Jump to content

అమృత్‌సర్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 31°35′N 74°59′E / 31.583°N 74.983°E / 31.583; 74.983
వికీపీడియా నుండి
అమృత్‌సర్ జిల్లా
జిల్లా
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: హర్మందిర్ సాహిబ్, అత్తారి-వాఘా సరిహద్దు క్రాసింగ్, అజ్నాలా ఫోర్ట్, పుల్ కంజ్రీ వద్ద 1971 యుద్ధ స్మారకం
Located in the northwest part of the state
పంజాబ్‌లో స్థానం
Coordinates: 31°35′N 74°59′E / 31.583°N 74.983°E / 31.583; 74.983
దేసం India
రాష్ట్రంపంజాబ్
Named forఅమృత సరోవరం
ముఖ్య పట్టణంఅమృత్‌సర్
విస్తీర్ణం
 • Total2,683 కి.మీ2 (1,036 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total24,90,656
 • జనసాంద్రత930/కి.మీ2 (2,400/చ. మై.)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationPB-01(commercial) PB-02, PB-14, PB-17, PB-18, PB-81, PB-89
అక్షరాస్యత (7+)76.27%

పంజాబ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో అమృత్‌సర్ జిల్లా ఒకటి. అమృత్‌సర్ నగరం ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ జిల్లా రాష్ట్రం లోని మాఝా ప్రాంతంలో ఉంది.

2011 నాటికి ఇది లుధియానా తరువాత పంజాబ్‌లో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

బ్రిటిషు పాలనా కాలంలో అమృత్‌సర్ జిల్లా, లాహోర్ డివిజన్‌లో భాగంగా ఉండేది. పరిపాలనాపరంగా అమృత్‌సర్, అజ్నాలా, తరన్ తారన్ అనే 3 తహసీళ్ళుగా విభజించబడి ఉండేది. [2] అయితే, 1947 లో భారతదేశ విభజనలో భాగంగా అమృత్‌సర్ జిల్లాను మిగతా డివిజన్ నుండి వేరుచేసి భారతదేశంలో చేర్చారు. అయితే, పట్టి, ఖేమ్ కరణ్ వంటి కొన్ని భాగాలు లాహోర్ జిల్లాకి చెందినప్పటికీ, విభజనలో ఈ పట్టణాలు అమృత్‌సర్ జిల్లాలో భాగమయ్యాయి. విభజన కాలంలో, జిల్లాలోని ముస్లిం జనాభా 46% పాకిస్తాన్కు తరలిపోయింది. కొత్తగా సృష్టించిన పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ నుండి హిందువులు, సిక్కులు భారత్ వైపు వలస వచ్చారు. 1947 అమృత్‌సర్ జిల్లాలో విభజనకు ముందు జనాభాలో 52% టొ సిక్కులు, హిందువులు (37%, 15.38%) మెజారిటీగా ఉందెవారు.

జనాభా వివరాలు

[మార్చు]
అమృత్‌సర్ జిల్లాలో మతం[3]
మతం శాతం
సిక్కు మతం
  
68.94%
హిందూ మతం
  
27.74%
క్రైస్తవం
  
2.18%
ఇస్లాం
  
0.50%
ఇతరులు
  
0.64%

2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లా జనాభా 24,90,656, [1] ఇది కువైట్ దేశానికి [4] లేదా అమెరికా రాష్ట్రమైన నెవాడాకు సమానం. [5] అమృత్‌సర్ జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 16,84,770 (67.6%). అందులో 9,32,981 (70.8%) పురుష అక్షరాస్యులు, 751,789 (64.1%) మహిళా అక్షరాస్యులు. జిల్లాలో 7 వ తరగతి, ఆ పైన చదివిన వారు 76.27%. ప్రతి 1,000 మంది పురుషులకు 889 మంది స్త్రీలున్నారు. మొత్తం షెడ్యూల్డ్ కుల జనాభా 7,70,864. 2011 లో జిల్లాలో 4,88,898 గృహాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, సిక్కులు జనాభాలో 69% ఉండగా, హిందువులు 28%, కొద్దిమంది మైనారిటీ క్రైస్తవులు (2%), ముస్లింలు ఉన్నారు .

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19017,64,821—    
19116,57,936−14.0%
19216,94,261+5.5%
19318,34,497+20.2%
194110,44,457+25.2%
19518,80,667−15.7%
196110,10,093+14.7%
197112,09,374+19.7%
198114,60,497+20.8%
199116,98,090+16.3%
200121,57,020+27.0%
201124,90,656+15.5%

జిల్లాలో తహసీళ్ళు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లాలో నాలుగు తహసీళ్ళు ఉన్నాయి.

