Jump to content

వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2013)

వికీపీడియా నుండి

2013 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

మహా విస్ఫోటం
మహా విస్ఫోటం లేదా బిగ్ బేంగ్( Big Bang), అనేక స్వతంత్ర పరిశీలనల ఫలితంగా ఏర్పడిన వాదము. దీని ప్రకారం, విశ్వం, మహా ద్రవ్యరాశి మరియు ఉష్ణస్థాయి నుండి నేటి వరకు గల వ్యాప్తి చెందింది. సాధారణ ఉపయోగకరమైన పరిశీలన ఏమనగా విశ్వం గేలక్సీలను మోస్తూ తనంతట తాను వ్యాప్తిచెందుతూ ఉంది. ఇది విశ్వం యొక్క ఖగోళ భౌతిక నమూనా . 1929 లో ఎడ్విన్ హబుల్ పరిశీలనలలో 'గేలక్సీల మధ్య దూరాలు వాటి రెడ్ షిఫ్ట్ కు అనులోమానుపాతంగా ఉన్నాయని గుర్తించాడు. ఈ పరిశీలనల ఫలితంగా 'విశ్వం విస్తరిస్తూ ఉంది' అనే నిర్ధారణకు రావడం జరిగింది. నేటికినీ విశ్వం విస్తరిస్తూ ఉంది. అనగా, అది ప్రారంభ దశలో విపరీతమైన ద్రవ్యరాశి మరియు ఉష్ణాలను కలిగి ఉండేదని తేటతెల్లమౌతుంది.

(ఇంకా…)

2వ వారం

ఆటలమ్మ
ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.

(ఇంకా…)

3వ వారం

పొందూరు

పొందూరు (Ponduru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.పొందూరు శ్రీకాకుళమునకు 20 కి.మీ దూరంలో కలదు.ఖద్దరు,హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. భారత దీశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు. మహాత్మా గాంధీ గారు కూడా పొందూరుకు చెందిన ఖద్దరును యిష్టపడే వారు. అమెరికా,స్వీడన్, వంటి దేశాలకు ఎగుమతులు కూడా జరిగేవి.ఈ ప్రాంతంలో దేవాంగ,పట్టుశాలి,నాగవంశం అనే కులాలు ముఖమైనవి.ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై చక్కని ఖద్దరు వస్త్రాలను నేస్తారు. మగ్గాలతోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల ఆదారంగా ఖద్దరు ఇతర రకాల నేతలు నేయు నేతగాళ్ళు కలరు.

(ఇంకా…)

4వ వారం

గోరు చిక్కుడు

గోరుచిక్కుడు భారత దేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ.ఇది చాల తరాల క్రితమే ఆప్రికా నుండి వచ్చినదని నిపుణుల అంచనా. ఇది పుట్టిన దేశంలో కన్నా భారత్ లో దీని ఉత్పత్తి ఎక్కువ. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే దానిలో భారత్ ది 80% వాట వున్నది. తర్వాత స్థానంలో పాకిస్థాన్, అమెరికా వున్నాయి. రాజస్థాన్, వంటి ప్రాంతాలలో దీనిని పశువులకు, ఒంటెలకు ఆహారంగా వాడే వారు. గోరు చిక్కుడు జిగురుకు అంతర్జాతీయంగా ఈమద్యన గొప్ప డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా తన చమురు పరిశ్రమ ఉత్పత్తుల కోసం భారత్ లో తయారయ్యే గోకరకాయ/ గోరు చిక్కుడు జిగురు పైనే అదార పడి వున్నది. సామాన్యముగా గోరు చిక్కుడు కాయలను పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము.గోరు చిక్కుడు కాయలను సాంబారులోను, ఇతర కూరలలోను వాడుతారు. దీనితో పచ్చడి కూడ చెయ్య వచ్చు. కాని ఎక్కువగా వేపుడుగా గోరు చిక్కుడు కాయలను తెలుగునాట ఎక్కువ ఉపయోగములో వున్నది.

(ఇంకా…)

5వ వారం

యోగా
యోగా (సంస్కృతం: योग) అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.

(ఇంకా…)

6వ వారం
[[దస్త్రం: |150px|right|]]

ఛందస్సు
పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడ అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడ ఉన్నది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.

(ఇంకా…)

7వ వారం
దస్త్రం:Brass articles.JPG

అజ్జరం
అజ్జరం అంటే ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ఊరి ప్రధాన మరియు గుర్తింపు తెచ్చిన వృత్తి ఇత్తడి సామాను తయారీ. సాదారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలననుసరించి వృత్తులను చేయడం పరిపాటి. కాని ఈ ఊరిలో మాత్రం అన్ని వర్ణాలవారూ కలిసి (సుమారు 90%)ఒకే వృత్తి చేయడం జరుగుతూ ఉంది. అజ్జరం ఊరు రెండు పంచాయితీల పరిధిలో ఉంటుంది. అభివృద్ధి కొరకు కొంత భాగాన్ని వెంకట్రాయపురం గా విడగొట్టి కాకరపర్రు పంచాయితీ పరిధిలో కలిపారు. ఊరి మొదట్లో అడుగు పెట్టిన మరుక్షణం టంగ్ టంగ్ టక్కుంటక్కుం అని విని పిస్తూ ఒక వింతైన భావన కలిగిస్తుంది. ఏ ఇంటి ముంగిటి నుండి వెళుతున్నా కొత్తగా తయారయ్యే బిందెలో, బకెట్లో, తపేలాలో, లేదా పెద్దపెద్ద జాగీర్లలో కనిపించే చిత్ర విచిత్ర కళాఖండాలో ఫైవ్ స్టార్ హొటళ్లలో కనిపించే క్రోకరీనో కనుపించి కళ్ళకు కనువిందు చేస్తుంది.

(ఇంకా…)

8వ వారం

విద్యుత్
విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి (ఆంగ్లం: Electricity) అనేది ఒక వాహక మధ్యఛ్చేదం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ ల ప్రవాహం. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లో కొలుస్తారు. ఒక కులాం ఆవేశం ఒక సెకను కాలంలో ఒక వాహక మధ్యఛ్చేదం దాటితే ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది అని అంటాం. విద్యుత్ప్రవాహం ప్రమాణం ఆంపియర్ లేదా కులాం/సెకను.క్రీ.పూ 600 సం. లో గ్రీసు దేశంలో థేల్స్ అనేశాస్త్ర వేత్త మొదట విద్యుచ్చక్తి ఉనికిని గుర్తించాడు. ఆ దేశంలో amber(సీమ గుగ్గిలం) ను చెట్ల యొక్క రెసిన్ నుండి తయారుచేసేవారు. ఆ గుగ్గిలాన్ని పిల్లి చర్మంలో రుద్దినపుడు ఆ పదార్థం చిన్న చిన్న తేలికైన వస్తువులను ఆకర్షించుటను గమనించాడు. గ్రీకు భాషలో ఏంబర్ కు మరియొక పేరు "electron" అందువల్ల ఆ ఆకర్షించే ధర్మమును ఎలక్ట్రిసిటి అని పిలిచినారు. ఒక వస్తువును వేరొక వస్తువుతో రాపిడి చేసినపుడు ఒక పదార్థం యొక్క ఉపరితలంలో గల ఎలక్ట్రాన్లు(పరమాణువులోని ప్రాథమిక కణం) ఒక తలం నుండి వేరొక తలానికి బదిలీ అవుతాయి. అపుడు ఎలక్ట్రాన్లు కోల్పోయే వస్తువు తల ధనాత్మకం గాను, ఎలక్ట్రాన్లు గ్రహించిన తలం ఋణాత్మకం గాను యేర్పడుతుంది. ఈ రకమైన విద్యుఛ్చక్తిని స్థిర విద్యుత్ అందురు. క్రీ.శ 1600 సం.లో గిల్ బర్ట్ అనే శాస్త్రవేత్త రెండు రకాల ఆవేశాలుంటాయని ప్రతిపాదించాడు. (ఇంకా…)

9వ వారం

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె అనేది కొబ్బరిచెట్టు (కోకోస న్యూసిఫెరా) నుండి తీసిన పక్వ కొబ్బరి గుంజు లేదా పిసితం నుండి తీసిన ద్రవం. ఉష్ణమండలీయ ప్రపంచంలో, తరాలవారీగా మిలయన్ల మంది ప్రజల ఆహారంలో కొవ్వుకు ప్రధాన వనరుగా అందించబడుతుంది. దీనిని ఆహారం, ఔషధము మరియు పరిశ్రమల్లోని పలు అనువర్తనాల్లో ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనె చాలా ఉష్ణ లాయం కనుక ఈ గుణం దీనిని ఒక మంచి వంట మరియు వేపుడు నూనెగా మారుస్తుంది. ఇది సుమారు 360°F (180°C) వద్ద ధూమంగా మారుతుంది. దీని స్థిరత్వం కారణంగా, ఇది చాలా నెమ్మదిగా భస్మమవుతుంది మరియు దీని దుర్వాసన నిరోధకత కారణంగా, ఇది అత్యధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా రెండు సంవత్సరాలపాటు ఉంటుంది. (ఇంకా…)

10వ వారం

చతుర్భుజం
యూక్లిడ్ రేఖాగణితం లో,చతుర్భుజం లేదా చతుర్భుజి (Quadrilateral), నాలుగు సరళ భుజాలు కలిగిన బహుభుజి. చతుర్భుజమును ఆంగ్లంలో "quadrilateral" అందురు. ఈ పదం quadri(అనగా నాలుగు) మరియు latus(అనగా భుజం) అనే లాటిన్ పదములతో యేర్పడింది.

