Jump to content

గోపాల్‌గంజ్ జిల్లా

వికీపీడియా నుండి
Gopalganj,گوپال گنج ضلع జిల్లా
गोपालगंज जि ला sikmi
బీహార్ పటంలో Gopalganj,گوپال گنج ضلع జిల్లా స్థానం
బీహార్ పటంలో Gopalganj,گوپال گنج ضلع జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుసారణ్
ముఖ్య పట్టణంగోపాల్‌గంజ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుగోపాల్‌గంజ్
విస్తీర్ణం
 • మొత్తం4,000 కి.మీ2 (2,000 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం25,58,037
 • జనసాంద్రత640/కి.మీ2 (1,700/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.04 %
 • లింగ నిష్పత్తి1015
ప్రధాన రహదార్లుNH-28
Websiteఅధికారిక జాలస్థలి
థావే మందిర్ వెలుపలి భాగం

బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో గోపాల్‌గంజ్ జిల్లా (హిందీ:) ఒకటి. గోపాల్‌గంజ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.గోపాల్‌గంజ్ జిల్లా సారణ్ డివిజన్‌లో భాగం. జిల్లాలో భోజ్‌పురి, ఉర్దు, హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

పురాతన మల్లియా రాజాస్థానం గోపాల్‌గంజ్ ప్రాంత పూర్వీకులు అని భావిస్తున్నారు. చరిత్రకాలానికి ముందు గోపాల్‌గంజ్ శివన్ జిల్లా సరిహద్దులో ఉన్న సరయు నది వరకు నేపాల్లో భాగంగా ఉండేది. శివాన్ అంటే సరిహద్దు అని అర్ధం. మునుపటి నేపాల్ రాజ్యానికి శివన్ దక్షిణ సరిహద్దుగా ఉండేది. 1875లో గోపాల్‌గంజ్ చిన్న కుగ్రామంగా ఉండేది. తరువాత ఇది సారణ్ జిల్లా ఉపవిభాగంగా చేయబడింది. 1973 అక్టోబరు 2 న ఇది ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది. పాత సారణ్ జిల్లాలో ప్రస్తుత సారణ్, శివన్, గోపాల్‌గంజ్ ఉండేవి. గోపాల్‌గంజ్ చరిత్ర సారణ్‌జిల్లా చరిత్రలో భాగం. సమైక్య సారణ్ ఆర్యసంప్రదాయ ప్రాంతాలలో ప్రధానమైనదని భావిస్తున్నారు..

వేదకాలం

[మార్చు]

వేదకాల సాహిత్యంలో నిక్షిప్తమైన ఆర్య సంప్రదాయం అనుసరించి విదేహులు సరస్వతి నుండి తూర్పువైపు పయనించి గందక్ నదీతీరానికి చేరుకున్నారు. అక్కడ వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై నదికి తూర్పు తీరంలో నివసించమని చెప్పాడు. విదేహులు అగ్నిదేవుని మాటను అనుసరించి నదిని దాటి నది తూర్పు తీరంలో రాజ్యస్థాపన చేసుకున్నారు. అయితే కొందరు సారణ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారిలో అత్యధికులు గంధక్ నదిని దాటి రాజ్యస్థాపనలో పాలుపంచుకున్నారు. 1976లో సారణ్ జిల్లా నుండి వేరు చేసిన తరువాత గోపాల్‌గంజ్ పూర్తిస్థాయి జిల్లా అయింది. .[1]

భౌగోళికం

[మార్చు]

గోపాల్‌గంజ్ జిల్లా వైశాల్యం 2033 చ.కి.మీ.[2] ఇది స్పెయిన్ లోని టెనరిఫ్ ద్వీప వైశాల్యానికి సమానం.[3] జిల్లా భౌగోళికంగా రెండుగా విభజించబడింది. సాధారణ ప్రాంతం, వరదబాధితమైన దిగువభూములు. జిల్లాలోని గొపల్గంజ్, కుచయ్కొత్ మంజా, సిధ్వలీ, బరౌలి, బైకుంథ్పుర్ మొదలైన 6 మండలాలు వరదబాధితమైన దిగువభూములలో ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతాలు నీటిలో మునుగుతుంటాయి. మిగిలిన భూములు పచ్చగా వ్యవసాయ యోగ్యంగా ఉంటాయి. జిల్లా 26° 12 నుండి 26° 39 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83° 54 నుండి 84° 55 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంటుంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,149,343.