# తహసీలు జిల్లా
1 అమృత్‌సర్- II అమృత్‌సర్
2 అజ్నాలా అమృత్‌సర్
3 బాబా బకాలా అమృత్‌సర్
4 అమృత్‌సర్ -I అమృత్‌సర్

వాతావరణం

[మార్చు]

అమృత్‌సర్‌లో సెమీ అరిడ్ (అర్థ శుష్క) వాతావరణం ఉంటుంది. ఇది వాయవ్య భారతదేశానికి ప్రత్యేకమైన వాతావరణం ఇది. ఇక్కడ ప్రధానంగా నాలుగు ఋతువులుంటాయి: శీతాకాలం (డిసెంబరు నుండి మార్చి వరకు, ఉష్ణోగ్రతలు −1 °C (30 °F) కి పడిపోతాయి, వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) - ఉష్ణోగ్రతలు 45 °C (113 °F) వరకూ చేరుకోవచ్చు, వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబరు వరకు), వర్షాకాలం తరువాత (అక్టోబరు నుండి నవంబరు వరకు). వార్షిక వర్షపాతం 703.4 మి.మీ. [6] జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత −3.6 °C (25.5 °F) 1996 డిసెంబరు 9 న నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత 47.8 °C (118.0 °F), 1995 జూన్ 9 న నమోదింది. [7] నగరానికి అధికారిక వాతావరణ కేంద్రం రాజాసాన్సీలోని విమానాశ్రయంలో ఉంది. 1947 నవంబరు 15 నుండీ ఇక్కడ శీతోష్ణస్థితి రికార్డులు ఉన్నాయి.

శీతోష్ణస్థితి డేటా - Amritsar Airport
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 26.8
(80.2)
32.2
(90.0)
36.2
(97.2)
44.1
(111.4)
47.7
(117.9)
47.8
(118.0)
45.6
(114.1)
40.7
(105.3)
40.6
(105.1)
38.3
(100.9)
34.2
(93.6)
28.5
(83.3)
47.8
(118.0)
సగటు గరిష్ఠ °C (°F) 23
(73)
26.1
(79.0)
32
(90)
40.5
(104.9)
44
(111)
44.1
(111.4)
39.8
(103.6)
37.1
(98.8)
36.8
(98.2)
35.5
(95.9)
30.5
(86.9)
24.9
(76.8)
45.2
(113.4)
సగటు అధిక °C (°F) 18.4
(65.1)
21.7
(71.1)
26.8
(80.2)
34.2
(93.6)
39
(102)
39
(102)
35
(95)
34.2
(93.6)
34.1
(93.4)
32
(90)
27.1
(80.8)
21.1
(70.0)
30.2
(86.4)
సగటు అల్ప °C (°F) 3.4
(38.1)
6.3
(43.3)
10.9
(51.6)
16.1
(61.0)
21.3
(70.3)
24.3
(75.7)
25.3
(77.5)
24.9
(76.8)
22.1
(71.8)
15.4
(59.7)
8.7
(47.7)
4.1
(39.4)
15.2
(59.4)
సగటు కనిష్ఠ °C (°F) −0.5
(31.1)
1.7
(35.1)
5.6
(42.1)
10.2
(50.4)
15.8
(60.4)
19.6
(67.3)
21.7
(71.1)
21.4
(70.5)
17.8
(64.0)
10.7
(51.3)
4.2
(39.6)
0.1
(32.2)
−1.2
(29.8)
అత్యల్ప రికార్డు °C (°F) −2.9
(26.8)
−2.6
(27.3)
2
(36)
6.4
(43.5)
9.6
(49.3)
15.6
(60.1)
18.2
(64.8)
18.8
(65.8)
13
(55)
7.3
(45.1)
−0.6
(30.9)
−3.6
(25.5)
−3.6
(25.5)
సగటు వర్షపాతం mm (inches) 26.2
(1.03)
38.6
(1.52)
38.4
(1.51)
21.4
(0.84)
26.7
(1.05)
61.2
(2.41)
210.1
(8.27)
167.3
(6.59)
77.5
(3.05)
16.1
(0.63)
6.3
(0.25)
13.6
(0.54)
703.4
(27.69)
సగటు వర్షపాతపు రోజులు (≥ 1.0 mm) 2.1 3.3 3.2 2 2.4 3.8 8.6 6.9 3.5 1.1 0.6 1.4 38.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 74 70 64 47 38 48 72 77 69 67 73 76 65
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 181.7 192.7 219.4 265.0 294.7 269.0 215.5 227.7 240.8 253.2 220.1 182.2 2,762
Source: [8][9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Amritsar district". censusindia.gov.in. Retrieved 12 October 2019.
  2. "Imperial Gazetteer2 of India, Volume 5, page 319 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library".
  3. "C-1 Population By Religious Community Data - Census 2011 - Amritsar district, Punjab". censusindia.gov.in.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Kuwait 2,595,62
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011. Nevada 2,700,551
  6. "Amritsar Climate Normals 1981-2010" (PDF). Indian Meteorological Department, Pune. Retrieved 31 March 2020.
  7. "Amritsar Climate Normals 1981-2010" (PDF). Indian Meteorological Department, Pune. Retrieved 31 March 2020.
  8. "Amritsar Climate Normals 1981-2010" (PDF). Indian Meteorological Department, Pune. Retrieved 31 March 2020.
  9. "Amritsar Climate Normals 1971–1990". National Oceanic and Atmospheric Administration. Retrieved 11 January 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]