చతుర్భుజములు సామాన్యంగా రెండురకాలు. అవి సాధారణ(భుజములు ఖండించుకొనని) లేదా సంశ్లిష్ట (భుజములు అంతరంగా ఖండించుకొన్నవి). వాటిలో సాధారణ చతుర్భుజాలు కుంభాకార బహుభుజి లేదా పుటాకార బహుభుజి అనే రెండు రకాలుగా ఉంటాయి.

ఒక సాధారణ చతుర్భుజం యొక్క అంతర కోణముల మొత్తం 360 డిగ్రీలు, లేదా నాలుగు లంబ కోణాలు. (ఇంకా…)

11వ వారం

ఉస్మానియా విశ్వవిద్యాలయము
ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులలో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా బాషగా మారింది. (ఇంకా…)

12వ వారం
ఆంధ్ర క్షత్రియులు

క్షత్రియులు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా తెలుగు. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా వారు జన్మతరహా క్షత్రియ జాతికి చెందినవారు కారు. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని రాజస్థాన్ రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఓ.సి కి చెందుతారు (ఇంకా…)

13వ వారం
దస్త్రం:Sri-Veera-Brahmendra-Swamy.jpg

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1610-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను భోధించిన యోగి,హేతువాది సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపులు..బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల కు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది)అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామివారు, వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లి లో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందారు. వీరబ్రహ్మము గారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం లో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు. కాలజ్ఞానం లో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి.జరుగుతున్నాయి.

(ఇంకా…)

14వ వారం

గణన యంత్రం

గణన యంత్రం (కాలిక్యులేటర్) అనేది ఒక చిన్న (తరచూ జేబు పరిమాణంలో), సాధారణంగా గణిత శాస్త్రంలోని ప్రాథమిక గణనల చేయడానికి ఉపయోగించే చౌకైన ఎలక్ట్రానిక్ పరికరం. ఆధునిక కాలిక్యులేటర్‌లు ఎక్కువ కంప్యూటర్‌ల కంటే చాలా చిన్నవిగా ఉన్నాయి, అయితే ఎక్కువ పిడిఎ(PDA)లు కూడా చేతిలో ఇమిడిపోయే కాలిక్యులేటర్‌ల పరిమాణంలో లభిస్తున్నాయి.

కాలిక్యులేటర్ దాని చరిత్రను అబాకస్ మరియు స్లయిడ్ నియమం వంటి యాంత్రిక సాధనాల్లో కూడా కలిగి ఉంది. గతంలో, సంఖ్యా గణనల కోసం అబాసి, కంప్టోమీటర్‌లు, నాపైర్స్ బోన్స్, గణిత శాస్త్ర పట్టికల పుస్తకాలు, స్లయిడ్ నియమాలు, లేదా యాంత్రిక సంకలన యంత్రం వంటి యాంత్రిక గుమస్తా సహాయ సాధనాలను ఉపయోగించేవారు. గణన యొక్క ఈ పాక్షిక-మానవ విధానం ఖచ్చితమైనది మరియు దోషరహితం. మొట్టమొదటి డిజిటల్ యాంత్రిక కాలిక్యులేటర్ 1623లో రూపొందించబడింది మరియు వ్యాపారపరంగా విజయం సాధించిన మొట్టమొదటి పరికరాన్ని 1820లో ఉత్పత్తి చేశారు. 19వ మరియు 20వ శతాబ్దాల్లో అనలాగ్ కంప్యూటర్‌లతో సమానంగా యాంత్రిక రూపకల్పనలో మెరుగుదలలు కనిపించాయి; మొట్టమొదటి డిజిటల్ ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్‌లు 1960ల్లో రూపొందించబడ్డాయి, జేబు పరిమాణ పరికరాలు 1970ల్లో అందుబాటులో వచ్చాయి.

(ఇంకా…)

15వ వారం
[[దస్త్రం: |150px|right|]]

తెలుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు. భారత దేశం లో మాతృభాషగా తెలుగు మాట్లాడే 8.7 కోట్ల (2001 సంవత్సరపు లెక్కలు) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్ల మందికి మాతృభాషగా ఉన్నది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను కూడా అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

(ఇంకా…)

16వ వారం

భారతదేశంలో విద్య

భారతదేశం లో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉన్నది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది. నేడు, ఐఐటీ లు, ఐఐఎస్ లు, ఐఐఎమ్ లు, ఏఐఐఎమ్ఎస్, ఐఎస్ బి లు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి. భారతదేశంలో విద్య, 100% సాధించేందుకు ఓ సవాలుగా తీసుకొని ముందుకు పోతూవుంది. భారతదేశంలో అవిద్య లేదా నిరక్షరాస్యత అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైంది. నిరక్ష్యరాస్యతకు పేదరికం జీవాన్నిస్తూవుంది. పేదరికం, సామాజిక అసమతుల్యతల మూలంగా, సహజవనరులను సరిగా ఉపయోగించే విధానాలు లేక, విద్యకొరకు అతితక్కువ బడ్జెట్ కేటాయించడంవల్ల, ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వలన, నిరక్ష్యరాస్యత వెక్కిరిస్తూ ఉన్నది. కేరళ లాంటి రాష్ట్రాలలో అక్షరాస్యత స్థితులను చూసి భారతదేశంలో విద్య పట్ల కొంచెం ఆశ చిగురిస్తుంది. భారత్ లో మానవవనరుల అభివృద్ధి శాఖ, ఉన్నత విద్యా శాఖ, పాఠశాల విద్యా శాఖ మున్నగు శాఖలు విద్య కొరకు పాటుపడుతున్న సంస్థలు. విద్య కొరకు, సరైన పెట్టుబడులు, బడ్జెట్ లు లేని భారత్, ఇతరదేశాలనుండి, నేరుగా పెట్టుబడులనులు ఆహ్వానించేందుకు కూడా సిద్ధమవుతోంది.

(ఇంకా…)

17వ వారం

ఐక్యరాజ్య సమితి

అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి . మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.

(ఇంకా…)

18వ వారం
Construction schematic of a Prussian optical telegraph (or semaphore) tower, C. 1835

తంతి
తంతి లేదా టెలిగ్రాఫ్ అనునది విద్యుత్ స్పందనల సంకేతాల ద్వారా సమాచారాన్ని ఒకచోటు నుండి మరొక ప్రదేశానికి పంపించే వ్యవస్థ. టెలీగ్రాఫ్ అనే పదం టెలి (tele, గ్రీకు:τηλε అనగా "దూరం") మరియు గ్రాఫియన్ (graphein గ్రీకు:γραφειν అనగా "రచన") అనే రెండు గ్రీకు పదాల కలయిక. సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయుటకు ఉపయోగపడే వ్యవస్థ.

టెలిగ్రాఫ్ విధానం కొత్తదైనప్పటికీ దీని మూలసూత్రం పాతదే. క్రీ.పూ.500 ప్రాంతంలో పర్షియా చక్రవర్తి డేరియన్ రాజాజ్ఞలను, వార్తలనూ ప్రకటించటానికి బిగ్గరగా అరవగలిగే వాళ్ళను కొండశిఖరాలపు నియోగించేవాడట. గ్రీకులు దృశ్య టెలిగ్రాఫ్ విధానాన్ని వాడేవారు. మండుతున్న దివిటీల సముదాయాన్ని పర్వత శిఖరాలనుంచి ప్రత్యేక పద్ధతిలో తిప్పుతూ సంకేతాల ద్వారా అక్షరాలను ఇతరులకు సూచిస్తుండేవారు. కార్తజీనియన్లు, రోమన్లు ఇలాంటి పద్ధతులనే ఉపయోగించారు. నేడు ఆర్లియన్స్ అని పిలువబడుతున్న సెనాకం వద్ద ఆనేక రోమలులు హత్య చేయబడ్డారనే వార్త అరుపుల మూలంగా ప్రజలందరికీ త్వరగా అందించబడిందని జూలియన్ సీజర్ ఒక పుస్తకంలో వ్రాశాడు. ఏదైనా ప్రముఖ సంఘటన జరిగితే అక్కడి ప్రజలు బిగ్గరగా అరవడం ద్వారా ఇతరులకు తెలపడం పరిపాటిగా ఉండేదట. ఆఫ్రికా లో మరో పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది. తొర్ర పరిమాణాలు వేరు వేరుగా ఉండే చెట్టు బోదెలతో తయారుచేసిన ఢంకాలను బజాయిస్తే వివిధ శబ్ధ స్వరాలు యేర్పడతాయి. వీటి సంకేతాల ద్వారా సందేశాలు పంపబడుతూ ఉండేవి. దక్షిణ అమెరికా అమెజాన్ ప్రాంతంలో కూడా ఇలాంటి సాధనం ద్వారానే సమాచారాన్ని ఒక మైలు దూరం దాకా అందించుకునేవారు. పచ్చి కట్టెలను అంటించి పొగ సంకేతాల ద్వారా అనేక దేశలలో వార్తలు పంపుతుండేవారు.