పరిసర జిల్లాలకు

[మార్చు]
  • నార్త్ ఈస్ట్ & వెస్ట్ చంపారన్ జిల్లా
  • సౌత్: Siwan & Chappra జిల్లా
  • ఈస్ట్: తూర్పు చంపారణ్ & ముజఫర్ జిల్లా
  • వెస్ట్: (డెఒరియా & కుషినగర్) ఉత్తర ప్రదేశ్

ప్రధాన నగర ప్రాంతాలు

[మార్చు]

గొపల్గంజ్, సిధ్వలియ, దిఘ్వ దుబౌలి, థవే (బ్లాక్), హథువ (బ్లాక్), మిర్గంజ్, బరౌలి, చవహి తక్కి, కతెయ, విజైపుర్, మఝౌలీ బజార్, జలాల్పూర్, కుచైకొతె, సాసా ముసా, సిపయ బజార్ మంజా గఢ్ (బ్లాక్), పిప్ర, సవ్రెజి, ఉచకగోన్ (బ్లాక్), కపర్పుర, ఫుల్వరీ, సొంగ్ధవ, హుస్సెపుర్, సిస్వ, ఉజ్ర నర్యంపుర్, పంచ్దెవరి బజార్ (బ్లాక్), భొరే బజార్ (బ్లాక్), హుస్సెపుర్, సిస్వ, బంసి బత్రహ, మిశ్రా బత్రహ, మిరల్లిపుర్, మహ్హమద్పుర్, బధెయ, బర్హిమ, దుమరియ, గోపాల్పూర్, కొఇని, బైకుంథ్పుర్ (బ్లాక్), రజపత్తి కోఠి, సొన్వలీ, జమునహ బజార్.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన భోరే మూడు వైపులా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంటుంది. భోరెలో విద్యకు సమస్త సౌకర్యాలు ఉన్నాయి. అలాగే వైద్య సౌకర్యం, మార్జెట్ వసతులు కూడా ఉన్నాయి.

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం వేడి - పొడి
గరిష్ఠ ఉష్ణోగ్రత 45 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 10 ° సెల్షియస్
శీతాకాల ఉష్ణోగ్రత ఆహ్లాదకరం
వర్షాకాల వర్షపాతం 500మి.మీ
సరాసరి వర్షపాతం 290 మి.మీ

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గోపాల్‌గంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

పరిశ్రమలు

[మార్చు]

జిల్లాలో 3 చక్కెర మిల్లులు (భారత్ షుగర్ మిల్లు, సాస మూస షుగర్ మిల్లు వర్క్స్ లిమిటెడ్, విష్ణు సాగర్ మిల్లులు), ఒక వై ఫ్యాక్టరీ ఉన్నాయి.

బ్యాంకింగ్

[మార్చు]

జిల్లాలో 5 జాతీయ బ్యాంకులు, 2 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్.బి.ఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఎ.టి.ఎం ) సౌకర్యాలు అందింస్తుంది. ఎస్.బి.ఐ గోపాల్‌గంజ్ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అందిస్తుంది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

నగరంలో ప్రయాణసౌకర్యాల కొరత అధికంగా ఉంది. ప్రజలు అధికంగా ప్రైవేట్ ట్రాంస్‌పోర్ట్ మీద అధ్హరపడుతుంటారు. టాక్సి కేబ్, ఆటో రిక్షా నగరమంతటా లభిస్తుంటాయి. ఇరుకైన, రద్దీ అయిన రహదార్లు వివిధ రకాల వాహనాలు తిరగడం కారణంగా నగర ట్రాఫిక్‌ను క్లిష్టం చేస్తున్నాయి.

