స్కర్వి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్కర్వి
ఇతర పేర్లుమొల్లర్స్ వ్యాధి, చీడల్స్ వ్యాధి, బార్లోస్ వ్యాధి, హైపోఆస్కార్బెమియా, విటమిన్ సి లోపం
స్కార్బుటిక్ చిగుళ్ళు, స్కర్వీ లక్షణం. దంతాల మధ్య త్రిభుజాకారంలో ఉన్న చిగుళ్ల ఎరుపును చూపుతుంది.
ప్రత్యేకతపోషకాల లోపం వలన వ్యాధులు
లక్షణాలుబలహీనత, అలసట, చేతులు కాళ్ళు నొప్పి.
కారణాలుచికిత్స లేకుండా, ఎర్ర రక్త కణాలు తగ్గడం, చిగుళ్ళ వ్యాధి, జుట్టులో మార్పులు, చర్మం నుండి రక్తస్రావం
ప్రమాద కారకములుఆహారంలో 'విటమిన్ సి' లోపం, ఆధునిక కాలంలో, మానసిక రుగ్మతలు, అసాధారణ ఆహారపు అలవాట్లు, మద్యపానం ఒంటరిగా నివసించే వృద్ధులకి
రోగనిర్ధారణ పద్ధతిశారీరక సంకేతాలు, ఎక్స్-రేలు
నివారణఆహారంలో విటమిన్ సి మూలాలు ఉన్న సిట్రస్ పండ్లు అనేక కూరగాయలు (ఎరుపు మిరియాలు, బ్రోకలీ, బంగాళాదుంపలు వంటివి చేర్చాలి.
చికిత్సవిటమిన్ సి సప్లిమెంట్లు
తరుచుదనముఅరుదు

స్కర్వి అనేది విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆమ్లం) లోపం వలన కలిగే వ్యాధి[1]. ఈ వ్యాధిలో ప్రారంభ లక్షణాలు బలహీనత, అలసట, చేతులు కాళ్ళు నొప్పి ఉంటాయి.[1] ఎటువంటి చికిత్స లేకుండా ఎర్ర రక్త కణాలు తగ్గడం, చిగుళ్ళ వ్యాధి, జుట్టులో మార్పులు, చర్మం నుండి రక్తస్రావం జరగవచ్చు[1][2]. స్కర్వీ తీవ్రతరం అయినప్పుడు గాయం నయం కాక పోవడం, వ్యక్తిత్వ మార్పులు, చివరకు సంక్రమణ వ్యాధులకు గురై లేదా రక్తస్రావం జరగడం వలన మరణం సంభవించవచ్చు.

కారణాలు

[మార్చు]

ఆహారంలో 'విటమిన్ సి' లోపం ఏర్పడిన ఒక నెల తరువాత లక్షణాలు సంభవిస్తాయి[1]. ఆధునిక కాలంలో, మానసిక రుగ్మతలు, అసాధారణ ఆహారపు అలవాట్లు, మద్యపానం, ఒంటరిగా నివసించే వృద్ధులలో స్కర్వి సాధారణంగా సంభవిస్తుంది. ప్రేగులలో అపశోషణం (మాల్ అబ్సార్ప్షన్) వలన, డయాలసిస్ చికిత్సా ప్రక్రియల వలన మరింత ప్రమాదం కలుగవచ్చు. చాలా జంతువులు తమ విటమిన్ సి ను సొంతంగా ఉత్పత్తి చేస్తాయి, మానవులు, మరికొన్ని జీవులు ఉత్పత్తి చేయవు. కొల్లాజెన్ నిర్మాణానికి విటమిన్ సి అవసరం.

రోగ నిర్ధారణ, చికిత్స

[మార్చు]

రోగనిర్ధారణ, చికిత్స సాధారణంగా శారీరక సంకేతాలు, ఎక్స్-రేలు, చికిత్స తర్వాత మెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. నోటి ద్వారా తీసుకునే విటమిన్ సి సప్లిమెంట్లతో చికిత్స జరుగుతుంది[1]. చికిత్స ప్రారంభమైన కొన్ని రోజుల్లో తరచుగా మెరుగుదల మొదలవుతుంది, పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది. ఆహారంలో విటమిన్ సి మూలాలు ఉన్న సిట్రస్ పండ్లు, అనేక కూరగాయలు (ఎరుపు మిరియాలు, బ్రోకలీ, బంగాళాదుంపలు) వంటివి చేర్చాలి. సాధారణంగా వంట చేయడం వల్ల ఆహారంలో విటమిన్ సి తగ్గుతుంది.

వ్యాధి వ్యాప్తి

[మార్చు]

స్కర్వి ప్రస్తుతం అరుదుగా కనపడుతోంది. ఇది పోషకాహార లోపం ఎక్కువగా ఉండే అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఎక్కువగా సంభవిస్తుంది. అలాంటి ప్రదేశాలలో శరణార్థుల శాతం 5 నుండి 45 శాతం అని నివేదికలు తెలియచేస్తున్నాయి [3]. స్కర్వి వ్యాధి పురాతన ఈజిప్ట్ కాలం నాటిదిగా చెపుతారు. ఇది సుదూర సముద్ర ప్రయాణాలలో, తరచుగా సంభవించి పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడానికి కారణమవుతుండేది[4]. దూర ప్రయాణాల (సెయిల్) యుగంలో, ఏమైనా ఒక నిర్దిష్ట పర్యటనలో 50 శాతం మంది నావికులు స్కర్వీతో మరణిస్తారని భావించారు[5]. బ్రిటిష్ రాయల్ నేవీ స్కాటిష్ శస్త్ర వైద్యుడు జేమ్స్ లిండ్, 1753లో సిట్రస్ పండ్లతో స్కర్వీకి విజయవంతంగా చికిత్స చేయవచ్చని నిరూపించి ఘనత సాధించాడు[6]. ఏదేమైనా, 1795 ముందు గిల్బర్ట్ బ్లేన్ వంటి ఆరోగ్య సంస్కర్తలు రాయల్ నావికాదళాన్ని దాని నావికులకు నిమ్మరసం ఇవ్వదానికి ఒప్పించాడు[5][6].

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Scurvy". GARD. 1 September 2016. Archived from the original on 26 January 2017. Retrieved 26 September 2016.
  2. "Vitamin C". Office of Dietary Supplements (in ఇంగ్లీష్). 11 February 2016. Archived from the original on 30 July 2017. Retrieved 18 July 2017.
  3. Renzaho, Andre M. N. (2016). Globalisation, Migration and Health: Challenges and Opportunities (in ఇంగ్లీష్). World Scientific. p. 94. ISBN 978-1-78326-889-4. Archived from the original on 8 September 2017.
  4. Toler, Pamela D. (2012). Mankind: The Story of All of Us (in ఇంగ్లీష్). Running Press. p. 296. ISBN 978-0762447176. Archived from the original on 8 September 2017.
  5. 5.0 5.1 Price, Catherine (2017). "The Age of Scurvy". Distillations. Vol. 3, no. 2. pp. 12–23. Archived from the original on January 24, 2021. Retrieved April 17, 2018.
  6. 6.0 6.1 Hemilä, Harri (29 May 2012). "A Brief History of Vitamin C and its Deficiency, Scurvy". Archived from the original on 9 July 2014. Retrieved 25 May 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=స్కర్వి&oldid=4360475" నుండి వెలికితీశారు