(ఇంకా…)

19వ వారం

తేనీరు (లేదా టీ) అన్నది తేయాకును నీటిలో మరిగించిగా వచ్చిన ద్రావకం లేదా పానీయం. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రధమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు.

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక ఉల్లాసం కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విదుడల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి తగు మాత్రపు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది. (ఇంకా…)

20వ వారం
ఇతిహాస కాలం నాటి భారతదేశ ప్రదేశాలు
ఇతిహాస కాలం నాటి భారతదేశ ప్రదేశాలు

ద్వారకా నగరం
మహాభారతం లో ద్వారకా నగరం ద్వారావతి గా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడమే ఇందుకు కారణం. సంస్కృత భాషలో ద్వారం అంటే తెలుగులో వాకిలి లేక ద్వారం అని అర్ధం. కనుక రెండు కారణ నామాలు ఈ నగరానికి చక్కగా వర్తిస్తాయి. అనార్తా సామ్రాజ్యాధీశులైన యాదవులకు ద్వారక రాజధాని. గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉన్న ఈ నగరం సముద్రజలాల వలన ముంచివేయబడింది. ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహాలను ఎంచుకుని, ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసి ప్రజలను శూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒకభాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యము అనే కంటే సంయుక్త రాజ్యసమాహారం అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్యసమాహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్ మరియు మధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు మరియు బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్దవుడు, అక్రూరుడు మరియు ఉగ్రసేనుడు.

(ఇంకా…)
21వ వారం
నిస్తంత్రీ విధానంలో సమాచార ప్రసారం
నిస్తంత్రీ విధానంలో సమాచార ప్రసారం

రేడియో

కాంతి వేగ పౌన:పున్యాల(Frequency)తో విద్యుత్‌ అయస్కాంత(Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. మొదటిరోజులలో వాల్వ్‌లను ఉపయోగించి రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడ చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి.వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము(బ్యాటరీ-Battery)తో కూడ పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios) వచ్చినాయి.ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది (ఇంకా…)

22వ వారం
విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి మరియు రైలు వంతెన
విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి మరియు రైలు వంతెన

వంతెన
వంతెన (Bridge) వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం. వంతెనను సంస్కృతం లో సేతువు అంటారు. వంతెనలు ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన భౌతికమైన అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి. రహదార్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపోతే ప్రయోజనముండదు. రోడ్లు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరం.

మొట్టమొదట వంతెనలు పొడుగాటి చెట్లతో నిర్మించేవారు. రెండు గట్టుల మీద చివరలు ఆనుకొని ఉండేలా చెట్లను కాలువకు అడ్డంగా వేసి, ఈ ఏర్పాటును వంతెనగా ఉపయోగించేవారు. క్రీ.పూ. 450 ప్రాంతంలో బల్ల కట్టు తో తాత్కాలిక వంతెనలు ఏర్పరచి వాటికి ఊత గా పడవలను వాడేవారు. కాలువ మధ్య లో రెండు, మూడు చోట్ల రాతి స్తంభాలను కట్టి వాటిపై దూలాలను పరచి వంతెనగా వాడటం తరువాత ప్రారంభమైంది. ఇలాంటి వంతెనని బాబిలాన్ లో యూఫ్రటిస్ నదికి అడ్డంగా నిర్మించారని ప్రతీతి. ప్రాచీన చైనా లో అనేక నదులకు అడ్డం గా తాళ్ళ వంతెనలు నిర్మించారు. ఇందులో పొడుగాటి వేదికను తాళ్ళతో గానీ, గొలుసుతో గానీ వేలాడదీస్తారు. 200 అడుగుల పొడవు గల ఇలాంటి వంతెనలు పెరూ దేశంలోని 'ఇంకా' సామ్రాజ్యంలో కూడా వాడుకలో ఉండేవి. (ఇంకా…)

23వ వారం

సూపర్ నోవా
సూపర్నోవా సాధారణ నోవా కన్నా అతిశక్తిమంతమైన పేలుడు. సూపర్నోవా ఒక్కసారిగా విడుదల చేసే శక్తి వల్ల ఒక్కసారిగా మొత్తం గెలాక్సీ కంటే ఎక్కువ వెలిగిపోతుంది. తర్వాత కొన్ని వారాల నుండి కొన్ని నెలలలోపు మొత్తంగా ఆరిపోతుంది. ఈ సమయంలో అది సూర్యుడు తన జీవితకాలం మొత్తంలో విడుదల చేసే శక్తి కన్నా ఎక్కువ శక్తి విడుదల చేస్తుంది. ఈ పేలుడు వల్ల నక్షత్రంలోని పదార్థం అంతా 30,000కి.మీ/సె వేగంతో(కాంతి వేగంలో పదో వంతు) అన్నివైపులకి విసిరివేయబడి, అంతరిక్షంలో ఒక అలజడి తరంగాన్ని (shock wave) సృష్టిస్తుంది. సూపర్నోవాలు చాలా రకాలు. చాలా పెద్ద నక్షత్రాలు వాటిలోని ఇంధనం అయిపోయిన తర్వాత కేంద్రకసంలీనం ద్వారా శక్తిని విడుదల చేయడం ఆపివేసిన తర్వాత, గురుత్వ సంకోచం కారణంగా న్యూట్రాన్ నక్షత్రంగానో, కాలబిలంగానో మారి, వాటిలోని గురుత్వ స్థితిజ శక్తి నక్షత్రం పై పొరలను వేడెక్కించి పేల్చివేయడం వల్ల సూపర్ నోవాలుగా మారతాయి. కొన్ని మరుగుజ్జు నక్షత్రాలు వాటి సహనక్షత్రం నుండి పదార్థాన్ని గ్రహించి కర్బన సంలీనానికి సరిపడినంత కేంద్రక ఉష్ణోగ్రతని పెంచుకొని, అదుపులేని కర్బన సంలీనం వల్ల పేలిపోయి సూపర్ నోవాలుగా మారతాయి. సూర్యుడిలాంటి చిన్న నక్షత్రాలు మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి కానీ సూపర్నోవాలుగా మారవు. పాలపుంతలో 1604 నుండి సూపర్నోవాలను గమనించకపోయినప్పటికీ, సూపర్ నోవా శకలాల విశ్లేషణని బట్టి సగటున ప్రతి 50సం.లకు ఒక సూపర్నోవా సంభవిస్తుందని అంచనా. అంతరిక్షంలో భార మూలకాల సృష్టిలో సూపర్నోవాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవి సృష్టించే అలజడి తరంగం కొత్త నక్షత్రాల పుట్టుకకి కారణం అవుతుంది.

(ఇంకా…)

24వ వారం

ఈజిప్టు పిరమిడ్లు
"పిరమిడ్" అనునది (మూస:Lang-el pyramis[1]) జ్యామితి పరంగా పిరమిడ్ వంటి నిర్మాణ ఆకృతి. దీని బయటి తలములు త్రిభుజాకారంగా ఉండి పై చివర ఒక బిందువుతో అంతమగును. దీని భూమి త్రిభుజ, చతుర్భుజ, లేదా ఏదైనా బహుభుజి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమయినవి. ప్రాచీన మరియు మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి.యివి క్రీ.పూ 2886-2160 నాటివి. నైలునదీ లోయకు 51 వ మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో, ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700 కి పైగా పిరమిడ్స్ గోచరిస్తాయి. ఈ పిరమిడ్స్ సమాధుల రూపాలు. వీటిలోఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సారలు పట్టి ఉందవచ్చునని చరిత్ర కారుల అంచనా. (ఇంకా…)

25వ వారం

ఉపనయనము

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్టలతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిస్థలతోకూడిన జీవితంలో ప్రవేసించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరవాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణులను సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు. క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా అధిక ప్రాముఖ్యతతో నిషిద్ధ విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విధ్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్తాశ్రమంలో ప్రవేశించేవారు. ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు.యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్నతరవాతే ఆచరించాలి.క్షత్రియులకు ధర్మశాస్త్రాలుభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి విధ్యాభ్యాసం ఆరంభించేవారు.పితరులకు కర్మకాండ,తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం.కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు.సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే.కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ.హిందూ దర్మంలో ఇది బ్రాహ్మణులకు,క్షత్రియులకు,వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన భాద్యత. (ఇంకా…)

26వ వారం
ఆహారంలో వాడే అవిసె నూనె

నూనె

నూనె లేదా తైలం (ఆంగ్లం: Oil) ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా నీటిలో కరుగవు. ఇవి ఎక్కువగా హైడ్రోజన్ మరియు కార్బన్ సమ్మేళనాలు. వంట నూనెలు, పెట్రోలియం మొదలైనవి ముఖ్యమైన నూనెలు. యివి స్థూలంగా రెండు రకాలుగా ఉంటాయి.