రైలు మార్గం

[మార్చు]

జిల్లా లూప్ లైన్ ద్వారా చప్రాతో అనుసంధానమై ఉంది. గోపాల్‌గంజ్ లో రైల్వే జంక్షన్ ఉంది.

వాయు మార్గం

[మార్చు]

" సబేయన్ హవాయి అడ్డా " విమానాశ్రయం ఉన్నప్పటికీ ఇది ప్రస్తుతం వాడుకలో లేదు.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,558,037,[5]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 163 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 258 .[5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.83%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 1015: 1000 [5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 67.04%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

f

2010 గణాంకాలు:-

  • జనసంఖ్య: 2,558,037 (2.62% of the state)[8]
  • జనసాంద్రత: 1258
  • పురుషులు: 1,269,677 (49.89%)
  • స్త్రీలు: 1,288,360 (50.12%)
  • పట్టణ జనాభా: 130,536 (6.07%)
  • గ్రామీణ జనాభా: 2,018,807 (93.93%)
  • షెడ్యూల్డ్ కులాల %: 12,43%
  • షెడ్యూల్డ్ తెగల %: 0.29%
  • స్త్రీ: పురుష నిష్పత్తి: 1015: 1000 బీహార్ రాష్ట్రంలో అత్యధిక.

సంస్కృతి

[మార్చు]
Thawe Durga Mandir Temple of goddess Durga
  • ఉత్సవాలు పండుగలు :- జిల్లాలో ప్రధానంగా 4 ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రమంతటి నుండి భక్తులు వస్తుంటారు. జిల్లాలో శ్రీరామనవమి,హోళీ ఉత్సవం (గోపాల్‌గంజ్),మొహరం (మధ్వాలాల్ మిర్గంజ్) ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలలో దేశమంతటి నుండి ప్రజలు పాల్గొంటారు. ఆశ్వీజమాసంలో దసరా సందర్భంలో నవరాత్రి - గోపాల్‌గంజ్‌లో మహాలక్ష్మీ ఉత్సవం నిర్వహించబడుతుంది. దీపావళి పండుగ కూడా జిల్లాలో ఉత్సాహవంతంగా నిర్వహించబడుతుంది.

థావె

[మార్చు]

జిల్లాలో థావే దుర్గా మందిర్ జలాల్‌పూర్ దుర్గ, కృష్ణ ఆలయాలు చాలా ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. యువకులను విద్యావంతులను చేయడానికి జిల్లాలో మదరసా ఒకటి ఉంది. జిల్లాలో భోజ్‌పురి, హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లాలో థవె, జలాల్పూర్, దిఘ్వ దుబౌలి, హుసెపుర్, లక్ది దర్గా, విజైపుర్ (హనుమాన్ మందిర్ & కౌథ్వలీ బాబా), షివ్పుర్ (లచ్హ్వర్) దుర్గాదేవి మందిరం వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. .[9]

జిల్లాలో ప్రబలమైన సాంస్కృతిక కార్యక్రమాలలో హత్వా మహావీరి అఖర ప్రత్యేకమైనది. ఇది 2 రోజులపాటు నిర్వహించబడుతుంది. మొదటి రోజు మహావీర్ పూజ 17 గ్రామాలలో నిర్వహించబడుతుంది. 17 గ్రామాలు అఖరాలో పాల్గొటాయి. మహావీరుని విగ్రహం గ్రామంలోని ప్రతి ఇంటికి తీసుకువెడతారు. గృహంలోని బ్రహ్మచారి మహావీరునికి పూజలు చేస్తారు. మరుసటి రోజు స్మితిలన్నీ హథుయా మార్కెట్‌కు చేరుకుంటాయి. అక్కడ యువకులు వారి అస్త్రకౌశలం ప్రదర్శిస్తూ ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటారు.

