మణిపూర్ జిల్లాల జాబితా
Appearance
భారతదేశ రాష్ట్రమైన మణిపూర్‌లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. [1]2016 డిసెంబరుకు ముందు 9 జిల్లాలు ఉన్నాయి. 2016 డిసెంబరు 9 న, ప్రభుత్వం 7 కొత్త జిల్లాలను సృష్టించింది. వాటితో రాష్ట్రం లోని మొత్తం జిల్లాల సంఖ్య 16కు (2023 ఏప్రిల్ నాటికి)చేరుకుంది.[2][3]
జిల్లా పరిపాలన
[మార్చు]భారతీయ రాష్ట్రానికి చెందిన జిల్లా అనేది జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి నేతృత్వంలోని పరిపాలనా భౌగోళిక ప్రాంతం. జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమీషనర్‌కు రాష్ట్ర పరిపాలనా సేవలలోని వివిధ విభాగాలకు చెందిన అనేక మంది అధికారులు పరిపాలనలో సహాయం చేస్తారు.
శాంతి భద్రతలు
[మార్చు]పోలీసు సూపరింటెండెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అధికారికి శాంతిభద్రతలు, సంబంధిత సమస్యలను నిర్వహించే బాధ్యతను అప్పగించారు.
మణిపూర్ జిల్లాలు జాబితా
[మార్చు]సంఖ్య | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం
(కి.మీ.²) |
జన సాంద్రత(కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | BI | బిష్ణుపూర్ జిల్లా | బిష్ణుపూర్ | 2,40,363 | 496 | 415 |
2 | CD | చందేల్ జిల్లా | చందేల్ | 1,44,028 | 3,317 | 37 |
3 | CC | చురచంద్‌పూర్ జిల్లా | చురచంద్‌పూర్ | 2,71,274 | 4,574 | 50 |
4 | EI | ఇంఫాల్ తూర్పు జిల్లా | పోరోంపాట్ | 4,52,661 | 710 | 555 |
5 | WI | ఇంఫాల్ పశ్చిమ జిల్లా | లాంఫెల్‌పాట్ | 5,14,683 | 519 | 847 |
6 | JBM | జిరిబం జిల్లా | జిరిబం | 43,818 | 232 | 190 |
7 | KAK | కాక్‌చింగ్ జిల్లా | కాక్‌చింగ్ | 1,35,481 | – | – |
8 | KJ | కాంజోంగ్ జిల్లా | కాంజోంగ్ | 45,616 | 2,000 | 23 |
9 | KPI | కాంగ్‌పోక్‌పి జిల్లా | కాంగ్‌పోక్‌పి | – | – | – |
10 | NL | నోనె జిల్లా | నోనె | – | – | – |
11 | PZ | ఫెర్జాల్ జిల్లా | ఫెర్జాల్ | 47,250 | 2,285 | 21 |
12 | SE | సేనాపతి జిల్లా | సేనాపతి | 3,54,772 | 3,269 | 116 |
13 | TA | తమెంగ్‌లాంగ్ జిల్లా | తమెంగ్‌లాంగ్ | 1,40,143 | 4,391 | 25 |
14 | TNL | తెంగ్‌నౌపల్ జిల్లా | తెంగ్‌నౌపల్ | – | – | – |
15 | TH | తౌబాల్ జిల్లా | తౌబాల్ | 4,20,517 | 514 | 713 |
16 | UK | ఉఖ్రుల్ జిల్లా | ఉఖ్రుల్ | 1,83,115 | 4,547 | 31 |
మూలాలు
[మార్చు]- ↑ "Profile | NIC Manipur State Centre | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-12.
- ↑ "Simply put: Seven new districts that set Manipur ablaze". 20 December 2016.
- ↑ List, The Nation. "Administrative Division-wise List of Districts in India | India has 779 Districts In 28 States and 8 Union Territories (UTs)". The Nation List (in ఇంగ్లీష్). Archived from the original on 2024-02-22. Retrieved 2023-10-12.