  • శిలాజ నూనెలు. ముడి పెట్రొలియం నుండి తయారగు నూనెలు.
  • సేంద్రియ నూనెలు. జంతు, వృక్ష సంబంధిత నూనెలు.

శిలాజ సంబంధిత నూనెలు అనగా ముడి పెట్రోలియం నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత కలిగిన హెక్సేన్, పెట్రోలు, కిరోసిన్, డిసెలు వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి. యివి అధిక మరుగు ఉష్ణొగ్రత ఉండే ఖనిజ తైలము / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగివున్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి వుండవు. ఇవి ఆధునిక మానవునిగా విస్తృతంగా ఇంధనంగా ఉపయోగపడుతున్నాయి. సేంద్రియ నూనెలు అనగా మొక్కలు, జంతువులు లేదా ఇతర జీవుల నుండి ఆర్గానిక్ ప్రక్రియల ద్వారా తయారయ్యేవి. అన్ని నూనెలూ కొవ్వు పదార్ధాలే.

(ఇంకా…)

27వ వారం

నిర్జల ఘటం
నిల్వచేసిన రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేందుకు ఉపయోగించే సాధనాన్ని విద్యుత్ ఘటం లేదా బ్యాటరీ అందురు. ఈ ఘటాలను శ్రేణి సంధానం చేసి అధిక విద్యుచ్ఛాలక బలం పొందవచ్చు. నిల్వచేసిన రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేందుకు ఉపయోగించే రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్‌ రసాయనిక ఘటాల మేళనాన్ని విద్యుత్ ఘటమాల అంటారు. 1800లో అలెశాండ్రో వోల్టా మొట్టమొదటి వోల్టాయిక్ పైల్ (వోల్టాయిక్ ఘటాలను శ్రేణిలో అమర్చిన ఒక బ్యాటరీ)ను కనిపెట్టినప్పటి నుంచి, అనేక గృహ మరియు పారిశ్రామిక అనువర్తనాల్లో ఘటం (Battery) ఒక సాధారణ విద్యుత్ మూలంగా మారింది. 2005నాటి ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ పరిశ్రమ 6% వార్షిక వృద్ధితో, ప్రతి ఏడాది విక్రయాలు ద్వారా US$48 బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తుంది.

రెండు రకాల బ్యాటరీలు (విద్యుద్ఘటాలు) ఉపయోగంలో ఉన్నాయి: అవి ప్రాథమిక బ్యాటరీలు (పునర్వినియోగపరచలేని బ్యాటరీలు), ఒకసారి ఉపయోగించేందుకు ఉద్దేశించి తయారు చేసే వీటిని, శక్తి క్షీణించిన తరువాత పారవేస్తారు మరియు ద్వితీయశ్రేణి బ్యాటరీలు (రీఛార్జ్ చేయదగిన బ్యాటరీలు, పునర్వినియోగపరచదగిన బ్యాటరీలు), వీటిని తిరిగి ఛార్జ్ చేసేందుకు మరియు అనేకసార్లు ఉపయోగించేందుకు ఉద్దేశించి తయారు చేస్తారు. వినికిడి ఉపకరణాలు మరియు చేతి గడియారాలు వంటి విద్యుత్ పరికరాల్లో సూక్ష్మ ఘటాలను ఉపయోగిస్తారు; దూరవాణి కేంద్రాలు (టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు) మరియు గణనయంత్ర సమాచార కేంద్రాలకు (కంప్యూటర్ డేటా సెంటర్స్) పెద్ద ఘటాలు అత్యవసర విద్యుత్‌ను (స్టాండ్‌బై పవర్) అందిస్తాయి.


(ఇంకా…)

28వ వారం
విద్యా ప్రకాశానందగిరి స్వామి

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు, శ్రీ గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరీ వ్యవస్థాపకులు.

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆనంద నామ సంవత్సర చైత్ర బహుళ తదియ (13-4-1914) నాడు బందరులో శ్రీ రామస్వామి, సుశీలా దేవి అనే పుణ్య దంపతులకు మూడవ పుత్రుడుగా స్వామివారు జన్మించారు. తండ్రి గారైన శ్రీ రామస్వామిగారు న్యాయవాది. గొప్ప దేశభక్తి గలవారు. హైందవ సమాజాన్ని చక్కగా సంస్కరించాలంటే దృఢ సంకల్పంతో పనిచేసిన సంఘసంస్కర్త భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలను భాషంతో సహా అధ్యయనం చేశారు. శిష్టాచార సంపన్నులైన ఈ పుణ్య దంపతుల ఇంటికి తరచుగా విద్వాంసులు, సాధు మహాత్ములు వచ్చేవారు. వేదాంత గోష్టులు జరుగుతుండేవి. స్వామి వారి బాల్యనామం "ఆనంద మోహన్". చిన్నతనంలోనే ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించేవారు. పసితనం నుంచె ఎంతో దైవ భక్తి ఉండేది. రామస్వామి గారు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నారు.. వకీలు వృత్తికి రాజీనానామా చేసి చిన్న పర్ణ కుటీరంలో జీవిస్తూ, ధ్యానం, జపం, భజన, పారాయణం, అర్చన, ఆత్మవిచారణ,వేదాంతగోష్టులతో కాలం గడపసాగారు. ఆదర్శ గృహిణి సుశీలాదేవి భర్తకు అన్ని విధాలా సహకరించేవారు. సహజంగానే ఆధ్యాత్మిక సంస్కారం గల ఆనంద మోహనుని చిత్త వృత్తి దైవ మార్గంలో పురోగమించటానికి వాతావరణం అనుకూలించింది.

(ఇంకా…)

29వ వారం

టెలీఫోను
టెలిఫోను(దూరవాణి) అనునది చాలా దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాలనుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమంద్వారా చేరవేసే పరికరంటెలీఫోను (గ్రీకు భాష నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనె శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. టెలిఫోన్ అనునది చరిత్రలో చాలా దూరం లో ఉండే వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించుకొనే మొదటి పరికరం.ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు,ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది. టెలిఫోన్(దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్(ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్(వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్(నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది[1]. రిసీవర్ మరియు ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్ కు అనుసంధానించబడుతుంది.

(ఇంకా…)

30వ వారం

ముద్రణా యంత్రం
ముద్రణ యంత్రం అనునది ఒక అచ్చువేయవలసిన మాధ్యమం (కాగితం లేదా వస్త్రం) పై ముద్రణ సిరాతో అచ్చు వేసే యంత్రం.

అలెగ్జాండ్రియా లో పూర్వం ఒక పెద్ద గ్రంధాలయం ఉండేది. జూలియస్ సీజర్ ఈ నగరాన్ని ముట్టడించినపుడు గ్రంధాలయం కొంతవరకు ధ్వంసం అయినది. క్రీ.శ 390 లో ధియోఫిలన్ అనే క్రైస్తవ మత గురువు ఇక్కడి నుంచి కొన్ని పుస్తకాలను తరలించాడు. క్రీ.శ 642 లో మహమ్మదీయులు ఈ నగరం పై దండెత్తి వచ్చినపుడు కాలిఫ్ ఉమర్ గ్రంధాలయం కాల్చివేయమని సైనికులను ఆజ్ఞాపించాడు. సుమారు 4 లక్షల పుస్తకాలు మానవుని తెలివి తక్కువ తనానికి, ప్రతీకార వాంఛలకు బలైపోయాయి. ప్రాచీన సాహిత్య గ్రంధాలూ, జానపద గాధలూ, తరగని విజ్ఞాన సంపదా వాటిలో నిక్షిప్తంగా ఉండేవి. అవన్నీ రాయస గాళ్ళ చేత, బానిసల చేత, పండితుల చేత చేతితో రాయబడ్డవే. ఒక పెద్ద గ్రంధాలయం నాశనం కావడంతో కళలకు, సాహిత్యానికి, వేదాంత విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన అపార జ్ఞాన నిధి తరువాతి తరాలకు శాశ్వతంగా దూరమైంది. కానీ ఇలాంటి దుర్ఘటన ప్రపంచంలో మరెన్నడూ సంభవించదు. లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం, వాషింగ్టన్ లైబ్రరీ కాంగ్రెస్, పారిస్ లోని "బిబ్లియోధెక్ నేషనేల్ " సంపూర్ణంగా దగ్ధమైపోయినప్పటికీ, వాటి ప్రతులు ఇతరదేశాల లైబ్రరీల్లో నేడు లభ్యమవుతున్నాయి. నాగరికత మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లి కొనసాగినంత వరకూ పదిల పరచదగ్గ సమాచాన్నంతా ముద్రణ యంత్రం మనకోసం పదిల పరిచే ఉంటుంది. మానవ చరిత్రలో జరిగిన అనేక ఆవిర్భావాల్లో ప్రజల జీవన సరళినే కాకుండా వాళ్ళ మనసుల్ని, హృదయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్క ముద్రణ విధానమే అని చెప్పవచ్చు.

