Jump to content

ముంగేర్ జిల్లా

వికీపీడియా నుండి
ముంగేర్ జిల్లా
मुंगेर जिलाضلع مگیر
బీహార్ పటంలో ముంగేర్ జిల్లా స్థానం
బీహార్ పటంలో ముంగేర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుముంగేర్
ముఖ్య పట్టణంముంగేర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుముంగేర్
విస్తీర్ణం
 • మొత్తం1,419.7 కి.మీ2 (548.1 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం13,59,054
 • జనసాంద్రత960/కి.మీ2 (2,500/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.30 %
 • లింగ నిష్పత్తి879
ప్రధాన రహదార్లుNH-80, NH-333
సగటు వార్షిక వర్షపాతం1146 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
జమాల్పూర్ సమీపంలోని కొండలు

బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ముంగేర్ జిల్లా (హిందీ:) ఒకటి.ముంగేర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.ముంగేర్ జిల్లా ముంగేర్ డివిజన్‌లో భాగం. జిల్లా అక్షరాస్యత 73.3%. రాష్ట్ర అక్షరాస్యత 63.8% కంటే ఇది అధికం. దేశీయ అక్షరాస్యత 74.04% కంటే ఇది తక్కువ.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

జిల్లాకేంద్రం పేరును జిల్లాపేరుగా నిర్ణయించారు. ఈ పేరుకు కారణంగా పలు కథనాలు వాడుకలో ఉన్నాయి. మొదటి కారణం ఈ ప్రాంతం పురాతన ముద్గగిరి అని భావిస్తున్నారు. మహాభారతంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. దేవపాలా కాలం నాటి తామ్రపత్రాలు లభించాయి. మకర్షి ముద్గలుడు (మౌద్గల్యుడు) (బుద్ధుని శిష్యుడు) నివసించిన ప్రంతం కనుక ఇది ముద్గగిరి అయిందని మరొక కథనం వివరిస్తుంది. ఇది ముండా ప్రజలు నివసించిన ప్రాంతం అని వారు ఈ ప్రాంత స్థానిక ప్రజలని అందుకే ఇది ముంగేర్ అయిందని విశ్వసిస్తున్నారు. ఇది మునులు నివసించిన ప్రాంతం కనుక ఈ పేరు వచ్చిందని పలువురు విశ్వసిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

జిల్లా భూభాగం పూర్వం అంగ మహాజనపదాలలో భాగంగా ఉండేది. మహాభారంలో దీనిని కర్ణుడు పాలించాడు. ముద్గగిరి (ముంగేర్) పలా సంరాజ్యానికి రాజధానిగా ఉండేది. తూర్పు ఇండియాను బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ముందుగా " మీర్ కాశిం " చివరిసారిగా ఈ భుభాగ రక్షణ కొరకు యుద్ధం చేసాడు. మీర్ కాశిం నిర్మించిన కోటకు 3 ద్వారాలు ఉండేవి. 4 వ వైపు గంగాతీరం ఉండేది. బ్రిటిష్ పాలనా కాలంలో ఈ ప్రాంతం " మంఘిర్ " అని పిలువబడింది. ఆరంభకాలంలో ముంఘీర్ భాగల్‌పూర్ భూభాగంలో భాగంగా ఉండేది. 1832లో ఈ ప్రాంతం జిల్లాగా రూపొందించబడింది.

ముంగేర్ నుండి 7 జిల్లాలు రూపొందించబడ్డాయి. 1976లో బేగుసరాయ్ ;[1]1988లో ఖగరియా జిల్లా,[1], 1999లో జమూయి, లఖిసరాయ్, షేఖ్‌పురా జిల్లా రూపొందించబడ్డాయి.[1] ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం. [2]

భౌగోళికం

[మార్చు]

ముంగేర్ జిల్లా బీహార్ రాష్ట్ర దక్షిణ భూభాగంలో ఉంది. జిల్లాకేంద్రం గంగానది దక్షిణతీరంలో ఉపస్థితమై ఉంది. ముంగేర్ జిల్లా వైశాల్యం 1419చ.కి.మీ. [3] ఇది పూర్తిగా రష్యాలోని ఉరుఫ్ ద్వీనికి సమానం.[4] జిల్లా వైశాల్యం రాష్ట్ర వైశాల్యంలో 3.3%. జిల్లా 240 22 నుండి 250 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం 850 30 నుండి 870 3 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.[5] 1832లో ముంగేర్ జిల్లా భాగల్‌పూర్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది.

సరిహద్దులు

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో గంగానది ప్రవహిస్తుంది. గంగానదికి ఆవలి ఒడ్డున వాయవ్య సరిహద్దులో లఖిసరాయ్ జిల్లా, నైరుతీ సరిహద్దులో బేగుసరాయ్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో భాగల్పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో బంకా జిల్లా, గంగానదికి ఆవలి తీరంలో ఉత్తర సరిహద్దులో ఖగరియా జిల్లా ఉన్నాయి.

