రమించిన తెలుగువారు

మూలాలు

  1. Complete Idiot's Guide to Amazing Sex by Sari Locker
  2. Sex for Dummies by Dr. Ruth K. Westheimer and Pierre A. Lehu