(ఇంకా…)

31వ వారం
కొత్త ధవళేశ్వరం ఆనకట్ట

ధవళేశ్వరం ఆనకట్ట
తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి సమీపమున ఉన్న ధవళేశ్వరము,మరియు పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరములనుకలుపుచూ గోదావరి నదికి అడ్డంగా నిర్మించిన ఆనకట్టయే 'ధవళేశ్వరం-విజ్జేశ్వరము ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847 లో ప్రారంభించి,1852నాటికి పూర్తిచెయ్యబడినది.

గోదావరినది పై ధవళేశ్వరము వద్ద ఆనకట్ట నిర్మించకముందు, గోదావరి డెల్టా లోని రెండు జిల్లాలు అతివృష్టివలన ,తుఫానుల వలన ముంపునకు గురై,,అనావృష్టి వలన కరువుకాటకాలకు లోనై, ప్రజలు అష్టకష్టాలు పడుచు, దుర్భర దారిద్ర్యానికి లోనయి జీవించేవారు. వరుసగా దాదాపు 20 సంవత్సరములు క్షామం నీడలో రెండుజిల్లాల జనం అల్లాడిపోయారు.1831-32 లో అతివృష్టి మరియు తుఫా నుల కారణంగా పలు గ్రామాలు ముంపుకు గురైనాయి.1833 లో, నందన సంవత్సరంలో అనావృష్టి వలన దుర్భరమైన క్షామం, కరువు వచ్చి, వేలసంఖ్యలో ఆకలిచావులు సంభవించాయి.దాదాపు రెండు లక్షలమంది కరువు బారిన పడ్డారు. ఊరు విడిచి వెళ్లలేని వారు కడకు తమ ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను సంతలో వస్తువులను అమ్మినట్లు అమ్ముటకుకూడా సిద్ధమయ్యారంటే, నాటి క్షామం ఎంత తీవ్రమైనదో ఊహించవచ్చును. తిరిగి 1839 లో తీవ్రమైన తుఫానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై, క్షామపరిస్థితులేర్పడి, వేలాది జనం కాందిశీకులుగా ప్రక్క జిల్లాలకు, ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళవలసివచ్చింది.గోదావరి జిల్లాల ప్రజల ఈ దుర్భర పరిస్థితులను గమనించిన, అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రి మౌంట్ , ప్రజల కష్టాలను వివరిస్తూ, ప్రభుత్వానికి ఒక నివేదికను పంపాడు. ఆ నివేదికకు స్పందించిన బ్రిటిషు ఇండియా ప్రభుత్వం, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకుగల అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనావేయుటకై ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశం పై రాజమండ్రి వచ్చిన కాటన్, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకై, అనువైన ప్రాంతానికై అన్వేషణ ప్రారంభించాడు.

(ఇంకా…)

32వ వారం
దస్త్రం:Subhas Bose.jpg
సుభాష్ చంద్రబోస్

సుభాష్ చంద్రబోస్
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జననం: జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీ తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.

(ఇంకా…)

33వ వారం
సురవరం ప్రతాపరెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ రాజకీయ,సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనది. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణా లో కవులే లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణా సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు,గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు.జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదు లోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955 లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్రము రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది. (ఇంకా…)

34వ వారం
దస్త్రం:2008 Taichung IT Month Day2 CHT MOD HiPlus solution.jpg

దూరదర్శిని

"టెలివిజన్"(దూరదర్శన్) అనునది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీనిద్వారా దృశ్య మరియు ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు-తెలుపు మరియు రంగుల్లో చిత్రాలను చూపించేసాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్ మరియు గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం, మరియు లాటిన్ పదం visio అనగా దృష్టి అనిఅర్థము.

టెలివిజన్ నిర్మాణంలోనే సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించినవాడు స్కాట్లండ్ కి చెందిన ఓ క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగీ బెయిర్డ్. అనారోగ్యం కారణంగా ఇంజనీరింగ్ విద్యని పూర్తిచేయలేక యితడు వ్యాపార రంగంలో ప్రవేశించాడు. విసుగు చెందని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో ఓ ధ్యేయం కోసం అహర్నిసలూ శ్రమించిన ఉదాహరణలు సాంకేతిక శాస్త్ర చరిత్రలోనే చాలా అరుదు. ఈ శతాబ్దానికే తలమానికమైన ఆవిష్కరణని సాధించడంలో బెయిర్డ్ ఎదుర్కొన్న అవాంతరాలు అన్ని ఇన్నీ కావు. టెలివిజన్ పూర్వాపరాలను గురించిన పరిజ్ఞానం శూన్యం. మేడమీదున్న ఓ మురికి గది ఓ ప్రయోగశాల. ఎలక్ట్రికల్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటారు ని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి నివ్‍కో ఫలకాన్ని తయారు చేశాడు. సైకిల్ షాప్ లో కొన్ని కటకాలను కొన్నాడు.మిలిటరీ స్టోర్ లో మూల పడేసిన పాత వైర్‍లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్యముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడిఉండే తీగలు - ఇవీ అతని ప్రయోగశాలలోని పరికరాలు! రెండేళ్ళ నిరంతర కృషి ఫలితంగా కొన్ని ఆకారాల్ని సుమారు మూడు మీటర్ల దూరందాకా ప్రసారం చేయడంలో బెయిర్డ్ కృతకృత్యులయ్యాడు.తరువాతి పరిశోధనల ఫలితంగా 1925 అక్టోబర్ 2 వ తేదీన ఓ కంపెనీ లో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారంచేశాడం, ఈ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూడటం జరిగింది. కొన్ని నెలల తర్వాత, అతడు తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకూ, పత్రికా విలేఖరులకూ ప్రదర్శించాడు. (ఇంకా…)

35వ వారం

దాదాసాహెబ్ ఫాల్కే

ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ,మాజిక్,మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై సాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణతికెక్కాడు

ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే , జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) ( ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు. ఈయన మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్ లో 1870 ఏప్రిల్ 30 న జన్మించాడు. ఫాల్కె తండ్రితో ఉద్యోగ నిమిత్తం బొంబాయి చేరాడు. కళాత్మక అభిరుచి ఉండటంతో 1885 లో జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. చిత్రలేఖనం చేర్చుకున్నాడు.

(ఇంకా…)

36వ వారం

బొంగరము

బొంగరము కొయ్య తో చేయబడిన ఒక ఆట వస్తువు. దీనికి తాడు కట్టి బలంగా తిప్పితే కొద్దిసేపు గుండ్రంగా తన అక్షం చుట్టూ తిరుగుతుంది. పల్లెలలో ఒకప్పుడు పిల్లా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు బొంగరాలు తిప్పేవారు. దీనిని తిప్పడానికి వాడే త్రాడుని ప్రత్యేకంగా తయారు చేసేవారు. దీనిని జాటీ అంటారు. దీనితో బొంగరాల ఆట కూడా ఆడతారు. ఇందులో ఓడిపోయినవారి బొంగరాన్ని ఒక గుండ్రని వలయాకారపు గుంతలో ఉంచి అందరూ దానిని గురి చూసి కొడతారు. తాడుతో బొంగరం తిప్పటం ,ఎక్కువ సేపు తిరిగేలా చేయటం ,అరచేతిలో బోగారాన్ని ఆడించటం గొప్ప నైపుణ్యానికి పరీక్షే . మారుతున్న కాలంతో పాటు ఈ గ్రామీణ క్రీడ కనుమరుగవుతోంది. ఇప్పుడు ప్లాస్టిక్ బొంగరాలు కూడా వస్తున్నాయి.

బొంగరము అనునది తన అక్షం చుట్టూ తిరిగి భ్రమణ చలనం చేస్తుంది. ఇది చెక్కతో చేయబడి పై వైశాల్యం కన్నా క్రింది వైశాల్యం తగ్గించబడి ఉంటుంది. క్రింది భాగం చివర లోహపు ముల్లు ఉంటుంది. ఈ ముల్లుకు ఒక ప్రత్యేక త్రాడు(జాటీ) ను సర్పిలాకారంగా అనేక సార్లు చుట్టి దానిని మన వేళ్ళ ద్వారా ఒకే సారి లాగి వదిలినపుడు అది దాని అక్షంపై భ్రమణం చేస్తుంది. ఆధార వైశాల్యం తక్కువ ఉన్నందువల్ల ఘర్షణ బలం తగ్గించబడుతుంది. అందువల్ల చాలా సేపు తన అక్షంపై తిరుగుతుంది. ఈ తిరిగే బొంగరాలు ప్రపంచం లోని చాలా ప్రాంతముల సంస్కృతి లో భాగమైనాయి. గోళీకాయ పరిమాణంలో మట్టి ముద్దను తీసుకుని దాన్ని చేతితో వత్తుతూ నేలపై గుండ్రంగా వత్తాలి. దాన్ని పిప్పరమెంట్ బిళ్ళ ఆకారంలో తయారు చేసి దాని మధ్యలో చిటికెన వేలంత పొడవుండే కొబ్బరి ఈన గుచ్చాలి. ఈన గుచ్చుకున్న ప్రాంతంలో మట్టి బిళ్ళ కు పైన కింద చిన్న బొడిపెల వోత్తగానే మట్టి బొంగరం రెడి. దీనిపైన చిన్న తగరపు పొర ను అంటిస్తే బొంగరం తిరిగేటపుడు కలరపుల్ వుంటుంది. ఈ మట్టి బొంగరాన్ని తిప్పడం కూడా ఒక టాలెంట్ అనొచ్చు.