రాజకీయాలు

[మార్చు]

రాం దులారీ సింగ్

[మార్చు]

శ్రీమతి రాం దులారీ సింగ్ (శ్రీమతి రాం దులారీ సింహా) జిల్లాలోని మాణిక్‌పూర్ అనే కుగ్రామంలో జన్మించింది. స్వాతంత్ర్యానికి ముందు ఆమె మాస్టర్ డిగ్రీ సాధించడం ఆమె ఆమె తల్లితండ్రులకు, గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది. ఆడపిల్లలను స్కూలుకు పంపడం కష్టతరమైన రోజులలో ఆమె మాస్టర్ డిగ్రీ సాధించడం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక ఆమె డబుల్ ఎం.ఎ చేసి బీహార్‌లో డబుల్ ఎం.ఎ చేసిన మొదటి మహిళగా కూడా గుర్తింపు పొందింది. ఈ జిల్లాకు చెందిన శ్రీమతి రాబ్రీదేవి బీహార్ రాష్ట్ర మొదటి మహిళా ముఖ్యమంత్రుగా గుర్తింపు పొందింది. శ్రీమతి రాం దులారీ సింహా స్వాతంత్ర్య సమరంలో కూడా పాల్గొన్నది. ఆమె రాష్ట్ర యూనియన్ మంత్రిగా పనిచేసి తరువాత కేరళ రాష్ట్రానికి గవర్నర్ అయింది. ఆమె నిజాయితీ కలిగిన రాజకీయ నాయకురాలు, అంకితభావమున్న కాంగ్రెస్ సభ్యురాలిగా పేరు తెచ్చుకున్నది.

Smt. Ram Dulari Sinha in the role of Governor of Kerala

బీహార్ ముల్హ్యమంత్రులలో ఒకరైన అబ్దుల్ గఫూర్ ఈ జిల్లాకు చెందినవాడే.

లల్లూ ప్రసాద్ యాదవ్

[మార్చు]

లల్లూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రాబ్రీ దేవి కూడా ఈ జిల్లాకు చెందినవాడే. లల్లూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. తరువాత లల్లూ ప్రసాద్ యాదవ్ పశువుల మేత కుంభకోణంలో చిక్కిన తరువాత ఆయన భార్య రాబ్రీదేవి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి 2005 వరకు కొనసాగింది. లల్లూ ప్రసాద్ యాదవ్ తరువాత యు.పి.ఏ తరఫున రైల్వే మంత్రిగా పనిచేసాడు.

కమలారాయ్

[మార్చు]

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన జిల్లాకేంద్రానికి 4 కి.మీ దూరంలో ఉన్న కరారియా గ్రామానికి చెందిన తరువాత కమలా రాయ్ రాజకీయాలో ప్రత్యేక గుర్తింపొ పొందాడు. ఆయన ఎం.ఎల్.ఏగా ఎన్నిక చేయబడ్డాడు. 1961లో ఆయనల్ హార్నెస్‌లో మరణించాడు. తరువాత సత్యేంద్ర నారాయణ సింహా ఎం.ఎల్.ఏగా ఎన్నిక చేయబడి విద్యామంత్రి తరువాత ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. స్వాతంత్ర్యానికి ముందు చప్రా బోర్డ్, లోకల్ బోర్డ్ లలో ఆయన ప్రధానపాత్ర వహించాడు. ఆయన గోపాల్‌గంజ్ ఉపవిభాగం, పరిసర ప్రాంతాలలో విద్యావ్యాప్తికి, ఆరోగ్య సేవలు అందించడానికి విశేషకృషి చేసాడు. డి.ఎన్. జిల్లాకు చెందిన తివారి పార్లమెంటు సభ్యుడిగా 1952 నుండి 1980 వరకు పనిచేసాడు. చంద్రికా రాం అప్పటి గోపాల్‌గంజ్ ఉపవిభాగం నుండి ఎన్నికై మొదటి ఈ ప్రంతానికి చెందిన మొదటి మంత్రిగా పనిచేసాడు. జిల్లకు చెందిన రాజ్ మంగళ్ మిశ్రా సంఘసేవ చేస్తూ, ఎం.ఎల్.ఏ, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్‌గా సేవలు అందించాడు. జిల్లాకు చెందిన ప్రభునాథ్ తివారి లోకమాన్య జయప్రకాష్ నారాయణ్ సన్నిహితుడుగా బీహార్ రాష్ట్రానికి సేవలు అందించాడు. ఆయన 1967లో సంభవించిన కరువు సమయంలో బిహార్ రిలీఫ్ కమిటీ సభ్యుడుగా సేవలు అందించాడు. 1962 నుండి 1968 వరకు ఎం.ఎల్.ఏగా సేవలు అందించాడు.

