Jump to content

మిస్సోరి నది

వికీపీడియా నుండి
ఉదయం మోంటానాలోని మిస్సౌరీ నదికి డ్రోన్ షాట్

మిస్సోరి ఉత్తర అమెరికాలో కెల్లా అత్యంత పొడవైన నది.[1] పశ్చిమ మోంటానా లోని రాకీ పర్వతాలలో ఉద్భవించిన మిస్సోరీ నది, తూర్పు, దక్షిణ దిక్కుల వైపుగా 3,767 కి.మీ. దూరం ప్రవహించి, సెయింట్ లూయిస్ నగరానికి ఉత్తరాన మిసిసిపి నదిలోకి కలుస్తుంది. ఈ నదికి 13 లక్షల చ.కి.మీ. పైచిలుకు పరీవాహక ప్రాంతం ఉంది. ఇందులో పది యు.ఎస్ రాష్ట్రాలు, రెండు కెనడా ప్రాంతాలూ ఉన్నాయి.

మిసిసిపీ నదికి ఉపనది ఐనప్పటికీ, మిస్సోరీ చాలా పొడవైన నది[2] చాలా పెద్ద మొత్తంలో నీటిని తీసుకెళ్తుంది.[3][4] దిగువనున్న మిసిసిపి నదితో కలుపుకుంటే, ఇది ప్రపంచంలో నాలుగో అత్యంత పొడవైన నదీ వ్యవస్థ అవుతుంది.[1]

19 వ శతాబ్దంలో పశ్చిమ దిశలో సాగిన అమెరికా విస్తరణకు మిస్సోరి ఒక ప్రధానమైన మార్గం.ఆ శతాబ్దం తొలినాళ్ళలో వ్యాపించిన ఉన్ని వ్యాపారం ఈ విస్తరణకు పునాది వేసింది. 1830 ల నాటికి తొలి మార్గదర్శకులు గుంపులు గుంపులుగా పశ్చిమానికి బయల్దేరారు. తొలుత వీరు తమ ప్రయాణాలకు సవారీ వాగన్లను వాడారు. ఆ తరువాత స్టీమ్‌పడవలపై ప్రయాణించారు. ఈ వలసదారులు మిస్సోరీ నదీ పరీవాహకప్రాంతం లోని స్థానిక ఇండియన్ అమెరికనుల భూములను ఆక్రమించారు. ఇది, అమెరికా చరిత్రలోనే స్థానిక అమెరికనులపై అత్యంత హింసాత్మకమైన, సుదీర్ఘ కాలం పాటు సాగిన యుద్ధాలకు దారితీసింది.

20 వ శతాబ్దంలో మిస్సోరి బేసిన్ను సాగునీటి కోసం, వరద నియంత్రణ కోసం, విద్యుదుత్పత్తి కోసం విస్తృతంగా అభివృద్ధి చేసారు. దీనిపై 15 ఆనకట్టలు నిర్మించారు. దీని ఉపనదులపై వందల ఆనకట్టలను నిర్మించారు. నౌకాయానాన్ని అభివృద్ధి చేసేందుకు మియాండర్లను కోసేసి, ప్రవాహాన్ని మళ్ళించారు. ఈ క్రమంలో నది పొడవు 320 కి.మీ. తగ్గింది. ఈ అభివృద్ధి కారణంగా దిగువ మిస్సోరి లోయ ప్రస్తుతం వ్యావసాయికంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఈ అభివృద్ధి చేపలకు, వన్యప్రాణులకూ సంకటంగా మారింది. నీటి నాణ్యత తగ్గిపోయింది.

ఉపనదులు

[మార్చు]

మిస్సోరీకి 95 చెప్పుకోదగ్గ ఉపనదులున్నాయి. చిన్నచిన్న ఉపనదులు వందల కొద్దీ ఉన్నాయి. పెద్ద ఉపనదులు చాలావరకు నది చివరి భాగంలో, సంగమానికి దగ్గర్లో కలుస్తాయి.[5] ఉపనదుల్లో ఎక్కువ శాతం పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. జేమ్స్, బిగ్ సియోక్స్, గ్రాండ్ రివర్ వంటివి మాత్రం ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తాయి.[6]

ఎల్లోస్టోన్, ది ప్లాట్, స్మోకీ హిల్, ఓసేజ్ లు ప్రవాహం రీత్యా మిస్సోరీ ఉపనదుల్లో అతి పెద్దవి. ఇవన్నీ ఒక్కొక్కటీ 1,30,000 చ.కి.మీ. కంటే పెద్ద పరీవాహకప్రాంతం కలిగినవి. వీటి ప్రవాహం 140 మీ3/సె కు పైబడి ఉంటుంది.[7][8] ప్లాట్ నది ఉపనదులన్నిటి లోకి పొడవైనది, అత్యధిక పరీవాహకప్రాంతం కలిగినది. కానీ ఎల్లోస్టోన్ నది అత్యధిక ప్రవాహం కలిగినది. 390 మీ3/సె ఉండే దీని ప్రవాహం మిస్సోరీ మొత్తం ప్రవాహంలో 16% ఉంటుంది, ఇది ప్లాట్ ప్రవాహానికి రెట్టింపు ఉంటుంది.[9] ఉపనదులన్నిటి లోకి రో రివర్ అతి చిన్నది. దీని పొడవు 61 మీటర్లు మాత్రమే ఉంటుంది.[10]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Howard Perlman, USGS (October 31, 2012). "Lengths of major rivers, from USGS Water-Science School". Ga.water.usgs.gov. Archived from the original on 2014-03-09. Retrieved November 21, 2012.
  2. "Boundary Descriptions and Names of Regions, Subregions, Accounting Units and Cataloging Units". U.S. Geological Survey. Archived from the original on April 27, 2012. Retrieved March 5, 2011.
  3. "USGS Gage #06934500 on the Missouri River at Hermann, Missouri: Water-Data Report 2009" (PDF). National Water Information System. U.S. Geological Survey. 1897–2009. Archived from the original (PDF) on 2012-05-20. Retrieved August 24, 2010.
  4. "USGS Gage #07010000 on the Mississippi River at St. Louis, Missouri: Water-Data Report 2009" (PDF). National Water Information System. U.S. Geological Survey. 1861–2009. Archived from the original (PDF) on 2011-11-04. Retrieved August 24, 2010. Note: This gauge is just below the Missouri confluence, so the Missouri discharge was subtracted from 190,000 cubic feet per second (5,400 m3/s) to get this amount.
  5. Stone, Clifton. "Missouri River". The Natural Source. Northern State University. Archived from the original on June 25, 2013. Retrieved July 10, 2011.
  6. "Missouri River Mainstem Reservoir System Master Water Control Manual". U.S. Army Corps of Engineers. University of Nebraska Lincoln Digital Commons. January 1, 2006. Archived from the original on May 16, 2012. Retrieved January 15, 2012.
  7. "Boundary Descriptions and Names of Regions, Subregions, Accounting Units and Cataloging Units". U.S. Geological Survey. Archived from the original on April 27, 2012. Retrieved March 5, 2011.
  8. Kammerer, J.C. (May 1990). "Largest Rivers in the United States". U.S. Geological Survey. Archived from the original on January 29, 2017. Retrieved March 5, 2011.
  9. "USGS Gage #06805500 on the Platte River at Louisville, NE" (PDF). National Water Information System. U.S. Geological Survey. 1953–2009. Archived from the original (PDF) on 2012-05-20. Retrieved March 5, 2011.
  10. McFarlan and McWhirter, p. 32