(ఇంకా…)

37వ వారం

ముహమ్మద్ ప్రవక్త

ముహమ్మద్‌ అరబ్బుల మత మరియు రాజకీయ నాయకుడు మరియు ఇస్లాం యొక్క చివరి ప్రవక్త. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందస్తుగా మూసా మరియు ఈసా యొక్క బోధనలు ఉన్నవి. ముస్లిమేతరులు సాధారణముగా ఇతనిని ఇస్లాంమత స్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది ఆదిపురుషుడయిన ఆదమ్ ప్రవక్తతో. సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము c.570 మక్కాలో జన్మించాడు మరియు జూన్‌ 8, 632 లో మదీనాలో మరణించాడు. మక్కా మరియు మదీనా నగరములు రెండూ అరేబియన్‌ ద్వీపకల్పములో కలవు.

ముహమ్మద్‌ విస్తృతముగా ప్రయాణించిన వర్తకుడు. తొలి ముస్లిం మూల నివేదికల ప్రకారము 611 లో, 40 ఏళ్ళ వయసులో మక్కా కు సమీపములోని హిరా గుహ లో ధ్యానము చేయుచుండగా, దివ్య దృష్టిని పొందాడు. తరువాత తన అనుభూతిని సమీప వ్యక్తులకు వర్ణిస్తూ దేవదూత జిబ్రయీల్, తనకు కనిపించి ఖురాన్ ప్రవచనాలను గుర్తుపెట్టుకొని ఇతరులకు బోధించమని అల్లాహ్ ఆదేసించినాడని చెప్పాడు. తదనంతరం తన విద్యుక్తధర్మాన్ని మతపర కర్తవ్యాన్ని వ్యాప్తి చేస్తూ, దైవ సందేశాలను ప్రజలకు ఉపదేశిస్తూ, కఠోర ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన విడనాడడం, ప్రళయదినం పై విశ్వాసం, విశ్వాసుల ప్రథమకర్తవ్యమని బోధించాడు.


(ఇంకా…)

38వ వారం

హోమియోపతీ వైద్య విధానం

హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తదౄపేణా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనటం అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపిస్తుంది. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (1755-1843) అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న ఇంగ్లీషు వైద్యాన్ని "ఎల్లోపతీ" అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.

(ఇంకా…)

39వ వారం

యక్షగానం

యక్షగానం (కన్నడం:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత . ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ . కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలోనూ శివమొగ్గ మరియు కేరళ లోని కాసరగోడు జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు. యక్షగాన ప్రదర్శన సాయంత్రవేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై శవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కవగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా , వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుసారంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే ఈ కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. భక్తి ఉద్యమం జరిగే సమయంలో ఉన్న శాస్త్రీయ సంగీతం ఇంకా నాటక కళ యక్షగానంగా పరిణితి చెందాయన్నది ఒక నమ్మిక. గత కొద్ది కాలంగా బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది, ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట(గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది.

(ఇంకా…)

40వ వారం
విష్ణువును పూజిస్తున్న జయదేవుడు

జయదేవుడు

జయదేవుడు సంస్కృత కవి, పండితుడు. ఈయన 12 వ శతాబ్దమునకు చెందినవాడు. అతడు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, గీత గోవిందం హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. జయదేవుడు ఒరిస్సా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ప్రాచి లోయలో ఉన్న కెందుళి(బిందుబిల్వ) గ్రామంలో ఒక ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కెందుళి సాసన్ ( ఇప్పుడిలా పిలువబడుతోది ) గ్రామం, పూరీకి సమీపంలో ఉంటుంది. ఈ విషయమును జయదేవుడు 7 వ అష్టపదిలో "కిందుబిల్వ సముద్ర సంభవ" అని పేర్కొనిరి. జయదేవుడి తలిదండ్రులు, భోజదేవుడు మరియు రమాదేవి లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒరిస్సా చోడగంగ దేవ ఏలుబడిలో ఉండేది. జయదేవుడు కుర్మపాటక లో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన పద్మావతిని వివాహమాడాడు.ఆమె కృష్ణ భక్తురాలు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా వైష్ణవ బ్రాహ్మణుల ప్రాబల్యంలో ఉండేది. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. బీద బ్రాహ్మడుడాఇన జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివసిస్తూ చాలా వరకూ ధ్యానములో కాలము గడిపినారని తెలియుచున్నది.బెంగాలులోని నవద్వీపమునకు రాజైన లక్షణసేనుని అస్థానమున క్రీ.శ 1116 లో జయదేవుడు ఒక పండితుడిగానున్నట్లు అచట గల ఆధారములను బట్టి తెలియుచున్నది. మహారాజు కోటద్వారము వద్ద గల రాతిపై "గోవర్థనుడు, పారణ, జయఃదేవులు" అను మూడు రత్నములు మహారాజు కొలువులో నున్నట్లు చెక్కబడియున్నవి.

(ఇంకా…)

41వ వారం

త్రిఫల చూర్ణం

త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కర క్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమం ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి. ప్రేగు గోడలకు కొత్తశక్తినిచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు.

(ఇంకా…)

42వ వారం

హెలెన్ కెల్లర్

మానవునిలో నిద్రాణమైన శక్తులు అనేకం. వాటిని వినియోగించుకోవటానికి అకుంఠిత దీక్ష,అవిరామకృషి,ఆత్మస్థైర్యం,ఆత్మ విశ్వాసం అవసరం. మనం సాధారణంగా ఉపయోగించుకుంతున్నవి 50 శాతానికి మించి ఉండవు. దీక్షా దక్షతలు, ఆత్మ విశ్వాసం ఉన్నవారికి శారీరక వైకల్యాలు ఎన్ని ఉన్నప్పటికీ జీవితాన్ని జయించటం ఏ మాత్రం అవరోధం కాలేవని చరిత్రలో ఎంతోమంది నిరూపించారు. అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన "హెలెన్ ఆదాం కెల్లర్" ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు. అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన "హెలెన్ ఆదాం కెల్లర్" ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు.జార్జి బెర్నార్డ్ షా, థామస్ అల్వా ఎడిసన్,ఐన్‌స్టీన్,రవీంద్రనాథ్ ఠాగూర్,చార్లీ చాంప్లిన్, మొదలైన ప్రముఖులు మీద తన పరిచయ ప్రభావాన్ని ప్రస్ఫుటంగా కలిగించిన ఈమె మహోదాత్త వ్యక్తిగా నిలిచారు. ఊహ బాగా అందే అందక పూర్వమే పెద్ద జబ్బు చేసి, చూపు,వినికిడి,మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలై ఈమె ఈ ప్రపంచాన్ని చూసింది లేదు. ఏ శబ్దాన్ని విన్నదీ లేదు. అయినా అన్నీ అవయవాలు సలక్షనంగా ఉన్న వారందరి కంటే మహోన్నత స్థాయిలో జీవించారు. పట్టుదలతో సాధింపలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించి ప్రపంచ పౌరులందరికీ ఆదర్శవంతమైన సార్థక సేవా విదుషీమణీగా వన్నెకెక్కారు."19 వ శతాబ్దం" లో అత్యంత శక్తిమంతులుగా ఆవిర్భవించిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు నెపోలియన్ అయితే రెండవవారు హెలెన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వయిన్ కితాబునందుకున్నారు.

(ఇంకా…)

43వ వారం

కలబంద

కలబంద ఒక రకమైన ఔషధ మొక్క. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండికూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్నివృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లైతే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకొనే సాధారణ మొక్కలే కాకుండా..ఔషద మొక్కలను పెంచుకొనే మార్గాలున్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాం గా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వాహణ కూడా సులభమే..ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబటి గాలిలో ఉన్న తేమను పీల్చుకొనే జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు పూస్తాయి. యిది స్టోలాన్ ఉపవాయుగత కాండం గల బహువార్షిక గుల్మము.రసయుతమైన కంటక ఉపాంతంతో కత్తి ఆకారంలో నున్న సరళ పత్రాలు కలిగి ఉంటుంది. అగ్రస్థ అనిశ్చిత విన్యాసంలో అమరిన ఎరుపు లేదా పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ పుష్పాలు కలిగి ఉంటుంది.నీరు లభించని కాలంలో కలబంద ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ (Chlorophyill) నాశనమయ్యి రోడోక్సాన్థిన్ (Rhodoxanthin) అనే ఎర్రటి పిగ్మెంట్ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆకులు ఎర్రగా మారతాయి. నీరు లభించినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెంది మరలా ఆకుపచ్చగా మారుతుంది. ఇంచుమించు అన్ని కలబంద జాతుల్లో ఈ లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని శాస్త్రీయ పరిభాషలో ఆప్టికల్ ప్రాపర్టీ (Optial Property) అని అంటారు.దీనిని అనేక ఆయుర్వేద వైద్యంలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు.