విద్య

[మార్చు]

గోపాల్‌గంజ్ జిల్లా ప్రజలకు స్వల్పంగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఉంది. జిల్లాలోని స్కూల్స్, కాలేజీలను ప్రభుత్వం, ప్రైవేట్ ట్రస్ట్, ప్రైవేట్ యాజమాన్యం చేత నిర్వహించబడుతున్నాయి. జిల్లాలోని స్కూల్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ (సి.బి.ఎస్.సి) లేక బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. .[10] ప్రైవేట్ స్కూల్స్ అధికంగా విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్లం, హిందీ మాధ్యమంలో బోధిస్తున్నాయి. వారు 10 సంవత్సరాల సెకండరీ విద్యను పూర్తిచేసిన తరువాత జూనియర్ కాలేజీలలో అనుమతించబడతారు. స్కూల్ స్థాయి విద్యను గోపాల్‌గంజ్ కేంద్రంగా ఉంది.

జిల్లాలోని పాఠశాలలు

[మార్చు]
  • సెయింట్ థొమొస్ అకాడమీ, భొరె
  • సెయింట్ క్సెవిఎర్ స్కూల్, భొరె
  • గవర్నమెంట్ హై స్కూల్, చకియ
  • సైనిక్ స్కూల్, గొపల్గంజ్
  • సెయింట్ జొషెఫ్ స్కూల్
  • జవహర్ నవోదయ విద్యాలయ గొపల్గంజ్
  • కేంద్రీయ విద్యాలయ
  • రెవొతిథ్ హై స్కూల్
  • డి.ఏ.వి. మధ్య స్కూల్ (డి.ఏ.విహై స్కూల్),
  • తూర్పు, పశ్చిమ స్కూల్.
  • న్యూటన్ పబ్లిక్ స్కూల్
  • హరి శంకర్ సింగ్ పబ్లిక్ స్కూల్ (వి.ఎం హై స్కూల్),
  • ధరందెవ్ ఉన్నత పాఠశాల షేర్,
  • ధరందెవ్ ఇంటర్మీడియట్ కళాశాల షేర్
  • నాగినా రాయ్ ఇంటర్ కాలేజ్ షేర్
  • హై స్కూల్ జమునహ బజార్
  • డాక్టర్ భి.ఆర్. అంబేద్కర్ ప్రభుత్వ. రెసిడెన్షియల్ హై స్కూల్, హథ్వ

మొదలైన పాఠశాలలు జిల్లాలో విద్యాభివృద్ధికి సహకరిస్తున్నాయి. హైయ్యర్ సెకండరీ తరువాత విద్యార్థులు విద్యను కొనసాగించడానికి జిల్లాలో తగినన్ని వసతి లభించడం లేదు. జిల్లాలో 290 ప్రాథమిక పాఠశాలలు, 100 సెకండరీ పాఠశాలలు, 8 హయ్యర్ సెకండరీ పాఠశాలలు 5 కళాశాలలు, 1 పాలిటెక్నిక్ కాలేజ్, 1 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్ ఉన్నాయి. ఇజనీరింగ్, మెడికల్ కాలేజీలు కానీ విశ్వవిద్యాలయం కానీ లేదు.

ఆరోగ్య సమస్యలు

[మార్చు]

నగరంలో 17 హాస్పిటల్స్ 19 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 80 సబ్ - సెంటర్లు ఉన్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామీణ ఆసుపత్రి, ప్రైమరీ హెల్త్ సెంటర్, డిస్పెంసరీల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహణలో ప్రజలకు ఆరోగ్యవసతులు అందించబడుతున్నాయి.

