ఫాజిల్కా జిల్లా
Appearance
ఫాజిల్కా జిల్లా
ਫਾਜ਼ਿਲਕਾ ਜ਼ਿਲਾ | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాల్లో ఫాజిల్కా జిల్లా ఒకటి. ఫాజిల్కా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లాలో పెద్ద పట్టణం అబోహర్.
చరిత్ర
[మార్చు]ఫాజిల్కా పంజాబు రాష్ట్రంలో 21వ జిల్లాగా అవతరించింది. ఫిరోజ్‌పూర్ జిల్లా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఫాజిల్కా జిల్లాను ఏర్పాటు చేసారు.
స్థానం
[మార్చు]ఫాజిల్కా భారత - పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఫిరోజ్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో ముక్త్‌సర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజస్థాన్, పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]ఫాజిల్కా జిల్లా వాతావరణం తీవ్రంగా ఉంటుంది. వేసవిలో అత్యధికంగా వేడి ఉంటుంది. శీతాకాలంలో అత్యంత చలి ఉంటుంది. జిల్లా గుండా ప్రవహిస్తున్న సట్లెజ్ నది భారత్ - పాకిస్థాన్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో ప్రవేశిస్తుంది.
నిర్వహణ
[మార్చు]జిల్లాలోని ఉపవిభాగాలు:
- ఫాజిల్కా
- అబోహర్
- జలాలాబాద్ (ఫిరోజ్‌పూర్)
- ఫాజిల్కా జిల్లాలో అబోహర్ నగరం పెద్దది.