మొహాలీ జిల్లా
మొహాలీ జిల్లా
సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబు |
ముఖ్య పట్టణం | సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ |
విస్తీర్ణం | |
• Total | 1,092.64 కి.మీ2 (421.87 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 6,98,317 |
• జనసాంద్రత | 640/కి.మీ2 (1,700/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-PB-SA |
పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో మొహాలీ జిల్లా పద్దెనిమిదవది. అధికారికంగా దీన్ని సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా అంటారు. ఈ జిల్లా 2006 ఏప్రిల్‌లో ఉనికి లోకి వచ్చింది.[1] పంజాబు జిల్లాల్లో అతి తక్కువ జనాభా గల జిల్లాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పఠాన్‌కోట్ జిల్లా ఉంది.
విద్య
[మార్చు]చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంస్థకు చెందిన ఇంజనీరింగు కళాశాల జిల్లా ప్రధాన కేంద్రం మొహాలీ నగరంలో ఉంది
విభాగాలు
[మార్చు]ఖరర్
[మార్చు]ఖరర్ బ్లాకులో 154 గ్రామాలు, 2 పట్టణాలు (అజిత్గర్, ఖరర్), 4 నిర్జనగ్రామాలు ఉన్నాయి. 2001 జనసంఖ్య 369,798, గ్రామీణ జనసంఖ్య 196,044, పురుషుల సంఖ్య 106,688, స్త్రీల సంఖ్య 89,356. ఎస్.సి జనసంఖ్య 55,544. బ్లాకు వైశాల్యం 411.32 చ.కి.మీ. గ్రామీణ వైశాల్యం 383.26 చ.కి.మీ.
బ్లాకులో 86 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 57 కమర్షియల్ బ్యాంకులు, 13 ప్రైవేట్ బ్యాంకులు, 11 కోపరేటివ్ బ్యాంకులు, 4 పంజాబు గ్రామీణ బ్యాంకులు, 1 వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ఉన్నాయి. ఎస్.ఎ.ఎస్ నగర్ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధిచేస్తుంది.
మజ్రి
[మార్చు]ఖరర్ బ్లాకులో 116 గ్రామాలు, 1 పట్టణం (కురులి) జనసంఖ్య 23,047, 1 నిర్జనగ్రామం ఉన్నాయి. 2001 జనసంఖ్య 369,798, గ్రామీణ జనసంఖ్య 88551, పురుషుల సంఖ్య 47,892, స్త్రీల సంఖ్య 40,659 . ఎస్.సి జనసంఖ్య 25,531. బ్లాకు వైశాల్యం 274.84 చ.కి.మీ.
బ్లాకులో 16 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 9 కమర్షియల్ బ్యాంకు శాఖలు ఉన్నాయి. 5 ఎస్.ఎ.ఎస్ నగర్ సెంట్రల్ కోపరేటివ్ బ్యాంకు శాఖలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ సహకారంతో కురులి సమీపంలోబృహత్తర, చిన్నతరహా పరిశ్రమలు స్థాపినచబడ్డాయి.
డెర బస్సి
[మార్చు]ఖరర్ బ్లాకులో 144 గ్రామాలు, 2 పట్టణాలు (జిరక్పూర్, డెరాబస్సి), 6 నిర్జనగ్రామాలు ఉన్నాయి. 2001 జనసంఖ్య 216,921, గ్రామీణ జనసంఖ్య 170192, పురుషుల సంఖ్య 93,116, స్త్రీల సంఖ్య 77,076 . ఎస్.సి జనసంఖ్య 48,683. బ్లాకు వైశాల్యం 406.48 చ.కి.మీ. గ్రామీణ వైశాల్యం 371.17 చ.కి.మీ.
బ్లాకులో 86 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 19 కమర్షియల్ బ్యాంకులు, 1ప్రైవేట్ బ్యాంకులు, 3 కోపరేటివ్ బ్యాంకులు, 4 మాల్వా గ్రామీణ బ్యాంకులు, జిరాక్పూర్ వద్ద 1 వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ఉన్నాయి. ఇది అతివేగంగా అభివృద్ధి చెందుతూ చంఢీగఢ్ మహానగరంలో భాగంగా మారింది.డెరాబస్సీ బ్లాకులో పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. రసాయన రంగులు, స్టీలు ట్యూబులు, ప్లైవుడ్, చేనేత పరిశ్రమలు ప్రధానంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి.
అజిత్ఘర్ జిల్లా ప్రాంతాలు
[మార్చు]జిల్లా పరిధిలో ప్రాంతాలు:
- ఖరర్ లేదా ముండి
- జిరాక్పూర్
- బకర్పూర్
- భంఖర్పూర్
- బనూర్
- డోయాన్
- ధకోలి
- అజిత్ఘర్
- ముబరిక్ పుర్
- సొహానా
- కురలి
- కుంభ్రా
- మోరిండా సిటీ (రోపార్)
- మత్తౌర్
- తెవార్ (తియార్)
- లాల్రు
- ఝండే మజ్రా
2011 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 986,147, [2] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | మొంటానా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 450వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 830 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 32.02%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 878:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అల్పం |
అక్షరాస్యత శాతం. | 84.9%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు
[మార్చు]- ↑ "About NIC District Centre S.A.S. NAGAR (MOHALI)". Archived from the original on 2012-02-16. Retrieved 2014-08-25.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Montana 989,415