సమాచార వ్యవస్థ

[మార్చు]

నగరంలో చక్కని సమాచారవ్యవస్థ ఉంది. జిల్లాలో పూర్తిగా కంప్యూటరైజ్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది, 41 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, 11 టెలిగ్రాఫ్ ఆఫీసులు, టెలికాం సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో ఎయిర్సెల్, భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, హచ్ (భారత సెల్యులార్ సంస్థ), యూనినార్, ఎం.టి.ఎస్. ఇండియా, ఎస్ టెల్, టాటా ఇండికాం, టాటా డొకోమో, రిలయన్స్ ఇన్ఫోకాం,, రాష్ట్ర సొంతమైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మొదలైన సంస్థలు సమాచార సేవలు అందిస్తున్నాయి.

మాధ్యమం

[మార్చు]

జిల్లాలో ఎఫ్.ఎం రేడియో స్టేషను (రింఝిం ), టి.వి బ్రాడ్‌కాస్టింగ్ చానల్ ఉన్నాయి. జిల్లాలో 5 మూవీ దియేటర్లు ఉన్నాయి. ఇందులో హిందీ, భోజ్‌పురి భాషా చిత్రాలు ప్రదర్శించబడుతుంటాయి. మొదటి దియేటర్ (జంతా చినిమా) 1958లో నిర్మించబడింది. హజియాపూర్ చౌక్ వద్ద కృష్ణా సినిమా, జాదోపూర్ చౌక్ వద్ద సరస్వతి సినిమా, సత్యం సినిమా హాల్స్ ఉన్నాయి. దైనిక్ జాగ్రణ్, దైనిక్ హిందూస్థాన్, ఆజ్, ప్రభాత్ ఖబర్, హిందూస్థాన్ టైంస్, సహారా సమే, టైంస్ ఆఫ్ ఇండియా మొదలైన వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయి..

క్రీడలు

[మార్చు]

జిల్లాలో ఇండోర్, ఔట్‌ డోర్ స్టేడియాలు (అంబేద్కర్ భవన్ - మింజ్ స్టేడియం ) ఉన్నాయి.

భాషలు

[మార్చు]

భాషలు భోజ్‌పురి భాషను 4,00,00,000 ప్రజలకు వాడుక భాషగా ఉంది. భోజ్‌పురి భాష వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతుంటారు.[11]

ప్రముఖులు

[మార్చు]
  • అబ్దుల్ గఫార్ :- బీహార్ మొదటి, ఒకేఒక ముఖ్యమంత్రి (1973 నుండి1975) గుర్తించబడుతున్నాడు.
  • అనురాగ్ కుమార్ :- టాక్స్ అడ్వొకేట్
  • లల్లు ప్రసాద్ యదవ్ :- మునుపటి బీహార్ ముఖ్యమంత్రి, మునుపటి రైల్వే మంత్రి.
  • రాబ్రీదేవి :- బీహార్ మొదటి మహిళా ముఖ్యమంత్రి. లల్లు ప్రసాద్ యాదవ్ భార్య.
  • రాందులారీ సింహా :- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యురాలు, మునుపటి రాష్ట్ర యూనియన్ మంత్రి, మునుపటి కేరళ గవర్నర్, స్వతంత్ర సమర యోధురాలు.
  • చిత్రగుప్త : ప్రముఖ హిందీ సినిమా సంగీత దర్శకుడు.

మూలాలు

[మార్చు]
  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Tenerife2,034km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551
  8. "Gopalganj District At a Glance". Gopalganj.bih.nic.in. 2011-07-21. Archived from the original on 2011-07-21. Retrieved 2014-12-09.
  9. "Welcome GOPALGANJ". Gopalganj.bih.nic.in. 2011-07-21. Archived from the original on 2011-07-21. Retrieved 2014-12-09.
  10. "బీహార్ School Examination Board". బీహార్board.bih.nic.in. 2010-12-03. Archived from the original on 2007-05-23. Retrieved 2012-08-24.
  11. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
12.^https://web.archive.org/web/20131002205029/http://www.ietypschennai.org/award/2008-09%20awards.html

http://wikimapia.org/22647053/East-West-International-School http://wikimapia.org/18456575/St-Joseph-s-School

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]