ఈ జిల్లా నుండి సహర్సా జిల్లా, మాధేపురా జిల్లా, బేగుసరాయ్ జిల్లా, జమూయి జిల్లా, షేఖ్‌పురా జిల్లా, ఖగరియా జిల్లా, లఖిసరాయ్ జిల్లా విభజించబడ్డాయి. ముంగేర్ జిల్లా బిహార్ రాష్ట్ర దక్షిణ భుభాగంలో ఉంది. ఈ జిల్లా కేంద్రం గంగానదికి దక్షిణ తీరంలో ఉంది. జిల్లా 24°20', 25°30' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85°37' నుండి 87°30' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 30 నుండి 65 మీ.ఎత్తున ఉంది.

నదులు

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా గంగా, మొహనె, హరోహర్, కియుల్ జిల్లాలు ఉన్నాయి.

గ్రామాలు

[మార్చు]

దలహట్టా బుజర్ కుంహర్తోలిలో 80% మంది కుమ్మరి వారు (కుంహర్) ఉన్నారు. కుంహర్తోలి సమీపంలో ఉన్న బాత్‌తోలిలో చంఢీ ఆలయపూజారి నివసిస్తున్నాడు. ఈ గ్రామంలో బాత్ బ్రాహ్మణులు, బ్రాహ్మణులు, రాజపుత్రులు ఉన్నారు. ఇక్కడ వేయిమంది రాజపుత్రులు నివసిస్తున్నారు కనుక ఈ గ్రామం బస్దుయపూర్ అని పిలువబడింది. కరగ్‌పూర్ లోని పర్సండో గ్రామంలో శిఖర్వార్ రాజపుత్రులు భూస్వాములు, బ్రాహ్మణులు, ఇతర కులస్తులు నివసిస్తున్నారు. కరగ్‌పూర్ లోని కలా గ్రామంలో అధికంగా బ్రాహ్మణులు, రాజపుత్రులు నివసిస్తున్నారు. మొహనే నదీతీరంలో నివసిస్తున్న సుపౌర్ జముయా గ్రామ ప్రజలు స్వాతంత్ర్య సమరంలో ప్రముఖపాత్ర వహించారు. 1902-1930 లలో ఈ గ్రామాన్ని పలువురు కాగ్రెస్ నాయకులు సందర్శించారు.[6] ముంగేర్ జిల్లాలో ఉన్న రతైతా గ్రామం జిల్లాలో అతి పెద్దదిగా గుర్తించబడుతుంది.

ఆలయాలు

[మార్చు]

జిల్లాలోని ప్రఖ్యాత ఆలయాలలో చంఢికా ఆలయం (శక్తిపీఠం) ఒకటి. షాదీపూర్‌లో బరి దుదుర్గా ఆలయం ఉంది. పతం వద్ద ఋషికుండం, దర్యార్‌పూర్ వద్ద సీతా కుండం, శివ గురు ధామం, జమల్‌పూర్ కాళీపహర్, లాల్ దర్బజా సమీపంలోని శివాలయం ఉన్నాయి. కోట సమీపంలో ఉన్న కషత్ హర్ని ఘాట్, బట్టోయి వద్ద ఉన్న హనుమాన్ ఆలయం ఉన్నాయి.

వాతావరణం

[మార్చు]

జిల్లాలో మార్చి- మే వరకు వేసవి, జూన్- సెప్టెంబరు వరకు వర్షాకాలం, అక్టోబరు - ఫిబ్రవరి శీతాకాలం. సరాసరి వర్షపాతం 1146 మి.మీ. (53 సంవత్సరాల సరాసరి).

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 3 విభాగాలు ఉన్నాయి :- ముంగేర్ సాదర్, కరగ్‌పూర్, తారాపూర్.
  • ముంగర్ ఉపవిభాగంలో 4 మండలాలు ఉన్నాయి :- సాదర్, జమాల్‌పూర్, బరియాపూర్, ధర్హరా.
  • కరగ్‌పూర్ ఉపవిభాగంలో 2 మండలాలు ఉన్నాయి :- కరగ్‌పూర్, తెతియా బంబర్.
  • తారాపూర్ఉపవిభాగంలో 3 మండలాలు ఉన్నాయి :- తారాపూర్, అసర్గంజ్, సంగ్రామపూర్.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ముంగేర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[7]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,359,054,[8]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం..[10]
640 భారతదేశ జిల్లాలలో. 358 వ స్థానంలో ఉంది.[8]
1చ.కి.మీ జనసాంద్రత. 958 [8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.45%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 73.3%.[8]
జాతియ సరాసరి (72%) కంటే. స్వల్పంగా అధికం

భాషలు

[మార్చు]

జిల్లాలో ఇండో ఆర్యన్ భాషలలో ఒకటైన అంగిక భాష 7, 25, 000 వాడుకలో ఉంది.[11]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1976లో ముంగేర్ జిల్లాలో 682 చ.కి.మీ విస్తీర్ణంలో " విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడ్జింది.[12]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  3. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Urup 1,436km2
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-19. Retrieved 2014-12-08.
  6. http://ashishmunger.blogspot.com/
  7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  11. M. Paul Lewis, ed. (2009). "Angika: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  12. Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]