(ఇంకా…)

44వ వారం

పాలిటానా

పాలిటానా నగరం భారత దేశం లోని గుజరాత్ నందు గల "భావ్‌నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్‌నగర్ పట్టణానికి నైఋతి దిక్కున కలదు. ఇది జైనులు యొక్క తీర్థయాత్రా ప్రదేశము. గుజరాత్‌ లోని భావ్‌నగర్ జిల్లాలో అతి పురాతన పట్టణం ‘పాలిటానా’. ఇక్కడికి అతి సమీపంలోని శతృంజయ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి. ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలు ఉండటం విశేషం. అన్నిట్లో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం అద్భుతం. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి. అప్పట్లో జైన, బౌద్ధమతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలిటానా. ఇది 1194 లో రాజరిక రాజ్యంగా స్థాపించబడినది. ఇది అనేక చిన్న రాష్ట్రాలు కలిగిన సౌరాష్ట్ర రాష్ట్రం లోని అనేక ముఖ్య నగరాలలో ఒకటి. పాలిటానా నగరం 777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి 58,000 నివాసితులతో(1921 లో) 744,416 రెవెన్యూ కలిగిన 91 గ్రామాలలో ఒకటిగా ఉండెడిది. 1656 లో షాజహాన్ కుమారుడైన మురాద్ బక్ష్ (అప్పటి గుజరాత్ గవర్నర్) ప్రముఖ జైన వ్యాపారి యిన శాంతిదాస్ ఝావేరి కి ఈ గ్రామాన్ని మంజూరు చేశారు.అందలి దేవాలయాల నిర్వహణను 1730 లో "ఆనంద్‌జీ కల్యాణ్‌జీ ట్రస్ట్" కు అప్పగించడం జరిగినది. పాలిటానా భారత దేశం లోని బొంబాయి ప్రెసిడెన్సీ యొక్క "కథివార్ ఏజెన్సీ" కి చెందిన రాజరిక రాష్ట్రంగా ఉండెడిది. దీని వైశాల్యం 289 చదరపు మీటర్లు, జనాభా(2011) 150,000. ఈ జనాభా గత దశాబ్దంగా 15 శాతం తగ్గినది. ఈ పట్టణ నాయకుడు "గోహిల్" రాజపుత్రుడు. ఈయనను ఠాకూర్ సాహిబ్ అని పిలుస్తారు.

(ఇంకా…)

45వ వారం

మాతా అమృతానందమయి

మాతా అమృతానందమయి దేవి హిందూ ఆధ్యాత్మిక నేత మరియు బోధకురాలు, ఆమెను భక్తులు దైవ సమానురాలుగా పూజించడంతోపాటు, "అమ్మ ", "అమ్మాచి" లేదా "తల్లి"గా కూడా పిలుస్తున్నారు. మానవతా కార్యక్రమాలు ద్వారా ఆమె ప్రసిద్ధి చెందారు. కొన్నిసార్లు ఆమెను "ఆలింగనం చేసుకునే దైవంగా" సూచిస్తున్నారు.మాతా అమృతానందమయి మఠం వైస్-ఛైర్మన్ స్వామి అమృతస్వరూపానంద పూరీ మాట్లాడుతూ, అమ్మకు ఇతరుల బాధలను తొలగించడం, తన కన్నీటిని తుడుచుకున్నంత సహజమని చెప్పారు. ఇతరుల సంతోషమే అమ్మ సంతోషం. మాతా అమృతానందమయి దేవి అసలు పేరు సుధామణి ఇడమన్నేల్, 1953లో కేరళ రాష్ట్రంలోని కొల్లామ్ జిల్లాలో అలప్పాడ్ పంచాయితీలో ఉన్న పారాయకాడవు అనే కుగ్రామంలో ఆమె జన్మించారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆమె పాఠశాల విద్య ముగిసింది, ఆపై ఆమె తన కంటే చిన్నవారైన తోబుట్టువుల ఆలనాపాలనలను చూసుకోవడం ప్రారంభించారు, పూర్తిస్థాయిలో కుటుంబానికి సంబంధించిన ఇంటి పని చేయడానికి పరిమితమయ్యారు.రోజువారీ పనుల్లో భాగంగా, సుధామణి తన కుటుంబం యొక్క ఆవులు మరియు గొర్రెలకు ఆహారం కోసం గ్రామ పరిసర ప్రాంతాలకు వెళ్లి గడ్డి తీసుకొచ్చేవారు. ఈ సమయంలోనే తీవ్ర దారిద్ర్యం మరియు ఇతరుల ఎదుర్కొంటున్న బాధలు తనను ప్రభావితం చేశాయని అమ్మ చెప్పారు. ఆపై ఆమె తన ఇంటి నుంచి ఆహారం మరియు దుస్తులను వారి కోసం తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె కుటుంబం కూడా సంపన్నమైనదేమీ కాదు, దీంతో ఆమెను కుటుంబ సభ్యులు తిట్టడం మరియు కొట్టడం వంటి ఇబ్బందులకు గురి చేశారు. అమ్మ దుఃఖంలో ఉన్నవారిని చూసిన వెంటనే వారిని ఆలింగనం చేసుకొని ఓదార్చేవారు.

(ఇంకా…)

46వ వారం

బ్రూనై

బ్రూనై అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దరుసలేమ్ లేక నేషన్ ఆఫ్ దరుసలేమ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియాలోని బొర్నియా ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది దక్షిణ చైనా సముద్రములో చైనాకు అభిముఖంగా ఉంది. ఇది మలేషియా దేశంలోని సారవాక్‌ అనే రాష్ట్రం లో ఉంది. ఇది సారవాక్‌కు చెందిన లింబాంగ్ నగరము చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బొర్నియా ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము మలేషియా మరియు ఇండోనేషియా దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4,00,000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్దములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో పోలి అనే పేరుతో రుపుదిద్దుకున్నట్లు చరిత్రకారుల అంచనా. 15వ శతాబ్దములో అది ఇస్లామ్ గా మారే ముందుగా మజాపహిత్ సామ్రాజ్యములో సామంతరాజ్యముగా అయింది. మజాపహిత్ సామ్రాజ్యము ఉచ్ఛస్థిలో ఉన్న సమయములో దీనిని సుల్తాన్ ప్రభుత్వము ఆధీనములోకి తీసుకుని దానిని సముద్రతీరంలోని ప్రస్తుత సారవాక్, సబ్బాహ్ మరియు బొర్నియా ద్వీపం ఈశాన్యంలో ఉన్న ద్వీప మాలిక అయిన సులు ఆర్చ్ ఫిలాగో వరకు విస్తరించారు. 1521లో ఫెర్డినాండ్ మెగల్లన్ నాయకత్వములో తలసోక్రసి ప్రవేశించింది. 1578లో స్పెయిన్ దేశముతో కేస్టిల్ వార్ పేరుతో యుద్ధము జరిగిన యుద్ధముతో నార్త్ బొర్నియో చార్టేడ్ కంపెనీ సారవాక్‌ నుండి జెమ్స్‌బ్రోక్ మరియు సభాహ్ వరకు స్వాధీనపరచుకోడంతో సామ్రాజ్య క్షీణదశ ఆరంభం అయింది. 1888 నాటికి బ్రూనై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలనావ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 1984 జనవరి 1వ తారీఖున యునైటెడ్ కింగ్‌డమ్ నుండి బ్రూనై పుర్తిగా స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్ధికాభివృద్ధి సాధించింది.

(ఇంకా…)

47వ వారం

సైకిల్

సైకిలు (ఆంగ్లం Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపా లో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనా లో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉన్నది. విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా. ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు. 1813 లో ఒకరోజు మాన్ హీమ్‍ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనం లో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు. ముంజేతులను ఇనుప కడ్డీలపై ఉంచాడు. ముందు చక్రానికి సంబంధించిన కొయ్య కడ్డీని చేతులతో తిప్పితే పోదలచుకున్న మార్గంలో అతడు వెళ్ళ గలుగుతున్నాడు. వీధిలో పిల్లలు కేరింతలు పెడుతూ, వాహనం వెంట పరుగెడుతున్నారు. తోటి ప్రజలు పెనుబొబ్బలు పెడుతూ అట్టహాసం చేస్తున్నారు. వీటిని లెక్కపెట్టకుండ 28 ఏళ్ళ ఆ యువకుడు మాత్రం పిచ్చివాడిలా ముందుకు సాగిపోతున్నాడు. అతడు బేడన్ ప్రభుత్వం లోని ఒక పెద్ద అధికారి కొడుకు. తన కొడుకు ఆఫీసర్ కావాలని తండ్రి ఆశించాడు. కానీ ఎక్కువ బాధ్యతలు నెత్తిన వేసుకోవటం ఇష్టంలేక బేరన్‍ డ్రే మామూలు గుమస్తాగా చేరాడు. అతనికి కొత్త విషయాలు కనుక్కోవాలనే తపన ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాల్లో అభిరుచి, ఉత్సుకత ఉన్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావటం వల్ల యాంత్రిక శాస్త్రం చదవలేకపోయాడు. ఈ నిరాశ అతనిలో మొండి పట్టుదలను పెంచింది.

(ఇంకా…)

48వ వారం

శుశృతుడు

శుశ్రుతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశ్రుతుడు, వారణాసిలో జన్మించాడు.ఇతని ప్రసిద్ధ గ్రంధం శుశ్రుత సంహిత వైదిక సంస్కృతం లో వ్రాయబడినది.ఈ శుశ్రుత సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశ్రుతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశ్రుతుడు. క్రీ.శ. 800 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశ్రుతుణ్ణి భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం సుశ్రుతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశ్రుతుడి నివాస స్థానం. శుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశ్రుతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ శుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్ర చికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్‍లను కూడా ఆవిష్కరించాడు. మూత్ర పిండంలోని రాళ్లను తొలగించడంలో చైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.

(ఇంకా…)

49వ వారం

మస్జిద్

మస్జిద్ లేక మసీదు : ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మస్జిద్ అరబ్బీ పేరు, (مسجد), బహువచనం మసాజిద్ (مساجد). సాధారణ మస్జిద్ కు, చిన్న మస్జిద్ కు మస్జిద్ అని, పెద్ద మస్జిద్ కు జామా మస్జిద్ (جامع), లేక మస్జిద్-ఎ-జామి అని అంటారు. ప్రాథమికంగా మస్జిద్ అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మస్జిద్ లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మస్జిద్ లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్-ఎ-ఖుబా మరియు మస్జిద్-ఎ-నబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి. అరబ్బీ లో మస్జిద్ అనగా సజ్దా (మోకరిల్లడం) చేయు ప్రదేశం. సజ్దా లేక సజద పదానికి మూలం 'సజ్ద్' అనగా మోకరిల్లడం (క్రియ). సాజిద్ (కర్త) అనగా సజ్దా చేయువాడు లేక మోకరిల్లువాడు. 'మస్జూద్' (కర్మ) అనగా సజ్దా చేయించుకొన్నవాడు (అల్లాహ్). 'మస్జిద్' అనగా సజ్దా చేయు ప్రదేశం.మస్జిద్ అనేపదము ఖురాన్ లో ప్రస్తావించబడినది. ఎక్కువసార్లు మక్కా నగరంలోని కాబా ప్రస్తావింపబడినది. ఖురాన్ మస్జిద్ ను ప్రార్థనాప్రదేశంగా వర్ణిస్తుంది. హదీసులు లో గూడా మస్జిద్ ప్రార్థనాలయం. ఇస్లాం ఆవిర్భవించిన మొదటలో మస్జిద్ లు విశాలమైన హాలులలో నిర్వహింపబడేవి. రాను రాను మస్జిద్ ల నిర్మాణశైలిలో ఎత్తైన మీనార్లు చోటు చేసుకొన్నవి. ఇస్లామీయ ప్రథమ 3 మస్జిద్ లు సాదాసీదా మస్జిద్ లు. తరువాతి 1000 సంవత్సరాలకాలంలో నిర్మింపబడిన మస్జిద్ లు ఇస్లామీయ నిర్మాణ శైలులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నిర్మాణ శైలులతో మిళితమై నిర్మింపబడినవి.ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం ఆదమ్ ప్రవక్త మక్కా లోని కాబా గృహాన్ని నిర్మించి ప్రథమ మస్జిద్ గా ఉపయోగించాడు.


(ఇంకా…)

50వ వారం

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

తెలుగు వికీపీడియా 11 వజన్మదినం 10 డిసెంబర్ 2013 న జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా తెలుగులో విజ్ఞానసర్వస్వ తయారీకి నడుం కట్టిన కొమర్రాజు లక్ష్మణరావు కృషికి వందేళ్ల పండగ. ఆ సందర్భంగా కొమర్రాజు లక్ష్మణరావు వ్యాసం మరల మొదటి పేజీలో ప్రదర్శితమవుతున్నది. ఈ ప్రత్యేక శుభసందర్భంగా తెలుగు వికీపీడియా మరియు సోదర తెలుగు వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన వందలాది మంది తెలుగు వారు, లక్షలమంది సహ వికీ సభ్యులకు అభినందనలు. తెలుగు వికీపీడియా కు సంబంధించి మీ అనుభవాలను మరియు వికీపీడియా భవిష్యత్తు గురించిన ఆలోచనలను అభిప్రాయాల పేజీలోని విభాగం లో తెలియచేయండి.

తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు . తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు మరియు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అనే నలుగురు మహానుభావులు తెలుగు భాషను, తెలుగు జాతిని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన నవయుగ వైతాళికులు వారు. 1877 మే 18 న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాధమిక విద్యను భువనగిరి లో పూర్తిచేశాడు.లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూరు (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు.

(ఇంకా…)

51వ వారం

సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. "దేశములోనే అతి పెద్ద గిరిజన జాతర" గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది . 12వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను' పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క ను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు కిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు.


(ఇంకా…)

52వ వారం

కన్ఫ్యూషియస్ మతం

కన్ఫ్యూషియస్ మతం అనబడునది అతని పర్యటనల, అనుభవముల , ప్రాచీన జ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా ఏర్పడినది, లౌడ్జు ను అసలు విమతస్తుడు(irreligious) అంటారు. వీరికి అసలు మతమే లేదని చెబుతారు. ఏది ఏమైనా అతని పేరుతో ఒక మతం ఉంది. ఒక తత్వం ఉంది. అతడు ఒక గొప్ప ఆలోచనాపరుడు. ఇతడి మతం చైనీయుల తత్వానికి ఒక వ్యాఖ్యానం. కన్ఫ్యూషియన్ ని చైనా భాషలో కూంగ్‌పూడ్జ్ అంటారు. ఇతడు క్రీ.పూ. 6 వ శతాబ్దానికి చెందినవాడు. క్రీ.పూ. 551 కి, 478 కి మధ్య నివసించాడని కొందరు, అతడు క్రీ.పూ 511 లో జన్మించి 469 లో మరణించాడని మరికొందరు అంటారు. ఈ శతాబ్దంలో మహా మహులైన బుద్ధుడు, జైన మహావీరుడు, లవుడ్జులు జన్మించారు. ఇతడేమీ గొప్ప పరిశోధకుడు కాదు. బుద్ధుడు లాగ సంప్రదాయ వ్యతిరేకి కాదు. తనను తాను "నూతన విషయాల ఆవిష్కర్త, సృష్టి కర్త గా కాక, కేవలం యథాస్థితిని కొనసాగించే వానిగ, ప్రాచీనతను విశ్వసించే వానిగ, ప్రేమించేవానిగ" దర్శించాడు. కేవలం ప్రాచీన జ్ఞానాన్ని ప్రచారం చేయటమే తన లక్ష్యమన్నాడు. అతడేవైనా సంస్కరణలు ప్రవేశపెడితే, అవన్నీ మనుషులను ప్రాచీన విషయాల విధానాల వైపు మళ్ళీంచటమే. అతడి బోధలన్నీ, అతడు చనిపోయిన తరువాత, అతడి అనుచరులు తమ స్మృతుల నుంచి ఏరి కూర్చారు. ఏది ఏమైనా ఆ కూర్పు నుంచి ఒక నిష్పష్టమైన తత్వం వచ్చింది. అతని జీవితాన్ని గురించి అంతగా తెలియదు. అతను బాగా చదువుకొన్నవాడై ఉండాలి. ఎందుకంటే, అతడు ఇరవై ఒకటవ యేటనే చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ముప్ఫై వ యేట రాజధానీ నగరాన్ని దర్శించి అక్కడ దేవాలయాలను, పూజలను, బలులను చూశాడు. సంప్రదాయానికి, విశ్వాసాలకు సంబంధించిన సాహిత్యాన్ని పోగు చేశాడు.


(ఇంకా…)

53వ వారం

వాము

వాము ఒక విధమైన వంటలలో ఉపయోగించే గింజలు. వాము లేదా ఓమను సంస్కృతం లో దీప్యక అని, హిందీలో అజ వాన్‌ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజే స్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. వాము భారతదేశ వాసులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా మన రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అనే అమ్మమ్మల మాటలు గుర్తుండే ఉంటాయి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండి వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలియవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.


(ఇంకా…)


ఇవి కూడా చూడండి

[మార్చు]